ఈ నగరంలో వాన జాడ…

HAIDARAABAADH డేస్ అను పల్లెటూరోని కైతలు – 11

గరంలో ఏం తోచదు
దానికి తోడు తలనొప్పి
బయట కుసిలిస్తూ వాన
ఎంత కురిసినా ఈ నగరంలో వాన జాడ కనిపెట్టలేం
వాన నగరంలో స్కేటింగ్ చేసి వెళ్ళిపోతుంది
లేకపోతే జారుడు బల్లా ఆడుతుంది.
చుట్టూ చలి ముసురుకుంటున్నా
నిండుగా దుప్పటి కప్పుకోవాలనిపించదు
అలా ఏం తోచక పక్క మీద వాలితే నిద్రరాదు
ఊరిలో అయితే నేను ఏ వరకి పడుకునేది
ఏ వరకి మేలుకునేది నిద్రకి తెలుసు
ఇక్కడ నిద్రకి పిచ్చి పట్టింది
దానిలో మతి మరుపు చేరి
టైమును మర్చిపోయింది
ఈ తల నొప్పిలో నిద్ర పట్టక
ఒళ్ళు బరువయ్యాక
గది నిండా నా ఒళ్ళు పెరిగిపోతూ ఉంటే
కిటికీ బయట తారోడ్డు మీద నల్ల ముడ్డితో వాన
జారుడు బల్లా ఆట ఆడుతూ ఉంటుంది.
*

గూండ్ల వెంకట నారాయణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు