ఇడ్లి, వడ, సాంబార్

చుక్కలు…కొన్ని వందల వేల లక్షల కోట్ల చుక్కలు…ఒహ్! దే ఆర్ రన్నింగ్ మాన్…లైక్ టుగెదర్, ఫరెవర్. ఆనింగ్ సప్పొర్ట్ బీమ్ మీదుగా…కొన్ని వందల వేల స్ట్రీమ్స్.

న్ రైజ్ 6.14 సన్ సెట్ 5.44

చాల మంది లాగే ఉదయం పేపర్ రాగానే రాశిఫలాలు చూసుకునే వాళ్ళలాగా అతను ఆ రోజు వెదర్ ఫోర్‌కాస్ట్‌ని చూసుకున్నాడు. ఆ నవంబరు సాయంత్రం 5.44 కే సూర్యుడు డ్యూటీ దిగిపోతాడంట, అవతలి నలుపుని ఇవతలకి విసిరేసి. క్రిత్రం రాత్రి, వాళ్ళు చెప్పినట్టే 21° దగ్గిర ఆగిపోయిన ఆ చలి ఇంకా అరచేతులల్లోను, పాదాలలోను నిలబడి పోయింది.

ఇది అతని కధ. ఒకానొక సాయంత్రం అతని స్మార్ట్ ఫోనులోకి చేరిన మెసేజ్ అలర్ట్ తో కధ మొదలవుతుంది.  అతనితో పాటు ఒక స్త్రీ, (ప్రస్తుతానికి ఆ పరిచయం చాలులెండి. కధ చదివిన తరువాత మీకే అర్ధం కావచ్చు!) ఒక యువతి, ఒక పెద్దాయన, ఒక పెద్దావిడ, వాళ్ళు ప్రయాణం చేస్తున్న కారు, దాని డ్రైవరు ఈ కథలో పాత్రధారులు. వాళ్ళాగిన దాబాలో ఒక సర్వరు, కొంతమంది కష్టమర్లుంటారు. అబ్బే నేను రాను కధలోకి, మరీ అవసరమైతే తప్పితే. చాలా డార్క్ గా  ఉంటుంది.  నాకు డార్క్ నెస్  అంటే భయం ! మీరు ఆతను, వాళ్ళు మాత్రమే!

ఫోన్లు, ఈమైల్స్, ఇన్ట్రక్షన్స్, డైరక్షన్స్. మీటింగ్స్. బజ్ జ్ జ్ జ్ … స్మార్ట్‌‌ఫోన్‌లో రిమైండర్, స్క్రీన్‌లాక్ ని చేదిస్తూ పాప్ అయ్యింది ‘యూ గొట గెట్ ది పాచ్ నౌవ్.’ (You gotta get the patch now!) చాట్ బాక్స్‌లో “అమ్ అవుట్” (Am out) అని స్టేటస్ అప్డేట్ ఇచ్చి, లాప్‌టాప్‌లో ఆల్ట్, కంట్రోల్, డిలీట్ నొక్కి షట్ డవున్ చేసాడు.

కిల్ ది బ్లడి ఏ/సి. (Kill the bloody ac).
రిమోట్ షట్ అఫ్. (Remote shut off).
కిల్ ది బ్లడి లైట్స్. (Kill the bloody lights).
స్విచ్‌ ఆన్ ది డార్క్ నెస్ . (Switch on the darkness).
అతను చేతులు సాచాడు. చీకటి అతన్ని పొదువుకుంది. ఆ గదిని మింగేసింది.

బయట అతని చుట్టూ వెలుతురు. అతని లోపల అంతా చీకటి. పెద్ద పెద్ద అంగలతో చీకటిలో నుంచి వెలుతురులోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ తన సీట్‌లోనుంచి గౌరవంగా లేచి నిలబడబోయింది. ఆమె వైపు కూడా చూడకుండా “సిట్”అని విసుగ్గా, విసురుగా ఎడమ చేతి చూపుడు వేలు సైగని ఆమె వైపుకి విసిరేసాడు, ఆగకుండా. నాలుగు అంగల్లో లిఫ్ట్. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉందది. కుడి చేతి బొటన వేలుతో బటన్ని గట్టిగా పంచ్ చేసాడు. థర్టీ సెకండ్స్. అసహనంగా మళ్ళీ పంచ్ చేసాడు బటన్. అప్ ఆరో. వస్తోంది. నియాన్ బ్లూ కలర్. ఆ రెడ్ ఎల్‌యీడిల రీడింగ్స్ ని చూసి చూసి విసిగెత్తిన ఆ కళ్లకి ఎంత హాయిగా ఉందో.

సన్నగా జల్లు పడుతోంది.

సెడాన్ కారులో నుంచి పెద్దాయన, పెద్దావిడ దిగారు.  ఆ సెడాన్ కారు డ్రైవర్ ఆ కార్  బూట్ (డిక్కి) లో నుంచి బాగేజ్ ని  ఇవతలి ఎస్ యూ వి బూట్ తెరిచి అందులోకి చేర్చాడు.  ఒక బాక్ పాక్, ఒక చిన్న సూట్  కేస్.

సరిగ్గా అప్పుడే, ఇంటి లోపలి నుంచి వచ్చిన  యువతి ఎస్ యూ వి కార్ రేర్ డోర్ తెరిచి ముందు తను లోపలికి వెళ్ళింది. ఆ యువతి వెనకే అతను ఒక స్త్రీ మూర్తిని  తన చేతులమీదుగా ఎత్తుకుని తీసుకుని రావడం గమనించి, ఎస్ యూ వి డ్రైవర్, రేర్ డోర్ ని బార్లా తెరిచాడు.  ఈ లోపు సెడాన్ కారులోనుంచి దిగిన పెద్దావిడ ముందుకు రెండు అడుగులు వేసి, వాలిపోయిన ఆవిడ తలక్రింద చేతులు వేసి నెమ్మదిగా అతనితో పాటు కార్ వైపు కదిలింది.   అతను కారులోకి వంగి, తన చేతుల్లోనున్న స్త్రీని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా  ఆ రేర్ సీట్ మీద పడుకోబెట్టాడు.  లోపల కూర్చునున్న యువతి, భుజాలక్రింద నుంచి చేతులేసి ఆవిడ తలని ఎంతో ప్రేమతో తన ఒడిలోకి లాక్కుని దాదాపుగా ఆవిడ బరువంతా తను తీసుకుని, లోపలికి, అవతలి డోర్ వైపుకి వెనక్కి జారుతూ వెళ్ళింది. ఈ లోపు డ్రైవర్ అటు వైపు ఫ్రంట్^డోర్ లో నుంచి లోపలికి వంగి, రేర్  డోర్^ని లాక్ చేశాడు.  యువతి లోపల సర్దుకుని కూర్చోగానే ఇందాక సెడాన్ లో నుంచి దిగిన పెద్దావిడ ఆ రేర్ డోర్ లోనుంచి సీట్^లోకి వెళ్లి కూర్చుంది.  కూర్చుని తన  రెండు చేతులతో ఎంతో వాత్సల్యంతో ఆవిడ కాళ్ళని తన ఒడిలోకి తీసుకుంది. ఇప్పుడు, వెనక సీట్లో డోర్^కి ఆనుకుని కూర్చున్న యువతి, తన ఒడిలో ఆవిడ, ఆవిడ కాళ్ళని తనలో ఒడిలో పెట్టుకుని  పెద్దావిడ కూర్చున్నారు. ఆవిడ పక్కనే ఇందాక సెడాన్ కార్ లో నుంచి దిగిన  పెద్దాయన రేర్^సీట్^లో కూర్చుని డోర్^ని లాక్ చేసాడు.

ఈ లోపు అతను (అంటే ఆ స్త్రీని తీసుకువచ్చినతను) వెనక్కి ఇంట్లోకి వెళ్లి ఒక బాక్ పాక్, ఒక సూట్ కేస్ తీసుకుని వచ్చి, ఎస్ యూ వి బూట్^లో (డిక్కి) సర్ది, డోర్ వేసేసి, మళ్ళీ వెనక్కి ఇంట్లోకి వెళ్ళాడు.  చేతిలో కీస్ తీసుకుని వచ్చాడు.  ఇంటి డోర్^ని లాక్ చేసి, సరిగ్గా  అయిందా అని చూసుకుని, కీస్^ని తన లెఫ్ట్ ట్రౌజర్ పాకెట్^లోకి  జార విడిచి ఎస్ యు వి కార్ వైపుకి అడుగులు వేస్తూ, ఆ డ్రైవర్ వైపు చూసాడు.  డ్రైవర్ ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. అతను కారెక్కబోతు, ఏదో గుర్తు వచ్చినట్టు ఆగి, సెడాన్ కారు వైపు చూసాడు.  సెడాన్ కార్ డ్రైవర్^కి అర్ధం అయినట్టుంది.  అతను తన కారెక్కి స్టార్ట్ చేసి గేటు నుండి బయట రోడ్డు మీదకి వెళ్ళిపొయ్యాడు.

ఎస్ యూ వి కూడా బయలు దేరింది.  అప్పటిదాకా చీకట్లో నిలుచున్నావిడ వరండా లోని లైట్ వెలుతురులోకి వచ్చింది.  ఎస్ యూ వి గేటు దాటగానే, గేటు దగ్గిరకెళ్ళి గడి వేసేసింది.

ఫ్రంట్ డోర్ లాక్^చేసి, టీ షర్ట్ లెఫ్ట్ పాకెట్^లోనున్న సిగరెట్ ని తీసుకుని పెదాల మధ్య పెట్టుకుని అగ్గిపెట్టె కోసం వెతుక్కుటూ ఉంటే, డ్రైవర్ గ్లోవ్ బాక్స్ నుండి తీసి అందించాడు.  ఆఖరు పుల్ల అందులో.  గుండెల నిండా అతను ఆ సిగరెట్ పొగను పీల్చుకున్నాడు.   డాష్^బోర్డ్ క్లాక్^ 12.47 చూపిస్తోంది అప్పుడు.

ఆ నిశిరాత్రి చీకటిలోకి, ఎస్ యూ వి ప్రయాణం మొదలయ్యింది.

అప్పుడు బయలుదేరితే ఏ మధ్యాహ్ననానికో చేరుకుంటారు. సుమారు పదహారు గంటల ప్రయాణం వారి గమ్యానికి.

“ఏం ఉన్నాయి?” అని అడిగాడు పెద్దాయన.
“అన్నీ ఉన్నాయండి. పొద్దుటేళ కదా…” కాస్త అసహనంగా కుడి చేతి చూపుడివేలి గోరుతో టేబుల్ మీద ఒక ఉన్మత్తమైన లయతో కొడుతూ అన్నాడు, సర్వర్. ఒంటి కాలి మీద నిలబడ్డ కొంగ గుర్తు వచ్చింది అతనికి. (ఇతనే అతను…ఇందాక లిఫ్ట్ దగ్గిర…)

”మీకు ఏం కావాలి?” అని ప్రశ్నని వదిలాడు పెద్దాయన, టేబుల్ చుట్టూ ఉన్నవాళ్ళ మధ్యకి. రాత్రి పడిన వర్షం చెమ్మలో అలా వెలాడిపోయింది అక్కడ. ఎవరు దాని వైపు చూడలేదు. కాకపోతే అందరికి వినపడింది. నెమ్మదిగా జారింది టేబుల్ మీదకి. ఒకొక్క నీటిబొట్టుని కలుపుకుంటూ అంచువైపుకి వెళ్ళి అలా జారిపోయేటప్పడు…సన్నగా, ఎక్కడ్నుంచో గబుక్కున వచ్చిన నాజుకుగా ఉన్న వేలు దానిని ఆపబోతే, ఆ వేలు కొసని చూట్టుకుంటూ ఒక్క క్షణం…ఒకే ఒక్క క్షణం..అంచున నిలబడి…పిట్టగోడమీద ఎగిరిపోవడానికి నిలబడ్డ పిచుక లాగా…ఒక్క దూకు దూకింది. క్రింద నేల మీద పడిపోయింది. అనేకానేక కోట్ల నీటిబొట్టులో కలిసి అలా…స్నేహంగా వడివడిగా వెళ్ళిపోయింది.

ఆ నాజూకు వేలు దానివంకే చూస్తూ అలా ఆ టేబుల్ అంచున నిలబడిపోయింది. అలా జారిపోయిన నీటి చుక్కలు గచ్చుమీద పాకుతూ అలా ఆ దాభా గుమ్మం అంచుమీద నుండి క్రింద మెట్ల మీదనుండి, జారి ప్లాట్‌ఫార్మ్ అంచువైపుకి వెళ్ళిపోతున్నాయి. దాభా బోర్డ్ మీద నుంచి తీగల్లాగా సాగిన వర్షంనీరు వాటన్నింటిని కలిపి తను కలిసి వెళ్ళిపోతున్నది ఒక ఎడతెగని చలనం. ఎప్పుడాగిపోతుందో ఎవరికెరుక! వాటివంకే చూస్తూ ఉండిపోయింది నాజూకువేలమ్మాయి. ఒంటి కాలు కొంగ, చేపలు పలకడం లేదని పక్క టేబుల్ కి వెళ్ళిపొయింది.

“ఇక్కడ బ్రూ కాఫీ బాగుంటుంది,” అన్న పెద్దాయన మాటలు, ఆయన నాసికలనుంచి వెలువడుతున్న పొగాకు పొగ వలయాలని దాటుకుని, ఆయన నల్లని పెదవుల మధ్య నుంచి కప్పల్లాగా బయటికి దూకాయి. దొప్పల్లాగున్న రెండు చెవులు, దాన్ని పట్టేసుకుని “నా కొకటి” అంటూ ఒంటి కాలు కొంగ వీపువైపుకి దాన్ని విసిరేసినయ్. (దొప్ప చెవులతను ఇందాకటి పెద్దాయన, అమ్మాయి, ఆతను ప్రయాణం చేస్తున్న పెద్దకారు అదే ఎస్ యూ వి  డ్రైవరు.) అటూ ఇటూ ఊపింది కొంగ తన తలని. విన్నాను అని చూపిస్తూ.

దుప్పట్ల మధ్య, వెచ్చగా, భుజం మీద తలని ఆనించి పడుకున్నట్టుంది.
తన ఎడమ భుజం బరువెక్కుతున్నట్టనిపించింది అతనికి. కూర్చున్న చెయిర్ రైట్‌ లెగ్‌ని మడమతో వెనక్కి తంతూ పైకి లేచాడు ఆతను, కారుని చూస్తూ.  (అతనెవరో తెలుసుగా? ఇందాక లిఫ్ట్ దగ్గిర…కారులో…ఆ అతనే.)

ఇన్టు ది మెమొంట్ (Into the moment)
లేస్తూ షర్ట్ లెఫ్ట్ పోకెట్‌లో సిగరెట్ పాకెట్‌ని కుడిచేతి బొటన వేలు, చూపూడివేలితో పైకి లాగుతూ, ఎడంచేతి చూపుడు వేలుని సాచి పాకెట్ క్రిందినించి సిగరెట్స్‌ హొల్డర్‌ని పైకి నెట్టాడు. కారు కనపడుతునే ఉంది. షూ సోల్స్ అడుగున నలిగిపోతున్న సన్నటి నీటి పొర సోల్స్^ని ప్రతిఘటిస్తూ గతిలేక పక్కలకు తప్పుకోవడాన్ని అతని పాదాలు గుర్తిస్తున్నాయి.

ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్.
(Anger, denial, bargaining, depression and acceptance).

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)
వావ్, వాటే జాజీ లైఫ్ మాన్! (Wow, what a jazzy life man!)
గెట్ సమ్ పిజాజ్ డూడ్! (Get some pijazz dude!)

ఇన్టు ది మెమొంట్ (Into the moment)
సిగరెట్ పెదాలమధ్యకి చేరింది.
వాట్? (What?)
నో ఫ్రిగ్గింగి మాచెస్! (No frigging matches?)
షిట్ మాన్! (Shit man!)
బ్లడి షిట్! (Bloody shit!)
యా…బ్లడ్ అండ్ షిట్! (Yea…blood an’ shit!)
డిడ్ వి నాట్ హవ్ ఇనఫ్! (Did we not have enough?)
ఇనఫ్! (Enough!)
ఐ సెడ్ ఇనఫ్! (I said enough!)
గాడ్డామిట్! (Goddammit !)
ఇట్స్ ఇనఫ్! (It’s inufffff…)
ఓకే? (Okay?)
థిన్ షిట్… బమ్స్ మధ్య నుంచి పరుపు మీదకి బెడ్ షీట్ మీదుగా. దేర్ గోస్ ది బ్లడి షీట్! (There goes the bloody shit!) డైపర్‌తో క్లీన్ చెయ్యడం గుర్తు వచ్చింది.
డన్! (Done!)

ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్!
(Anger, denial, bargaining, depression and acceptance)

ఇన్టు ది మెమొంట్

మాచెస్! (Matches!)
బ్లీయరి ఐడ్ బాస్టర్డ్! (Bleary eyed bastard!)
వ్హాట్ ద హెల్ ఇజ్ హీ స్టేరింగ్ ఎట్? (What the hell is he staring at?)
“అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా?” ఎంతో వినయంగా అడిగాడు.
వాడు, దట్ బ్లియరి ఐడ్ బాస్టర్డ్, చూపుని, అతని వెనక్కి విసిరేసాడు అక్కడుంది అన్నట్టుగా!
సన్నటి తుప్పర పడుతోంది. తుప్పర మధ్య కారు నలుపు రంగు, నలుపుకన్న నల్లగా కనపడుతోంది. క్రోం ఫ్రేమ్ మధ్యలో బ్లాక్ కలర్. క్రోం ప్లేటెడ్ ఫ్రేమ్ బిగించిన గ్లాస్ తెర.
యప్…మై ఐ బాల్స్ ఆర్ బ్లాక్! (Yes, my eyeballs are black!)
సో ఈజ్ దట్…బర్ణింగ్ రెడ్ టిప్…సరవుండెడ్ బై బ్లాక్‌నెస్ (So is that…burning red tip…surrounded by blackness)
ఐ వాంట్ మాచెస్ యూ ఇడియట్! (I want matches, you idiot!)
“అగ్గిపెట్టె కావాలండి. కొనుక్కుంటాను. ఎంతండి?” ఎంతో నమ్రతతో అడిగాడతను.
గోళ్ల క్రింద పేరుకుపోయిన నలుపు. చిన్న వాక్స్ మాచ్ బాక్స్. యప్…దె గివ్ ఔట్ ఎన్ అరోమా. (Yes, they give out an aroma.)
నాట్ బ్లాక్ దో! (Not black though!)

చుక్కలు…కొన్ని వందల వేల లక్షల కోట్ల చుక్కలు…ఒహ్! దే ఆర్ రన్నింగ్ మాన్…లైక్ టుగెదర్, ఫరెవర్. ఆనింగ్ సప్పొర్ట్ బీమ్ మీదుగా…కొన్ని వందల వేల స్ట్రీమ్స్…మెలికల పాముల్లాగా! కిందకి జారిపోతున్నవి…ఎక్కడికో…ఆ కడలిలోకి.

కారు దగ్గిర కెళ్ళాడు. రేర్ విండోలోనుంచి చూసాడు. కళ్ళు మూసుకుని చూస్తోంది. పెదాల చివర…ఇటువైపు చిరునవ్వు ఉండనా జారనా అన్నట్టు వేలాడుతోంది…ఉంగారాల జుత్తు మధ్యనుండి అస్పష్టంగా ఇయర్ రింగ్. సడెన్ గా ఫ్లాష్! విండోలో నుంచి డైరెక్ట్^గా ఆ డీబీర్స్ వాడి ఓల్డ్ సింగిల్ కట్ ఫేసెట్ మీద ఒక ఫ్లాష్. దాని గుర్తించేవాడు కాదేమో, అప్పుడు ఉరుముతో మెరవకపోతే!

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)

“స్వీటీ…గుడ్ న్యూస్” అంటోంది ఆమె ఫోన్^లో. (ఇందాక కారులో…పడుకుని …స్త్రీ…ఈమే… ఆమె).
నవ్వుకున్నాడు. “ఐ నో హన్…ఇట్’స్ ఎ గెల్! రైట్?” (I know hon’ …it’s a gal! Right!) అంటూ ఎదురుగుండా ఉన్న  స్టోర్ ప్లేట్ గ్లాస్ విండో లోకి చూశాడు… త్రీ ప్రాంగ్స్ మధ్య సెట్ చేసిన బ్రిలియంట్‌లీ బ్రైట్ వైట్ డైమండ్. స్టోర్ లోపలికి వెళ్లి కార్డ్ రీడర్^లో …థ్రీ …సెవన్…ఫోర్…సిక్స్ పంచ్ చేసాడు. అతని మొబైల్ లో అలెర్ట్, క్రెడిట్ బాలెన్స్^లో థర్టీనైన్ కే డెబిట్ అయ్యిందని డౌన్‌లోడ్ అయ్యింది. గిఫ్ట్ పాక్ అందుకున్నాడు.  ఒహ్! హౌ హీ లవ్డ్ హర్! (How he loved her!) షీ ఇజ్ మై క్వీన్ . (She is my queen!) యెప్, బట్ దెన్ వితౌట్ హర్…(yep…but then without her…)

బాక్ ఇన్టు ది మొమెంట్ (Back into the moment)

ఫిల్టర్ బట్‌ని కాల్చి పొగని గుండెలనిండుగా పీలుస్తుండగా గమనించాడు…బట్‌కి లైట్ అంటించుకున్నానని.

ఒహ్ షిట్. షర్ట్ లెఫ్ట్ పొకెట్‌లోని, పెకెట్ నుంచి ఇంకో సిగరెట్ తీసుకుని పెదాలమధ్య ఉన్నదాన్ని పారేసి, దీన్ని దోపాడు. మరో మాచ్‌స్టిక్. అరిచేతుల మధ్య, చల్లని వర్షాకాలపు చీకటి మధ్యనుంచి గుండెలోతుల్లోకి…ఈ సారి పొగ…వెచ్చగా!
అక్కడ లోపల, “బ్రూ,” అంటూ ఒంటి కాలు కొంగ స్టీల్ గ్లాస్‌ను తోసింది ముందుకు. సగం నురగ.

అవుటాఫ్ ది మొమెంట్ (Out of  the moment)
మెదడులో…నురగ…పేలిపోతున్నాయి. ఊపిరి తిత్తుల నిండా అవే. ఒన్…ఫోర్…ఎయిట్…మిలియన్స్ టు ది ప‌వర్ ఆఫ్ బిలియన్స్…దే ఆర్ చోకింగ్ మాన్! లెట్ హర్ గో ఈజీలీ! (Let her go easily!)

బాక్ ఇన్టుది మొమెంట్ (Back into the moment)
“ఏమండీ, మీకు ఏం కావాలి? ఏం చెప్పమంటారు?”
వినపడలేదు. అవతల టేబుల్ మీద సొట్టలు బడ్డ బౌల్^లోని బొండాంతో అల్యూమినియం స్పూన్తో కుస్తీ పడుతున్నాడు సన్నగా ఉన్న వ్యక్తీ.  మాసిన నల్లటి గడ్డం.

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)
షిట్,..మాన్..షిట్! అహ్…

బాక్ ఇన్టుది మొమెంట్ (Back into the moment)
స్..స్..స్.. చూస్తుండగానే బట్ చివర వేడిగా ఉన్న ఎరుపు నల్లబడిపోయింది.
షిట్ మాన్! (Shit man!)
దిస్ ఫ్రిగ్గింగ్ బట్ టూ ఈజ్ డెడ్! (This frigging butt too is dead!)
బ్లడి హెల్! ( Bloody hell!)
బ్లడి…ఫ్రి…గ్గిం…గ్…హె…ల్. (Bloody…f.r.i.g.g.i.n.g….h.e.l.l !)
ఆనింగ్ మీదనుంచి ఒక రైన్ డ్రాప్ ఆ బట్ స్మోకింగ్ టిప్ మీద …యూ బ్లడి ఇడియట్ (You bloody idiot)…మై ఫ్రిగ్గింగ్ సిగరెట్ బట్ డూడ్! (My frigging cigarette butt dude)…యెప్ ఇట్’స్ డెడ్ మాన్! (yep…it’s dead maan!)

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)
డిడ్ యు గెట్ ఇట్! (Did you get it!)
ఇట్ టూ ఈజ్ డెడ్ మాన్! (It too is dead man!)
యా ఆ ఆ ఆ..అని అరిచాడు. అని అనుకున్నాడు. బట్ ..ఎలా అరుస్తాడు…లోపలంతా డార్క్‌ నెస్ కదా…నమిలి…మింగేసింది! నోటి నిండా నలుపే…నవ రంద్రాలనుండి నలుపే…గషింగ్ ఔట్! (Gushing out!)
డ్రైనింగ్ మాన్…డ్రైనింగ్! (Draining man…draining!)
ఒహ్ హోలి మదర్ ఆ’ జీసస్…వాట్! (Oh…holy mother o’ jesus!)
దేరీజ్ నో గాడ్ మాన్! (There is no god, man!)
నో దిరింజట్ ఒన్…దేర్ నెవర్ వాజ్… (No there isn’t one, there never was!)
షడప్..షడప్ ఐసే! (Shaddup….shaddup I say!)
షట్ యువర్ అగ్లీ మౌత్ డామిట్! (Shut your ugly mouth dammit!)
ప్ల్లీజ్!

ఇన్టుది మొమెంట్ (Into the moment)
“బాబు, ప్లేట్‌కి ఎన్ని ఇడ్లీలయ్యా?” అని అడుగుతున్నాడు పెద్దాయన.
ఫోన్జెసి “పరిస్థితి ఏం బాగోలేదు,” అనే కదా అతను అన్నాడు.
దే లాండెడ్ ఫుల్లీ పాక్డ్! (They landed full packed!)
మాన్, వాజ్ ఇట్ దట్ ఆబ్‌వియస్? (Man, was is that obvious?)
జీజ్! (Jeez!)
ఆయనే ఇప్పుడు అడుగుతోంది.

“మూడు సార్. వాటితో పాటు వడ కూడా తీసుకోవచ్చు సార్‌.  సాంబార్ ఇడ్లి కూడా ఉంది సార్!”
“సరే. నాకు ఒక ప్లేటు సాంబార్ ఇడ్లితో పాటు, ఒక వడ ఇవ్వు” అని ఒంటికాలు కొంగతో చెప్పి, ”నీకేం కావాలి?” అని అడిగాడు.
సరిగ్గా అ పెద్దాయన అది అడుగుతున్నప్పుడే, ఆ ఉడెన్ చెయిర్ బాక్‌ ఎడమకొసని పట్టుకుని వెనక్కి లాగి టేబుల్‌కి దానికి మధ్య దూరి, తొడలతో కుర్చిని వెనక్కి నెట్టి అందులోకి కూలబడ్డాడు అతను.
‘ఒక మసాల దోసె చాలు,” అని అమె అంది.  ఎవరితో చెప్పిందో తెలియలేదు కాని ఒంటి కాలు కొంగ బుర్ర ఊపింది. ఆమె తల తిప్పి సింక్ వైపు చూసింది.
అద్దంలో ముఖం చూసుకుంటున్నాడు డ్రైవర్.

“మిర్రర్ మిర్రర్ ఆన్ ది వాల్…హూ ఈజ్ ది ఫైరెస్ట్ ఆఫ్ దెమాల్ ? ” (Mirror, mirror in the wall…who is the fairest of ’em all?)
లుక్ ఎట్ హిజ్ ఫేజ్…దట్ కన్నింగ్ జక్కాస్ ఆఫ్ ఆల్! (Look at his face…that cunning jackass of all!)
ఇట్ షూడుంట్ కాస్ట్ మోర్ బట్..దెన్…ఐ యామ్ ఎ సక్కర్…గాట్ సక్డ్ ఇన్టు ఇట్! (It shouldn’t cost more…but then….I’m a sucker, got sucked into it!)
గొడ్డామిట్! (Goddammit!)
వాట్ డూ యు ఎక్స్^పెక్ట్? (What do you expect?)
డిమాండ్ అండ్ సప్లై. ఆ హోరుమని వర్షంలో…ఎవరు రారు అనుకున్నఫ్పుడు వీడొచ్చాడుగా?
పైగా విత్ ఎ కారకాస్…ఒహ్ నో… (With a carcass…oh no!)

ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్!
Anger, denial, bargaining, depression and acceptance

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)
బ్లడి బాస్టర్డ్! (Bloody bastard!)
నెవర్ రికగ్నైజ్‌డ్ బ్లడ్! (Neve’ recognized blood!)
బ్లడి ఇంపొటెన్ట్ బాస్టర్డ్! (Bloody impotent bastard!)
హాడ్‌హీ…ఐ వండర్! (Had he? I wonder!)

ఇన్టు ది మెమొంట్ (Into the moment)
“నీకమ్మా?”
“నాకేం వద్దు,” అంది నాజుకు వేలు తాలుకు గొంతు.
“అలా అంటే ఎలామ్మా? ఏదో ఒకటి తినాలిగా! మనం చేరుకునేటప్పడికి ఇంకా రెండు మూడు గంటలు పడుతుంది. నా మాట విను …ఏం ఆర్డర్ చెయ్యమంటావ్?” అని అనూనయిస్తూ అడుగుతున్నాడు పెద్దాయన.
వెనక్కి చూసింది. ఆయన వెనక, రెండు టేబుల్స్ వెనక “టేక్‌ అవే” కౌంటర్ గోడమీద మాసి పోయిన సున్నం మీద గ్రఫితీ ని చూస్తున్నాయా ఆ కళ్ళూ? బే లోని సముద్రమంతా ఆ కళ్ళలోనే ఉన్నట్టుంది…ఎప్పుడు ఉబికి తనని, ఆ దాబాని, ఆ రోడ్డుని, ఆ కారుని, ఈ ప్రపంచాన్ని ముంచేస్తుందో!

అవుటాఫ్ ది మొమెంట్ (Out of  the moment)
I am in the moment, over the top, under the radar. ఈక్… కార్లిన్‌కదా…ఔను!

ఇన్టు ది మెమొంట్ (Back into the moment)
ది సో కాల్డ్ ఫెయిరెస్ట్ ఆఫ్ దెం ఆల్ (The so called fairest of ’em all)…అద్దం ముందు నుంచి కదిలాడు, ఆటు ఎడంగా ఉన్న టేబుల్ వైపుకి.
ఒంటికాలు కొంగ వాడి వైపుకి వెళ్ళింది. వాడేదో ఆర్డర్ ఇచ్చాడు. ఇవ్వక చస్తాడా? కొంగ వెనక్కి తిరిగి వచ్చింది. ”చెప్పారండి. అది కూడా మీ బిల్లులో కలిపెయ్యమని చెప్పారండి! ”
“అలాగే,” అన్నాడు పెద్దాయన.
“నెస్‌కఫే ఉందా?”, అతను.
“హార్లిక్స్ ఉందండి” ఒంటికాలుకొంగ.
యూ …సనవెగన్..ఐ డిన్‌ట్ ఆస్క్ ఫర్ దట్ బ్లడీ హరర్ ఆఫ్ హాస్పిటల్…యు ఇడియట్! (You…sonofagun…I didn’t ask for that bloody horror of hospital…you…idiot!)
“బ్లాక్ కాఫీ!”
“..అంటే డికాక్షన్ బాబు…సార్‌గారికి కాఫీ డికాక్షన్ ఇవ్వు” అంటూ పెద్దాయన “బాబు, మీరు నిన్నటి నుంచి ఏమి తీసుకోలేదు..ఏదైనా …”
సో వాట్…ఐయామ్ నాట్ డెడ్! రైట్! స్టిల్ ఎరవుండ్! (So what…I am not dead! Right? Still around!)
“నో..థాంక్స్,” అన్నది అతనే.

సొట్టలుపడ్డ స్టీల్ బౌల్. దానిమీదున్న డిజైన్ ఇన్లేలో అంటుకుపోయిన జిడ్డు. బౌల్ లోపల పొగలు కక్కుతున్న సాంబార్. దానిమధ్య పైకి కనబడుతున్న వైట్ ఇడ్లీ. పక్కనే వడ! దాని మీద ఏదో చట్నీ. అది ఆ సాంబారులోకి జారి పోతూ వేస్తున్న ఆబ్స్ ట్రాక్ట్  పెయింటింగ్. కంప్లీట్ కాదు బహుశ. ఈలోపు దాన్ని చిన్నాభిన్నాం చేస్తూ…ఒక స్టీల్ స్పూన్ అందులోకి అడ్డంగా దిగిపోయింది. అంతా అల్లకల్లోలం.

అవుటాఫ్ ది మొమెంట్
బిలియన్స్ ఆఫ్ సెల్స్… డూ దే హావ్టు ప్రై దెమ్ ఓపెన్? (Billions of cells…do they have to pry them open?)
ఆర్ బ్రేక్? (Or break?)
బ్రేక్ వాట్? (Break what?)
ది జాస్, డూడ్…హర్ జాస్! (The jaws, dude…her jaws!)
గెస్ నాట్! (Guess not!)
షిట్… హౌ కెన్ యు ఎవెన్ధింక్ లైక్ దట్! (Shit…how can you even think like that?)
ఇట్స్ ఎ కడెవ…వాట్! (It’s a cadev’…what?)

ఆంగర్, డినైయల్, బార్గైనింగ్, డిప్రెషన్ అండ్ అక్సె‌ప్‌టన్స్.
Anger, denial, bargaining, depression and acceptance

ఇన్టు ది మెమొంట్ (Into the moment)
నెమ్మదిగా సెటిన్ అవుతోంది.
“ఇడ్లీ బాగుందయ్యా! నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నట్టుంది.”
“వడ కూడా అంతేనండి. కరకర లాడుతోంది.”
“ఇంకో ప్లేటు తెమ్మంటారా?” అంటూ, ఎడం చెయ్య్ నాలుగు వేళ్ళమధ్య పట్టుకున్న పలకల గాజు గ్లాస్‌ని వెలిసిపోయి, అరిగిపోయిన లామినెట్ మీద ధడ్ అని స్టయిలిష్‌గా పెట్టాడు. గ్లాసు నిందుగా, చిక్కగా, నల్లగా బ్లాక్ కాఫీ!  నురగ, బుడగలు!  ఫట్, ఫట్ మని పేలిపోతున్నాయి!  కుక్కతోకలాగ వంకర తిరిగిన ఆ ఐదో వేలుకి మూడంగుళాల గోరు. దానికో బ్లడ్ రెడ్ నెయిల్ పాలిష్.
ఓహ్! మెనిక్యూర్ టూ! (Oh, manicure too!)
పచ్చ పచ్చగా…”అమ్మ” టాటూ ఎడం ముంజేతిమీద.
ఎడం చేతిలోని స్పూన్^తో ఇడ్లిని కట్ చేసి, కుడి చేతి స్పూన్^తో దాన్ని బౌల్లోపలి అంచుకి నెట్టి, ఒడుపుగా స్పూన్^లోకి లాగి ఎంతో ఈజ్‌తో దానిని నోట్లోకి లాక్కున్న్నాడు.

అవతల దవడలని కదుపుతూ, శబ్దం చేస్తూ నములుతున్నాడా డ్రైవర్, ది ఫైరేస్ట్ ఆ’ ‘ఎం ఆల్. (The fairest o’ ’em all!)

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)
యు ధింక్ హర్ జా వుడ్‌హెవ్ బిగన్ టూ ఫ్రీజ్? (You think her jaw would have begun to freeze?)
ఐ లిడ్స్? (Eye lids?)
డున్నో! (Dunno!)

బాక్ ఇన్టు ది మెమొంట్ (Into the moment)
“బిల్ నాకివ్వయ్యా!” మాటలు చెవిలోకి దూరుతుండగానే, చూపు ఒంటికాలు కొంగ వైపు మళ్ళింది.

అవుటాఫ్ ది మొమెంట్ (Out of the moment)
ఐ లాషెస్ కింద, బోరింగ్ బ్లాక్ హోల్స్ …ఆ ఐ బాల్స్! (Black holes…ah…eye balls!)
బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్, ఆఫ్టరాల్! Black is beautiful, after all!l)

బాక్ ఇన్టు ది మెమొంట్
(Back into the moment)
వాళ్ళందరూ ఇంకా తింటునే ఉన్నారు.
ఇడ్లి, వడ, సాంబార్ కూడా.
సన్‌సెట్ 5.44 కే!

*

అనిల్ అట్లూరి

అనిల్ వున్నచోట ఉత్సాహం. సాహిత్య ఉత్సవం. తక్కువ రాసినా వాసికి పెద్ద పీట. అభ్యుదయానికి ఇవాళ్టి బాట.

30 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు సార్లు చదివాను…ఇంకా బుర్రకెక్కడం లేదు…ఏదో ఉందనిపిస్తోంది …మళ్ళా చదవాలి !!!

  • Anger denial bargaining depression and acceptance are stages in the psychological behaviour after being informed about cancer as per Elizabeth Kubbler Ross.Apart from this
    I could not understand any thing…

      • అర్థం అవుతోంది సార్.. కారులో కడావర్ …ఐలాషెస్ క్రింద బ్లాక్ ఐబాల్స్…చీకట్లో ప్రయాణం గ్రీఫ్ రియాక్షన్ ….acceptance… ఇడ్లీ వడ సాంబార్ ..బావుంది ఇంకా క్లారిటీ రాలేదు…త్రిపుర ని గుర్తు చేశారు…

  • నేను నిజంగానే చదవడానికి ప్రయత్నించాను. ఆ ఇంగ్లీషు ముక్కలు భయపెట్టి..ఇది నీకథ కాదు లేవోయ్ అని తరిమేశాయ్..మధ్యలోనే! ప్చ్!

  • ఇప్పుడే చదివాను. వినూత్నంగా, ట్రెండీగా ఉంది. మరొక్కసారి చదవాలి. భావ ప్రకటన ఎక్సెలెంటు గా ఉంది. పూర్తిగా అర్థం చేసుకోవడావడానికి మళ్ళీ చదవాలి. ఏమైనప్పటికీ మెలాంకలి,హెల్ప్లెస్నెస్ కలగలసిన ఒక కొత్త అనుభూతి కలిగింది. అనిల్ గారికి అభినందనలు.
    శివ్
    బి.వి.శివ ప్రసాద్

  • అనిల్ గారితో పరిచయం బ్లాగుల ద్వారానే ఆసక్తికరం గా జరిగింది. త్రిపురనేని రామస్వామి గారి మనవడు అవటం ఆసక్తిని పెంచింది. భవిష్యత్ లో వైవిధ్యమైన కథా చర్చలు వేదిక ద్వారా నిర్వహిస్తారని, స్వయంగా కథలు రాస్తారని అసలు ఊహించలేదు. కథలు ఇలా కూడా వ్రాస్తారా అనే అబ్బురమైన, అర్థం కాని కథ ఇది. ఈ కథ వ్రాసినందుకు అమ్రుతాంజనం వారి ప్రత్యేక బహుమతి గ్రహీత అయ్యారు.

  • చాలా ట్రై చేసాను, నా వల్ల కాలేదు, ఎవరైనా సింపుల్ చెబుదురూ ప్లీజ్… ఈ లోపు ఒక కాఫీ సరిపోతుందో, టాబ్లెట్ కూడా వేసుకోవాలో…. కథేంటో తెలియక బుర్ర పగిలిపోతోంది…
    ఒకటి మాత్రం అర్థం అయింది… తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అని….

  • మూడుసార్లు చదివిన తరువాత బుర్రకెక్కింది. కథకుడు వ్రాసిన లోతులు కాదు కానీ… అనిల్ కాకపోయిఉంటే చదివేవాడినే కాదేమో. అలా జరిగితే మంచి కథ మిస్ అయ్యేవాడిని. జీవితం లో నొప్పిని భరించితే తప్ప సాధ్యం కాదేమో. లీలగా గుర్తుకొస్తోంది. పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావటానికి ప్రయత్నం చెయ్యి.

  • పాఠకుడికి కూడా మీతో వేవ్ లెంగ్త్ కుదరాలి కదండీ కథ అర్ధం కావాలంటే?

  • గుడ్ స్క్రిప్ట్ ……స్టోరీ కంటే కూడా…………మూలాలు ఆంగ్లం లో వున్నాయి …. వెతుకుతున్నా

  • గుడ్ స్క్రిప్ట్ ……స్టోరీ కంటే కూడా…………మూలాలు ఆంగ్లం లో వున్నాయి …. వెతుకుతున్నా
    ఇంటర్ నెట్ లో

  • I have a slight idea about ‘5 stages of grief.’ Recognized a couple but why the repetition of Telugu words again in transliterated English!
    I guess I need to read this more times to understand.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు