ఈ పుస్తకాలు ఎక్కడ ?!

1912 లో కృష్ణాపత్రిక లో వెలువడ్డ ప్రకటన ఇది. మరీ వివరంగా చెప్పాలంటే ఆగస్టు 2, 1912. ప్రకటన విడుదల చేసింది ‘కవిరాజు’ త్రిపురనేనిరామస్వామి ఈ పుస్తకాలు కాని అవి ఎక్కడ దొరుకవచ్చో మీకు తెలిసినంత మట్టుకు తెలియజేయండి. హడావుడిగా గౌతమిలోనే, వేటపాలెంలోనో, బెజవాడ కాలువ ఒడ్డున జగన్మోహనరావు గారి దగ్గిరో దొరుకుతుందని చెప్పొద్దు. అవన్నీ అందరికి తెలిసినవే. కనీసం పుస్తకాల వెతుకులాటలో ఉన్నవారందరి తొలి మెట్టు అక్కడే. కాబట్టి ఇంకెక్కడైనా ఉంటే తెలియజేయగలరు. ‘కవిరాజు’ సమగ్ర సాహిత్యం ప్రచురించే క్రమంలో వెతుకుతున్నప్పుడు ఈ ప్రకటన మిత్రుడు అశోక్ కుమార్ దృష్టికి వచ్చింది. దయచేసి మీకు తెలిసిన వివరాలేమన్న ఉంటే తెలియజేయగలరు. ముందస్తు ధన్యవాదాలు.

ప్రకటనలో ఉన్న విషయం ఇదిః

భారత మెన్నడుచదువలేదా?
చదివిన సందియము లేవియుఁదోఁచ లేదా?
తోచినఁ గురు క్షేత్ర సంగ్రామమును జదివియే
లపోఁ గొట్టుకొన గాదు? వెల 0_8_0

సంయుక్త
శైలిమృదుమధురము రసోచితము వెల 0–10-0

నేత్రావధాన చంద్రిక
ఎట్టి రహస్యములనై నఁ బలువురలో నుండి
దీని సహాయమున నేత్రములతోఁ దెలుపుకొన
వచ్చును, వెల 0_2_0

మానసబోధ శతకము
భక్తి రసము వెల 0.10_0

త్రిపురనేని రామస్వామి
బచ్చు పేట, మచిలీపట్టణము.

*

అనిల్ అట్లూరి

అనిల్ వున్నచోట ఉత్సాహం. సాహిత్య ఉత్సవం. తక్కువ రాసినా వాసికి పెద్ద పీట. అభ్యుదయానికి ఇవాళ్టి బాట.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు