పూజ చేస్తూ మధ్య మధ్యలో, ఒక్కో పువ్వునూ చక్కటి క్రమంలో పెడుతున్నాను.
సంచిలో నుండి మంచి అందమైన పువ్వులను వెతికి మరీ ఏరి పెడుతున్నా.
ఇంతలో ఏవో సనుగుడులు, సంచి వైపునుండి.
ఆశ్చర్యంగా సంచి వంక చూసా.
ఒక పువ్వు మాత్రం నాకేసి కోపంగా చూస్తోంది.
‘ మరి నన్ను పెట్టవా? ‘ అని అడిగింది, నా చేతికి దగ్గరగా వచ్చి.
అంటే… మరి… అంత అందంగా లేవు కదా, అన్నా తడబడుతూ.
‘ అవును కదా ‘ అనుకుంది, తన ఉాడిపోయిన రేకలను చూసుకుంటూ.
‘ మీ మనుషుల్లో కూడా అందంగా ఉన్న వారికే చోటు ఉంటుందా? ‘
ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేక, ఆ పువ్వు తీసి,
సరిగ్గా దేవుడి దగ్గర మధ్యలో పెట్టా, నాలుక కొరుక్కుంటూ…
*
చాలా బావుంది.మంచి భావ ప్రకటన.నాకు నచ్చింది.అభినందనలు
చాలా ధన్యవాదాలు అండి.
కథ బాగుంది. యువరచయిత గా ,పేరు, తెచ్చు కోవాలని..ఆశిస్తున్నాము!💐!