మనసెంత ముసుర్లుగమ్మినా
చేతులు బార్లా సాపి మబ్బుతెప్పల ఓరకు నెట్టి
ముసిముసిగా ఎండపొడను కావలిచ్చుకుంటడు
ఈదురుగాలికి ఒనుకుడుబట్టిన జీవితాలకు
సలిమంటల ఎచ్చదనం అతడు
భీకరతుఫాన్లు సుట్టుముట్టినా
ఒడుపుగ పడవ నడపడం మీన్నే..జాసంతా
★
ఆ దినం.. బారెడు పొద్దెక్కినా
ఏ తుఫాను, ఏ ఈదురుగాలి,ఏ ఎలుగుకిరణం
అతన్ని నిద్రలేప సాహసించలే
అతని నవ్వుకు ప్రతిరూపమై ఎలుగుతాంది
తలాపున దీపం
సుట్టూ మూగిన జనం
అతడి ఆత్మకథలోని ముఖ్య ఘట్టాలను
కన్నీటిగాధలై వల్లెవేత్తాండ్లు
అతడు అన్నీ ఇంటున్నడు
గాలికి కదలని దీపంలా
యాత్ర పొడుగూతా
‘ఆ నలుగురిలో’ ఒకన్నైన నాకు
కన్నీటి పొరల నడుమ లీలగా కనబడ్తూ
మునుంబెట్టి మాగిన మట్టికథల తత్వాన్ని నూరిపోసిండు
కాడుపరుపుపై కట్టెలదుప్పటి కప్పుకొని
వేల మంటనాలుకలతో తుర్తిగ నవ్విండు
★★
నిండుగ బతికిన మనిషి గదా
నీరసించినప్పుడల్లా జబ్బసరిసే ఆ నవ్వు
నా గుండెల ఇంక పైలంగనే ఉంది.
*
Super anns
Tq so much anna
Kavitha bagundi..anna
Tq thammudu
Tq thammudu