
ఊరిలో రేగిన జ్ఞాపకాలు
కొత్త శీర్షిక ప్రారంభం

ఇక్కడ యెంత ప్రశాంతగా ఉంటుందో ఒక్కోసారి అంత పెద్ద సంఘటనలు జరుగుతాయి లేదా అందరూ ఆశ్చర్యపోయే విషయాలు జరిగిపోతుంటాయి. విశాఖ నగర నడిబొడ్డుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రాంతం భలే చిత్రమైనది, అందమైనది, అబ్బురమైనది.
గొల్లలు, వెలమలు, తూర్పుకాపులు, బ్రాహ్మలు ,రెల్లీ లు ఇక్కడ ఎక్కువగా వుంటారు.
శ్రీకృష్ణ దేవరాయల పాలనలో, విజయనగర రాజుల పాలనలో ఈ ప్రాంతం ఉందని చరిత్ర చెబుతోంది. కృష్ణదేవరాయలు బ్రాహ్మలకు అగ్రహారం రాసిచ్చినట్లుగా చరిత్ర చెబుతోన్న “కృష్ణరాయపురం”గ్రామం ఇక్కడ వుంది. మేఘాద్రి రిజర్వాయర్ పక్కన “చింతల అగ్రహారం” కూడా వుంది. సౌభాగ్య రాయపురం,పినగాడి,పెదగాడి,వేపగుం ట,పాపయ్యరాజు పాలెం, జుత్తాడ, గుర్రంపాలెం లాంటి అందమైన చిత్రమైన పేర్లు ఈ ప్రాంతం సొంతం.
తళుకు బెళుకుల నీలాల చీరకట్టిన సముద్రం చూడటానికి ఇశాఖపట్నం వెళ్లాలన్న, అందమైన గరుకులేని అరకు వెళ్లాలన్నా , కొత్తవలస.. విజీనగరం వెళ్లాలన్నా, బెల్లం కోసం, శారదా నది గాలి కోసం అనకాపల్లి వెళ్ళాలన్నా మా పెందుర్తి జంక్షను నుంచి నాలుగు దారులున్నాయి.
జొన్నలు, రాగులు సజ్జలు,మిరప, వంకాయ, టమాటో పండించే పొలాలన్నీ కాలనీలుగా మారిపోతుండగా, ఒక పక్క తూర్పు కనుమలు, సింహాచలం కొండా అందంగా కనపడతాయి.
కొండలపై నుంచి ప్రవహించే గెడ్డలు, వాటిని ఆనుకొని వున్న మామిడి, జీడి మామిడి తోటలు, గుంపులుగా తాటిచెట్లు కొండలమీద నుంచి వీచే హాయైన గాలి, ఎండాకాలం ఉక్కపోతతో తిక్కపోత ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడి జనానికి మమకారం, వెటకారం రెండూ ఎక్కువే.
‘నువ్వు జెప్పింది నానెందుకు ఆలకించాల, నాకేటి తెలీదనుకున్నావా, నాకేటి తెలవకపోయిన వోదిస్తాను’ అని ఎవుడైనా ఎవుడితోనైనా అంటున్నాడంటే ఆడు పెందుర్తి వోడే అయ్యి ఉంటాడు.
ఇక్కడ జరిగిన అబ్బురమైన విశేషాలను, సంఘటలను , మార్పులను కల్పిత వాస్తవాలతో చెప్పేవే ఈ పెందుర్తి కథలు.
ఊరి సాహిత్యం విస్తృతంగా రావాలి. యెంత విస్తృతంగా అంటే చరిత్ర అడుగున దాగిన వాస్తవాలు, జనజీవితం, ఆ జీవితాల్లోని అందం, ఆనందం, విషాదం, ఆర్థిక, సామాజిక మార్పుల చట్రాలలో మారిన మూలవాసుని జీవనం గురించి తెలియాలి. శతాబ్దాలుగా రాని మార్పు ఒకటి రెండు దశాబ్దాలలోనే పెందుర్తి లో ఎందుకింత వేగంగా వొచ్చిందో తెలియాలి. ఆ వేగంలో నలిగిన జీవితాలెన్ని, బాగుపడిన బతుకులెన్ననేది లెక్క తేలాలి.
ఒకప్పుడు మహా నగరానికి శివారు ప్రాంతమైన పెందుర్తి కాలక్రమంలో అనేక మార్పులకు గురయ్యింది, గ్రామాలు కాలనీలుగా, కాలనీలు అపార్టుమెంట్లుగా, చెరువులు ఆక్రమిత కాలనీలుగా, భూ వ్యాపారం పదింతలుగా ఇలా ఎన్నో మార్పులు.
ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణ ఇరుకువాడలలో వున్నవాళ్లు కొంత వెసలుబాటుతో పిల్లల మెరుగైన విద్య కోసం, ప్రశాంతమైన జీవితం కోసం ఈ కాలనీలకు వలస వొచ్చారు, ఇవి ఇలా ఉండగానే గ్రామాలు తమ అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకున్నాయి, ఏ మార్పులకు లోనయ్యాయి ఇవ్వన్నీ పెందుర్తిలో చూద్దాము.
పట్టణ ఇరుకువాడల నుంచి, గ్రామాలనుంచి వొచ్చిన ఈ ఉద్యోగులు తిన్నగా వుంటారా ? అప్పటి ట్రెండు ఏదైతే దాని వెనక పడతారు, అలా విప్లవాగ్నిలో బూడిదలైన పవిత్రులెందరు? ఆయా కుటుంబాలలో వొచ్చిన కుదుపులెన్ని ? ఇలా ఎన్నో కథలు.
ఇక గ్రామాల్లో నయితే గరువులు అమ్ముకొని ‘సొమ్ములు పోనాయండి బాబో’ అని లబోదిబోమంటూ గోధుమవర్ణపు తీర్ధంలో మునిగితేలుతుంటారు. ‘మా కులపోడే మమ్మల్ని ముంచీనాడండి బాబో..తాకట్టు పెట్టినాడు, నంజి కొడుకు మా బతుకుల్ని’ అని తిడుతుంటారు.
రాజులు రాజ్యాలు పోయినా రాచరికం పోని రాజులు, వాళ్లతో పోటీ పడే పాత్రుళ్ళు, అభ్యుదయం కోసం కుటుంబాలను పక్కనపెట్టి న వాళ్ళు, శ్రమ చేయకుండా శ్రమ కోసం ఉపన్యసించే వాళ్ళు, ‘పార్టీ ‘ ని నమ్ముకోవడం కంటే అమ్మేసుకోవడమే మంచిదని భావించే వాళ్ళు ఆల్లేటి ఈళ్లేంటి ఒకప్పుడు కలిసి మెలసి ఒక కమ్యూను లా వున్న కమ్యూనిస్టు కుటుంబాలలో నూతన ఆర్ధిక విధానాల తరువాత వొచ్చిన కొత్త అవకాశాలు, విద్యలు, వస్తువులు, ఉద్యోగాలు తెచ్చిన విచ్చిన్నాలు.
కార్యకర్తలు కొత్తగా నేర్చిన నాటకాలు, నాయకత్వంపై మమకారాలు, ఈ సమాజపు వినియోగ రోగంతో పేదలకే పెట్టుబడి దృక్పధాలు రావడాలు , పేదవాడే పేదవాడిని దోచుకోవడాలు ఇలా ఎన్నో విచిత్రాలు.
‘బర్మాకేంపు కథల’ మీదుగా ఇలా నగర శివార్లకు వొచ్చిన కథకుడు హరివెంకట రమణ నుంచి వొచ్చే ఈ పెందుర్తి.ఆర్గ్ (ఊరిలో రేగిన జ్ఞాపకాలు) కథలు.. జీవితం ఏ ఎత్తు పల్లాలు చూసిందో, ఏ కొత్త అనుభవాల నాగ మల్లెలను ఏరుకుందో వొచ్చే సంచిక నుంచి చూద్దాము.
*
లోగో: ఆర్టిస్ట్ ఆనంద్
మంచి ప్రయత్నం. ఓ ప్రాంతం ఆచార వ్యవహారాలు, విశేషాలు కధలు రూపంలో అందించడం అభినందనీయం
పెందుర్తి కధలు మంచి ప్రయత్నం. ఓ ప్రాంతం, ఆచార వ్యవహారాలు గురించి కధలు రూపంలో తెలియజేయడం అభినందనీయం.
మీ అభిమానానికి ధన్యవాదాలు రాంబాబు గారు.
Very information covered in your article sir
Thank you, Laxmana rao garu, the stories will be publishing from next …
చాలా బాగుంది. రాత చాలాబాగుంది . హరి కి ధన్యవాదాలు.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు, sastry గారు.
It’s very useful Sir… Good information
Happy to know about the origin of the place and it’s culture especially the slang of the language….. it’s enriching
Good job Sir…. 👍
Thank you, Sangeetha garu.
ఓ ప్రాంతం ఆచార వ్యవహారాలు, విశేషాలు కధలు రూపంలో అందించడం చాలా మంచి విషయం గ్రామాలలో జరిగేయ్ విషయాలను తెలియజేశాయి నాకు చాలా బాగా నచ్చింది .
Thank you, Sailu mosya for your opinion.
చాలా మంచి విషయం గ్రామాలలో జరిగేయ్ విషయాలను తెలియజేశాయి నాకు చాలా బాగా నచ్చింది .
Good information about the culture and traditions, I appreciate your hard work 👍
Excellent and great efforts
పెందుర్తి కథలు నేపధ్యమే ఆకర్షణీయంగా వుంది.కథలు ఇంకా బాగుంటాయని తెలుస్తోంది. చాలా మంచి శీర్షిక.నిజానికి ప్రతీ ఊరి కతా రావాలి,యెన్నెన్నో విశేషాలు,వెటకారాలు,మమకారాలు,తెగువలు తెలుస్తాయి.
అభినందనలు రచయితకు.
శీర్షిక మీకు నచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు స్పందించడం, అభినందించడం నాకు ఎంతో ఆనందం.
మన గురించి మనం తెలుసుకోవడం కూడా ఒకలాంటి కొత్త అనుభూతి మన తాతలు ముత్తాతలు గురించి మనం ఎంత ఆసక్తిగా వింటామో అందరికీ అనుభవమే అలాంటి బిగుతు లోతు కలిగిన అనుభవాలను క్రిందటి భర్మా క్యాంప్ కథల ద్వారా హరిగారు పంచారు ,ఇందులో అంతకు మించిన గొప్ప అంశాలను మన ముందుకు తెస్తారని మరిన్ని రావాలి కథలు చదివేవాళ్ళు పెరిగేలా ఈ శీర్షిక ఉండబోతోందని ఆశిస్తున్నాను 🙏🏻❤️
“Thank you, Kiran garu. I will definitely not disappoint you.”
Absolutely love how beautifully this is written and this is very much igniting the interest for the upcoming Pendurti org kathalu. The observations of the writer reflected in the intro made me curious to know further more of the observations that the writer has and how he has intertwined them in the stories set up in Pendurti. Looking forward 😊
Thank you, Ananya. ఇది ఒక కథామాలిక. ప్రతి కథకూ తన స్వంత వైశిష్ట్యం ఉన్నప్పటికీ, వాటిని అన్నిటినీ అల్లే ఒక అంతస్సూత్రపు దారం ఉంటుంది – అదే పెందుర్తి జీవితం. నేను తప్పకుండా దీనిని అందంగా చెప్పేందుకు కృషి చేస్తాను.
ఒకప్పుడు పాపయ్య రాజు పాలెం వాస్తవ్యుడిగా మీరుదహరించిన అన్ని పల్లెల, ప్రాంతాల పేర్లు నన్ను మళ్ళీ పెందుర్తి పరిసర ప్రాంతాల జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళాయి. మీ కలం నుండి జాలువారబోయే పెందుర్తి విశేషాల, కథల, దాగిన నిజాలకోసం ఆర్తి గా ఎదురు చూస్తున్నాను. హృదయ పూర్వక అభినందనలు హరి వెంకట్ గారూ.
పి వి రామశర్మ,
విశాఖపట్నం
మీ షాదుకు ధన్యవాదాలు రామశర్మ గారు.