మరణం తర్వాతి
మొదటి ఉదయాన
స్నానం చేసే కోరికలేని
ముహూర్తాన్ని ఎంచుకోవాలి
చమటను ఆరేయడానికి
పర్వతాల మధ్య
ఓ దండేన్ని సిధ్ధం చేసుకున్నాక
రాత్రిని మడతపెడుతూనే
సూర్యుణ్ణి గది మధ్యలో వేలాడదీయాలి
నువ్వు తాకని ఆకుల చప్పుళ్ళు
నిన్ను తాకేలా నీ కోణాన్ని మార్చుకోవాలి
ఎటైనా చూడగలిగిన చర్మాన్ని పాదాలకు తొడుక్కోవాలి
స్వర్గీయ కురుల మీది
గాలిని మచ్చిక చేసుకోవాలి
జ్ఞాపకాలు రాలకుండా
చలువ కళ్ళద్దాలు ధరించాలి
కళ్లులేని శూన్యంతో
కాళ్లులేని మనసుతో పని ప్రారంభించాలి
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
ప్రతి మాటలో ఏదో మార్మికమైన తాజాదనం వుంది. రమణజీవి అన్నకు వందనం
మీ ప్రేమకు థాంక్స్ ప్రసాద మూర్తీ.