అర్థం కానిది శాస్త్రమే కాదు. అర్థశాస్త్రం… అవసరంలేనిదిగా, అర్థంకానిదిగా చెప్పబడుతున్న కాలంలో… ప్రతి ఇంటి నెలవారీ ఆదాయ జమా ఖర్చులే ఏ దేశ ఆర్థిక శాస్త్రమైనా… అని అర్థమయ్యేంత సులువుగా శ్రామికుల దృష్టికోణంలో పాఠకులకు విద్యాసాగర్ అందిస్తున్న పరిశోధనా గ్రంధమే “భారత ఆర్థిక వ్యవస్థ (1857-2017).
ఈ పుస్తకం నాలుగు సంపుటాలుగా వెలువడుతుంది. మొదటిది భారత ఆర్థిక వ్యవస్థలో 1857-1947 వరకు శ్రమ నిర్వహించిన పాత్రను వివరిస్తే…రెండవది 1857-1947 వరకు దేశంలో పెట్టుబడి, వ్యాపారం, జాతీయ ఆర్ధికం (పన్నులు) గూర్చి వివరిస్తుంది. మూడవది 1947-2017 వరకు ‘శ్రమ’ గూర్చి చెబితే, నాలుగవది 1947-2017 వరకు పెట్టుబడి, వ్యాపారం, జాతీయ ఆర్ధికం గూర్చి వివరిస్తాయి.
మొదటి సంపుటి జూలై నెలలో వెలువడింది. .
రేపు 14 న హైదరాబాద్ లో ఆవిష్కరించబడుతున్న “భారత ఆర్థికవ్యవస్థ (1857-2017)” అనే రెండవ సంపుటిలో-
1. పెట్టుబడి అంటే ఏమిటి?
2. అయిదు ఆకులతో ఈ దేశంలో వ్యాపారం ఎలా జరిగింది?
3. అసలు పెట్టుబడి పోగుపడడానికి వడ్డీ వ్యాపారానికి వున్న సంబందం ఏమిటి?
4. ఈ దేశంలో ప్లాసీ యుద్దం జరగడానికి జగత్ సేథ్ అనే వడ్డీ వ్యాపారికి వున్న సంబందం ఏమిటి?
5. ఈ దేశ ప్రజలకు టీ, సిమెంటు, పంచదారలాంటి వస్తువులు అలవాటు చేయడానికై ఆనాటి పెట్టుబడిదారులు ఎంత కష్టపడ్డారు?
6. రెండు ప్రపంచ యుద్దాల వలన ఈ దేశంలో 1947కు పూర్వం ఏ పరిశ్రమలు ఊహించనంతగా లాభపడ్డాయి?
7. హుండీ వ్యవస్థ అంటే ఏమిటి? దీని నుంచి బ్యాంకులు ఎలా ఏర్పడ్డాయి? అసలు బ్యాంకులు ఎందుకు దివాళా తీస్తాయి? స్టాక్ ఎక్చేంజీలు ఎందుకు… ఎలా ఏర్పడతాయి?
8. భూమి శిస్తు (ప్రత్యక్ష పన్ను), ఉప్పుపై పన్ను (పరోక్ష పన్ను)లపై ఆధారపడిన దేశం… కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను ఎప్పుడు? ఎందుకు ప్రవేశపెట్టింది?
9. ఒక దేశం… కొంతకాలం ప్రొటెక్షన్ టారీఫ్ లను అమలుచేసి మరికొంతకాలం ఫ్రీ ట్రేడును అమలుచేస్తుందెందుకు?
10. పెట్టుబడి పోగుపడటంలో రవాణా, సమాచార రంగాలు పోషించిన పాత్ర ఏమిటి?
11. భారతదేశంలో రైల్వేలు వచ్చినా కులాలు ఎందుకు పోలేదు?
ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు తప్పక వెతకాల్సిన సందర్భం ఇది.
*
|
ఆలోచన రేకెత్తించే చర్చ!
14 న హైదరాబాద్ లో ఆవిష్కరణ
Add comment