గుర్రం సీతారాములు- సాహిత్యంలో కొత్త పేరు కాదు. కానీ, ఫైర్ బ్రాండ్! ఈ తరంలో ఇంతకంటే చండ్ర నిప్పు ఇంకోటి లేదేమో! సీతారాములు ప్రయాణం ఇదిగో ఇలా మొదలైంది.
1 చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందుబాటులో ఉండటం వలన మీకు చదవడం మీద ఆసక్తి కలిగిందా?
-మేము ఆరుగురం. నలుగురు అన్నదమ్ములం ఇద్దరు అక్కలు నేను మూడో వాణ్ణి అమ్మ అయ్య ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు. చెబితే నమ్మరు పెన్ను పేపర్ కనీసం పెన్సిల్ ఆనవాళ్ళు కూడా లేని కుటుంబం మాది. తరాలుగా బడి ముఖం చూసిన మొదటి వాణ్ణి. ఇద్దరు అన్నలు బడికి పోలేదు, అక్కలకు బాల్య వివాహం. ఇద్దరు అన్నలు జీతం ఉండడం పెళ్లి కావడం ఇంట్లో గడవడానికి అందరూ పనిచేయడం వలన మా అయ్య నాకు ఒక మట్టి పలక కొనిచ్చి బడికిపో అన్నాడు. ఊర్లోనే బడి ఒకటి నుండి ఐదు వరకు అమ్మానాన్నల మీదనే ఆధార పడ్డా, ఆరునుంచి పది వరకు సగటు దళిత బతుకు ఏలా ఉండేదో అలానే ఉండేది. ఇంట్లో ఒక్క రూపాయ అడగకుంటా నేను కూలి చేసిన పైసల తోనే చదువు కున్న, రెండు పూటలా అన్నం తినడం అరుదు. హాస్టల్ లేదు కనుక ఇంట్లోనే. పాట్య పుస్తకాలు మినహా నాకేమీ తెలియదు. హై స్కూల్ లో లైబ్రరీ ఉండేది. యేవో చదివిన గుర్తు కానీ శివగంగ అనే నవల బాగా యాది , సి.యెస్ రావు గారు రాసినట్టు గుర్తు. ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో అప్పుడప్పుడూ బోట్స్ క్లబ్ లో కలిసేవాణ్ణి అప్పుడు తెలిసింది ఆ నవలిక ఆయన రాసాడు అని,చాట్ల శ్రీరాములు దీక్షిత్ గారు, ఇంకా కొంతమంది సినిమా మనుషులతో బలే ఉండేది చర్చ. ఆ నవల అది లేడిస్ టైలర్ సినిమా(?!) సినిమా తీసినట్టు గుర్తు. ఊరిలో ఒక వామపక్ష అభిమాని దగ్గర కొన్ని రాదుగ ప్రచురణలు చూసాను. అందులో గోర్కీ అమ్మ, శ్రీ శ్రీ మహా ప్రస్తానం , అరేబియన్ నైట్స్ లాంటి ఇంకొన్ని పుస్తకాలు ఎన్నో సార్లు చదివా ముక్క అర్ధం కాలేదు. ఇంటర్, డిగ్రీ ఖమ్మం, ఒక స్టూడియో లో రాత్రి పని పగలు కళాశాల, డిగ్రీ ఆంగ్ల సాహిత్యం ఆప్షన్ కనుక సిద్దారెడ్డి కళాశాల లో పెద్ద గ్రంధాలయం నాకు దారి చూపింది. మూడేళ్ళు పిచ్చి పట్టినట్టు చదివా. ఇప్పుడు గొప్ప గొప్ప కవులు చెబుతున్న క్లాసిక్స్ అన్నదగినవి ఎన్నో చదివా. అలెక్ష్ హెలీ రూట్స్, హోవార్డ్ ఫాస్ట్ స్పార్టకస్, కథ నవల పత్రికలు ఒకటా రెండా ఇంకా తెలుగు ఆధునిక కవులను నాకు అందుబాటులో ఉన్నంత వరకు చదివా. పది తర్వాతనే ఆరు లేదా ఏడు లో అఫ్సర్ రాసిన అడవి కథ యాదృచ్చికంగా చదివా కారణం నాడు తల్లంపాడు ఉన్నత పాఠశాల లో కౌముది గారు మా టీచర్ కౌముది కొడుకు కనుక ఆ కథ చదివా ఇప్పడు గుర్తురావడం లేదు.
2 మీరు ఎప్పటి నుంచి రాయటం ప్రారంభించారు? రాయటానికి ప్రేరకం ఏమిటి?
రాయడం అంటే డైరీ ఏదో నోట్ బుక్ లో మొదటి వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో గుర్రం జాషువా మీద అది నా తొలి రచన. మా ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావడం మూలంగా మా జాషువా అని ఒక వెర్రి. అనేక పత్రికల్లో వ్యాసాలు,అనువాదాలు రాసా. పి.జి లో వామపక్ష రాజకీయాలు పరిచయం ముఖ్యంగా విరసం అంటే అభిమానం, ఆ పిచ్చి విరసం కవుల అచ్చులో ఉన్న సమగ్ర రచనలు చదివడానికి ప్రయట్నంచేసా , నన్ను బాగా ప్రభావితం చేసిన కవి పతంజలి, కో కు, కవుల్లో శివసాగర్, కౌముది, తుమ్మేటి కథలు ఇష్టం, ఇక ఖదీర్, నామిని,అల్లం రాజయ్య ఇంకా ఇష్టం, ఆ తర్వాత ఆంగ్ల ఇతర భాషల నుండి అనువాదాలు. ఎఫ్లూ కి మారాక నా ప్రపంచం విస్తృతం అయ్యింది. నేర్చుకోడానికి అది నాకు దారి చూపింది, సాహిత్యం చరిత్ర రచనకు ఒక వనరు అనే ఎరక నాకు అక్కడే కలిగింది, ఆఫ్రో అమెరికన్, క్రిటికల్ థియరీ, పోస్ట్ కొలోనియల్,సబాల్త్రెన్ స్టడీస్, కల్చరల్ స్టడీస్ నాకు బాగా ఆశక్తి ఉన్న ఏరియాలు. గూగి రచనలు, మోడరన్ ఫిలోసఫి, ఎడ్వర్డ్ సయూద్, ఫుకో, డేరిడా లాంటి లాంటి పోస్ట్ స్ట్రక్చర్లిస్టు నాకు బాగా ఇష్టం, వర్తమాన చర్చల్లో ఉన్న ప్రతి రచన సంపాదించి చదవడం ఆశక్తి, అందరికన్నా భిన్నమైన రాత రాయగలిగే సత్తా ఉంటేనే రాయడం మంచిది అని నమ్ముతాను. తెలుగు కథ మినహా తాత్విక రంగాలలో మిగతా ప్రపంచం నేర్చుకునే సరుకు తెలుగు నాట లేదు అని బలంగా నమ్ముతా. అసలు తెలుగులో మేధో చర్చలు జరగవు. మేధో పరంగా కనీసం దశాబ్దాల వెనకబాటు తనంతో మన మేధో ప్రపంచం విద్యారంగం ఉంది. అటువంటి చవిటి పర్ర లో సారవంతమైన రచనలు వస్తాయా ?
3. తెలుగు సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికీ మధ్య తేడాలు మీరు ఏమి గమనించారు?
ఇంతకు ముందే చెప్పా వందల ఏళ్ళ వలస పాలనలో ఈ దేశం తన దిన బౌద్ధిక ప్రపంచం ఏర్పరుచుకోలేక పోయింది. ఒక నాడు గొప్పగా విలసిల్లిన బౌద్ధం కనుమరుగు అవడం వెనక స్థానిక ఆధిపత్య కుట్ర ఉంది. కనీసం వందా నూటా యాభై ఏళ్ళకు మించి ముందు ఉన్న విద్యా సంస్థలు ఈ దేశం లో లేవు ఉన్నా ఇక్కడ దేశవాళీ ఆలోచనలు ప్రపంచపటం మీద నిలబెట్టలేము. ఏమన్నా అంటే సున్నా మనమే కనిపెట్టాము అంటారు, ఖగోళ శాస్త్రం లో మనదే ఆధిపత్యం అంటాము.శాస్త్ర సాంకేతిక మేధో ప్రపంచంలో మనకు మిగిలింది ఆ సున్నా నే. ఇక సాహిత్యం కూడా అంతే. యాభై అరవై ఏల్లకింద ముగిసిన మేధోచర్చలు తెలుగులో మొదలైతాయి. అవి అర్థం చేసుకునే లోపే ఆ వాదాలు తన ప్రాసంగికతను కోల్పోతాయి. మనకు సీరియస్ అకడమిక్ వాతావరణం లేదు. దానికి కారణం ప్రాధమిక విధ్యలోనే ‘సంధి’ . ఇప్పుడు విద్యా వైద్యం ఖాయిలా పడ్డ పరిశ్రమలు.తామర తంపర గా కవిత్వం పుస్తకాలు. అవార్డులు రివార్డ్ సాహిత్యానికి కొలమానం కాదు గానీ, ఇక్కడి సాహిత్యం మిగతా ప్రపంచానికి చేరే రీతిలోఅనువాదాలు లేవు . ఒకవేళ అనువాదకులు రెడీగా ఉన్నా ప్రపంచ పాఠకున్ని ఆకర్షించే తెలివి మనకు ఉందా ? నా ఉద్దేశ్యం ఇక్కడ ఏమీ లేదు మిగతా ప్రపంచం లో గొప్పగా ఉంది అనికాదు. ప్రపంచాన్ని అప్పీజ్ చేసే అంతటి విద్వత్ పరులు మన దగ్గర లేరు అనే చేదు నిజం ఒప్పుకొని తీరాలి.
3 సాహిత్యం ఎలాంటి ప్రశ్నలను మీలో రేకిత్తించింది? ఎలాంటి సమాధానాలను మీకు ఇచ్చింది?
ఈ సాహిత్యమే లేకుంటే నాలో ఇంతటి హేతుబద్దత వచ్చేదే కాదు. మొదట సరదాగా కొన్ని పుస్తకాలు చదివిన నేను నాకు తెలియకుండానే వామపక్ష సాహిత్యం క్రమేనా విప్లవ సాహిత్యం, ముఖ్యంగా విప్లవ కవి శివసాగర్ పరిచయం నన్ను మరింత లోతుగా అధ్యయనం దిశగా మార్చింది. ఆయన సమగ్ర కవితా సంకలనం సేకరణ ప్రచురణ నన్ను మరింత సాహిత్య జీవిని చేసాయి. ఆ క్రమంలో ప్రాంతీయ దళిత బహుజన రాజకీయాల పట్ల ఆశక్తి. మలి విడత తెలంగాణ ఉద్యమంలో మా యూనివర్సిటీ లో తెలంగాణ విద్యార్ధి రాజకీయాల వ్యవస్థాపకుడిగా, ఆ తర్వాత తెలంగాణ ప్రజాఫ్రంట్ మిగతా ప్రత్యామ్నాయ రాజకీయాల లక్ష్యంగా పనిచేస్తున్న సంఘాల పరిచయం. అటు విశ్వవిద్యాలయం బయట జరుగుతున్న అలజడులు నన్ను మరింత అధ్యయనశీలిగా మార్చాయి. ఇంటర్ డిసిప్లినరి స్టడీస్ లో Ph.D లో చేరడం మూలంగా చరిత్ర, సమాజ శాస్త్రం, కులం,జెండర్, సెక్సువల్ మైనారిటీల పట్ల నా అవగాహన మరింత విస్తృతం అయ్యింది. మౌఖిక సాహిత్యం గురించి అధ్యయనం నన్ను మరింత అధ్యయన దిశగా తెసుకొని పోయింది. ఇవన్నీ నాకు సాహిత్యం చదవడం మూలంగానే తెలిసాయి. ఒక మొదటి తరం కూలీ బిడ్డ ఎఫ్లూ లాంటి ఎలిట్ సెంటర్ లో చదివేలా, ఆక్రమం లో యూరోప్ లో ఆక్స్ఫర్డ్ Cambridge దాకా తీసుకొని పోయింది. సాహిత్యం నాకు దారి దీపం నా బ్రతుకు నావకు చుక్కాని. అదే లేకుంటే నేను నథింగ్.
- సాహిత్యం అంతిమ లక్ష్యం?
సమాజ హితం కోరేదే సాహిత్యం. వ్యవస్థను సమగ్రంగా మార్చే రచనలు ఐరోపా ఇంకా తూర్పు ఆసియా నుండి వచ్చాయి. ప్రపంచ గమనాన్ని మార్చే సామ్యవాద,వామపక్ష సాహిత్యం రష్యన్, జర్మన్, నుంచి వచ్చాయి. ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ద నవలలు ఐరోపా సమాజం నుండే వచ్చాయి. నాకయితే ఇంతకాలం వ్యవస్థీకృత హింస పీడన నుండి విముక్తి చేసే ప్రతి రచన నూ నేను ఇష్టపడతా. సాహిత్యం నేను ఏమిటో , ఈ ప్రపంచం ను ఎలా అర్ధం చేసుకోవాలో, ఎవరి పక్షం ఉండాలో నేర్పింది. సమాజం లో అత్యంత దిగువ శ్రేణి లో ఉండే మనుషుల పట్ల మనం నిలబడాలి అనే కనీస ఎరక నాకు సాహిత్యమే ఇచ్చింది. బదిరులు,సెక్సువల్ మైనారిటీలు, దళిత బహుజన అట్టడుగు జీవితాల కాన్వాస్ గా సాహిత్యం వచ్చినప్పుడు మాత్రమే దానికి ఒక ప్రయోజనం ఉంది అని నేను నమ్ముతా. నమ్మిన విస్వశానికి ప్రాణాలు సాకబోసిన తెలంగాణప్రపంచంలో నే విలక్షణమైన త్యాగాలకు చిరునామా అయ్యిది. ఇప్పుడు అది రోజు రోజుకీ పలచబడుతుంది. అదే విషాదం.
5 మానవ జీవన గమనానికి సాహిత్యం ఎలాంటి ఇంధనాన్ని ఇచ్చింది అనుకుంటున్నారు?
మనిషి గుహనుండి మనం మాట్లడుకుంటున్న సో కాల్డ్ నాగరిక జీవిగా మారే క్రమానికి అనేక అంశాలు పూరకంగా అనిచేసాయి. పుట్టుక తో స్వేచ్చా జీవి అయినా వివిధ దశల లో ‘ఆటవిక’ రాజరిక, నియంతృత్వ దశలు దాటు కొని ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్చా సమానత్వం దిశగా చేసిన నడక వెనక అంతులేని రక్త పాతం ఉంది. హేతువును నిలబెట్టడం కోసం తన ప్రాణాలను సాక బోసిన ఉదంతాలు మన ముందే ఉన్నాయి. ఆధునిక మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న సమస్త సుఖ బోగాల వెనక వెలకట్ట లేని త్యాగాలు ఉన్నాయి, వాటి వెనక సృజన శీలురు అయిన కవుల, మేధావుల, కళాకారుల రచనా స్ఫూర్తి ఉంది. వాళ్ళు సృజించిన సాహిత్యం ఈ అన్ని పరిణామాలకు దారి చూపింది. ఎస్ సమాజం అనే యంత్రానికి సాహిత్యం సమస్త కళలు ఇందనంగా పనిచేశాయి.
6 మీ దృష్టిలో ఏది అత్యుత్తమ సాహిత్యం?
అలా నేను చెప్పలేను. మనకు తెలియకుండానే సాహిత్యం ఒక కనిపించని విభజన రేఖ గీసుకొని ఉంది, రాతకు అల్లికకూ మధ్య అంతులేని సాంస్కృతిక అఘాతం ఉంది. నదీ లోయలలలో విలసిల్లిన నాగరికతలు మొత్తం ఆర్యదాడిలో అంతరించాయి ఆ ప్రభావం సకల కళల మీద ఉంది. పురాణ.ప్రభంధ,వాజ్మయం మొదలు కథ,నవల,కవిత్వం ఈప్రక్రియలు మొత్తం భిన్నమైన ప్రపంచాలకు వాహిక గా ఉన్నాయి. నాగరికత పేరుతో వీటిని దేశి-మార్గ లాంటి ప్రమాణాల తో విభజించారు. నాకయితే పండిత సృజన కన్నా పామరులు పాడుకున్న యక్షగానాలు,లక్షలపేజీల మౌఖిక సాహిత్యం అంటే ఇష్టం. ఇటు వంటి సృజన మీద వాద,తాత్విక బరువు లేకుంటా స్వేచ్చగా గానం చేసే సజీవ నది లాంటి ధార మనతో ఉంది,అది కల్మషం లేనిది,స్వచ్చమైన నీటి చెమ్మ లాంటిది. ఆధిపత్య సాహిత్య చర్చల్లో కనబడకుండా వినబడకుండా మిగిలిన ఈ సజీవ సంస్క్రుతులు అంటే నాకు ఇష్టం. ఆ ఇష్టమే దళిత సమాజంలో అట్టడుగు దొంతరలలో అంటరాని వారికే అంటరానివారుగా పరిగణించ బడుతున్న చిందు,డక్కలి యక్షగాన ప్రక్రియల మీద పరిశోధన దిశగా మారాను. ఆ పరిశోధన నేను ఏంటో చెప్పింది. చేయాల్సిన బాధ్యత పెంచింది. ఈ కొద్ది పాటి ప్రయాణం లో ఎంతో కొంత తెలుసుకున్న. మన చుట్టూ ఉన్న సమాజంలో సంక్లిష్టత, సామాజిక దొంతరలు, మనకు తెలియని సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉంది. మన మధ్యే అధ్రుశ్యులుగా,అవాచ్యులుగా కునారిల్లుతున్న బ్రతుకులు బయటి సమాజం తో సంపర్కం జరుపుకున్న రోజు రావాలి. ఆ దిశగా సాహిత్యం మళ్ళిన రోజు ను అది సృష్టించిన సాహిత్యాన్ని అత్యుత్తమ సాహిత్యం అని నేను అనుకుంటున్నాను.
*
మీ సంభాషణ చదివాక మీ విజయంమీద,మీ అధ్యయనం మీద గౌరవం పెరిగింది.
Great sir,
Me prayanam maaku spoorthi..me parichayam naaku chala vignananamdam sir.
Thanking you..
నమ్మిన విశ్వాసాలకి ప్రాణాలను సాకబోసిన తెలంగాణ ప్రపంచంలోనే విలక్షణమైన త్యాగాలకు చిరునామా అయింది. ఇప్పుడు అది రోజురోజుకు పలచబడుతుంది అదే విషాదం 🤝🤝. (తెలంగాణ ఉద్యమం పలుచని అనే పదం స్థానంలో కనుమరుగు అనే పదాన్ని చేర్చింది ) నైస్ సీతారాములు ❤️❤️
మీరు ఇంకా రాయాలి, చాలారాయాలి. మేధో వాతావరణం ఎట్లా వస్తుంది మరి?
ఈ దేశం గర్వించదగ్గ రచయిత. తన రచనలు ప్రపంచస్థాయి ని అందుకున్నాయి. తన వ్యక్తిత్వం, ఆచరణ అనితర సాధ్యమైనవి. తన రచన దృశ్యాన్ని ఆవిష్కరింప చేస్తుంది. తన సాహిత్యం తెలుగులోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది. ఈ కుళ్ళిపోతున్న సమాజంలోని రుగ్మతలకు అసమానతలకు చికిత్స చేయగల గొప్ప శక్తి మీ రచనలకు, మీ వ్యాసాలకు ఉంది.
మిమ్మల్ని సాహిత్యాన్ని విడదీయలేనంతగా మమేకమయ్యారు.
తన వ్యాసాలలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోగాలను రోగులను పదునైన పదాలతో దునుమాడుతున్న తీరు చూస్తుంటే సీతన్న కలంతో కాదు రెండు వైపులా పదునున్న కత్తి తో రాస్తున్నాడు ఏమో అనిపిస్తుంది. నేటి యువతకు, సమాజానికి మీ కలం స్పూర్తి, మీ సాహితీ ప్రేరణ ఎంతగానో అవసరం.
ఏది ఏమైనా ఈ సాహితీ ప్రపంచంలో మీరు గుర్రమే..
Excellent writter Dr Gurram Seethanna
సీతన్న చాలా పరిపక్వత గల ఇంటర్వూ ఇది మీ ఆలోచన విస్తృతిని తెలియజెస్తుంది .
కాళ్లున్న అక్షరం కండంతరాలు దాటుతుంది.
జీవం ఉన్న కవిత్వం జీవితం తర్వాత కూడా ఉంటుంది…
మా సీ తా అన్నని దాదాపు సంవత్సరం నుండి గమనిస్తున్నాను…ఆయన అక్షరంలో ఉండే తీవ్రత నాతో ఎన్నో వ్యాసాలు,పుస్తకాలు చదివించింది.
సీతా అన్న రాసిన ప్రతి వ్యాసంలో నిగూడత,ఎగరడానికి సిద్దంగా ఉన్న స్వేచ్ఛా కపోతాలు మనకు అక్షర రూపంలో కల్ల ముందుంటాయి.
అభినందనలు అన్నా..😍
సీతారాములుగారి ప్రయాణం, భావాలు అందజేసినందుకు ధన్యవాదాలు.
స్పందించిన అందరికీ ధన్యవాదాలు
నీ హక్కుకోసం నువ్వు పోరాడాలి, అది చిన్నదైనా పెద్దదైనా అని ఇఫ్లులో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసే నేర్చుకున్నామేమో అని అంపిస్తాదన్న.
ఆ విశ్వవిద్యాలయంలో బ్రాహ్మనత్వ క్లాసురూమ్ మమ్మల్ని ఎందుకొచ్చారు అని చూస్తే, హాస్టల్ లోని మీ రూములు ‘కం కం వెల్కమ్’ అని పిలిస్తేనే వచ్చిందేమో మా కాన్ఫిడెన్స్.
మీ మాటతీరు, పోరాట పటిమ మాకు కొంచం దైర్యం నేర్పింది అని చెప్తా. మాకు మీరున్నారు అనే మనోదైర్యం వేరే లెవెల్ అప్పట్ల. కొన్నిసార్లు అంపిస్తుంటది ఇఫ్లు లోంచి డ్రాప్ అయ్యి చిన్న తప్పు చేసానేమో అని.
You are an inspiration to me, Sitanna.
Excellent writer brother Dr.Gurram seethaRamulu