సారంగ చదువరుల కోసం!
గత ఆరు నెలలుగా సారంగ కోసం వచ్చే రచనల సంఖ్య అమితంగా పెరిగింది. ముఖ్యంగా 20 ప్లస్ తరం ఈ మధ్య ఎక్కువగా సారంగలో భాగం పంచుకుంటోంది. రచనల సంఖ్య పెరగడం వల్లా, సారంగ ఇప్పుడు పక్ష పత్రిక మాత్రమే కావడం వల్లా- అనేక కథలూ, కవితలూ నెలల తరబడి పెండింగ్ లో పడిపోతున్నాయ్. మాకూ ఈ ఎదురుచూపు స్వానుభవమే కాబట్టి ఇలాంటి నిరీక్షణ ఎంత కష్టమో మాకు తెలుసు.
ఈ వెలితిని భర్తీ చేయడానికి- ప్రతి శుక్రవారం రెండు కొత్త శీర్షికల్ని ఇక నుంచి “సారంగ”లో పెడ్తున్నాం. ఇప్పుడు నాకూ, కల్పన కి వున్న సమయాభావం వల్లా, వుద్యోగ వొత్తిళ్ల వల్లా- ఇది కష్టమే! కానీ, కొత్త తరం రచయితలూ కవులూ ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు నిరాశలో పడడం మా మనసుకి కష్టంగా వుంది.
ఈ శుక్రవారం నుంచి 1. ఈ వారం కథ 2. ఈ వారం కవిత శీర్షికలు వుంటాయి.
అయితే, చిన్న మనవి:
- ఈ రచనల ప్రచురణ కోసం కూడా మీకు కొంత నిరీక్షణ తప్పదు. వారం వారం కదా అని కవితా, కథా పంపించగానే కళ్ళల్లో వొత్తులు పెట్టుకోవద్దు దయచేసి! ఎదురుచూడండి. ఓపిక పట్టండి.
- కథ, కవిత ఎంపిక కోసం ఇప్పుడు పీర్ రెవ్యూ పెడ్తున్నాం. అంటే, ప్రతి కవితనీ, కథనీ ముగ్గురు సమకాలీన రచయితలో, విమర్శకులో ముందే సమీక్షిస్తారు. వాళ్ళ నుంచి అందే ఫీడ్ బ్యాక్ ని బట్టి రచన అచ్చు వేయాలా వద్దా అనేది నిర్ణయిస్తాం.
- రచన నాణ్యతని మెరుగుపరచడానికి ఈ రివ్యూ పానెల్ చేసే సూచనలు- అవసరాన్ని బట్టి- మీకు పంపిస్తాం. మీ రచనని మెరుగుపర్చే మార్పులు చేయడానికి సిద్ధంగా వుండండి.
ఎంతో కాలంగా సారంగ వెంట నడుస్తున్న మీకు రచనల విలువ తెలుసు. మీ రచనలే కాదు, ఇతర రచయితల రచనల విలువ కూడా తెలుసు. కాబట్టి, మా శ్రమనీ, ప్రయత్నాన్నీ అర్థం చేసుకుంటారన్న నమ్మకం కూడా వుంది.
- అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు
ముఖ్యమైన గమనిక: మీ రచనలు మాత్రమే చదువుకొని, ఆ కామెంట్లు మాత్రమే చూసుకోవడంలోని లౌల్యం మంచిదే. కానీ, ఇతరుల రచనలు కూడా చదవండి. వాళ్ళ సృజనాత్మక శ్రమని కూడా గౌరవించండి. వాళ్ళ రచనలకూ మీ వ్యాఖ్యలు విస్తరించండి.
మంచి ప్రయత్నం సార్.!💐💐💐 మాలాంటి యువకుల రచనలు కోసం మీరు ఆలోచించడం, వాటిని ప్రచురించడం చాలా బాగుంది.🙏🙏🙏
మంచి ప్రయత్నం, కొత్త వాళ్లకు, ప్రోత్సాహం..👍!
మంచి ఆశయంతో ప్రారంభిస్తోన్న పై రెండు కొత్త శీర్షికల ద్వారా మరికొందరు కొత్త కవి/కవయిత్రులు, రచయిత/రచయిత్రిలూ వెలుగులోనికి వస్తారని ఆశిస్తున్నాను. all the best & thank you Saranga.
మంచి ఆలోచన
కథ కవితల ఎంపిక కోసం పీర్ రెవ్యూ, విమర్శకుల సమీక్ష, దానిపైన ఫీడ్ బ్యాక్…..Wonderful filtration to maintain the quality of web magazine….I think this is the first magazine to introduce such novel procedure for quality maintenance..All the best
మంచి ప్రయొగానికి
మంచి ఫలితాలు
ఆశించవచ్చు…….కె.ఎల్వీ *
మీ సాహిత్య పోషణ యోచన కడు ప్రశంసనియ్యము. నేను కధలు కవిత్వాలు వ్రాస్తాను.