ఒక పాదం-
మహా తపస్వి జ్ఞాన దీపాన్ని చిదిమేస్తుంది
అస్తిత్వ సూర్యుణ్ణి పాతాళంలోకి తొక్కేస్తుంది
నల్ల మందార పువ్వు ఊపిరిని నలిపేస్తుంది !
ఇంకొక పాదం-
ఆడబిడ్డ జాడ కోసం సముద్రాలను లంఘిస్తుంది
హిమవన్నగ సౌందర్యంలోకి వాయు వేగంతో తేలిపోతుంది
వేలాది ఏళ్ళ చంద్రుడి కవ్వింపుకి సమాధానం చెప్తుంది
ఊపిరి జెండాను ఎగరేయడానికి ఊరికి నడిపిస్తుంది !
మొదటి పాదం-
దుర్వాసుడు, బలి, George Floyd లను
యుగాల నుండి వెంటాడి వేటాడి
పునః పునః చంపేస్తుంది..
I can’t Breathe…. !
రెండో పాదం-
హనుమంతుడు, ప్రవరుడు,
Neil Armstrong, వలస కూలీ నారాయణలను
స్థల కాలాలకు అతీతంగా వెతికి వెతికి
మళ్ళీ మళ్ళీ బతికిస్తుంది…
It’s a Giant leap for mankind….!!
ఇప్పుడు నా పాదానికి
మహిమలు- మాయలు- మర్మాలు తెలియని
రంగు రుచి వాసన అసలే లేని లోకం కావాలి
ఊపిరి పువ్వుకు – ఊరి నవ్వుకు దారి చూపే కాలం రావాలి
as the sound of the marching feet of a determined people…!!!
*
English references:
కవిత కాలానుగుణంగా బాగుంది
సారంగ లోని కవితలు ,కథలు అన్నీ జీవన ‘సారం’గా ఉన్నాయ్.
Top.Great!
Excellent
Very touching హరికృష్ణ గారూ🙏🙏🙏
మామిడి హరిక్రిష్ణ గారి కవిత వొక సూక్ష్మదర్శిని. నాలుగేసి పాదాల వొక్కో పాదపు వర్ణన రెండు చరణాల కవిత వొక అద్భుత కవితానిర్మాణం పాటించిందనిపించింది. మొదటి పాదం గురించిన చరణంలో మొదటి లైను పురాణాన్నుంచి, రెండోలైను చారిత్రకత నుంచి, మూడోలైను సమకాలీన సామాజికత నుంచి తీసుకుని కవిత్వాన్ని అల్లారు. మరో పాదం గురించిన వర్ణనలోనూ అంతే…. జార్జిఫ్లాయిడ్ చిట్టచివరి శ్వాస (ఆర్తనాదం), నీల్ ఆర్మస్ట్రాంగ్ రేడియో సందేశం, మార్టిన్ లూథర్ కింగ్ తన గొంతులోంచి గాలిలోకి విసిరిన నిప్పుకణికల్ని ముగింపుగా కవితను రగిలించడం చాలా బాగుంది. …..ఉదయ్. టి.
Thank u so much sir..
బ్రహ్మా కడిగిన పాదంనికి…అర్ధం తెలిపింది. మీకవిత..👌,కవిత బాగుంది సర్!💐అభివందనలు