అసలే నలుపు…

సలే నలుపు
ఆపైన “కా కా” అంటూ ఒకటే అరుపు
మన పిల్లలు ఎంత గోల చేసినా
అది మాత్రం కాకి గోలే!

అక్కడికదేదో పెద్ద నేరమైనట్టు
“కాకి సర్వభక్షకాహారి” అంటూ
అది తెచ్చుకున్నఆహారాన్నితినటానికి
మన అభ్యంతరం!

నాకేమో నువ్వు
క్రిమి కీటకాల్ని తిని
రైతన్నకు మేలు చేసే
చనిపోయిన జంతువుల్ని తిని
పర్యావరణాన్ని కాపాడే కార్యకర్తవి.

ఆపదల్లో
నా వాళ్ళను నేను
ఏకాకుల్ని చేయవచ్చేమోగానీ
నువ్వు మాత్రం
మీ సమిష్టి సూత్రాన్ని నినదించే సంఘజీవివి.

అంతెందుకు?
కనుమ రోజు “కణ్ పిడీ వెచ్చి, కాకా పిడీ వెచ్చి” అంటూ
అమ్మా, చెళ్ళెళ్ళూ
రంగు రంగుల అన్నం ముద్దలు పెట్టి మిమ్మల్ని పిలిచి
మీరు వచ్చి వాటిని తినడం కోసం వేచిచూడడం ఇప్పటికీ గుర్తు.

నాకేమో నువ్వు
నా చనిపోయిన పూర్వీకులకు
పునర్జన్మనిచ్చే సంజీవినివి.


2

గర్వభంగం
           

సంక్రాంతి సమయంలో పిల్లలు ఆడుకునే
గాలిపటపు సన్నని తీగలాంటి
మాంజా దారానికి చుట్టుకుని
వేలాడుతున్న ఆ గద్దను
చూచి నిజంగానే నాకు జాలి వేసింది.

గద్దంటే నాకెప్పుడూ
మహా దర్జాగా
ఆకాశంలో విహరిస్తూ
తన భుజంపై ఊరేగుతున్న
స్థితి కారుడైన విష్ణువును తలపిస్తూ
రెక్కలు ఆడించకుండా ఎగిరే
గరుత్మంతుడే గుర్తు.

గద్దంటే నాకు
గాలిలో రాజఠీవితో వెలుగొందే
ఆంగ్ల కవి హాప్కిన్స్ కీర్తించే
విండ్ హవరే గుర్తు.

ఇప్పుడీ వేలాడే పక్షిని చూస్తే
జాలి మాత్రం కాదు
ఎక్కడ మా ఇంటి పెరట్లో పడి చస్తుందోనని
ఒకింత భయం కూడా వేసింది.
ఆనాడు గజేంద్రుని రక్షించిన విష్ణువులా
ఇద్దరి సహాయం తీసుకొని
ఓ పొడుగాటి కర్రను సమకూర్చుకొని
దానికి కొనకు ఒక కత్తిని అమర్చుకునేంతలో
ఆ పక్షిరాజుకు రోషమొచ్చిందో ఏమో
కాలుకు చుట్టుకున్నమా’నవ’ మాంజాలమును
తన ముక్కుతో ఒక్క వేటున తెంపి
కనుచూపుకందని గగనానికి ఎగిసి…

The Crow

–M. Sridhar

 

 

Oh it’s so black!

On top of that its grating “kaa…kaa” call

even when our own kids make a horrendous noise

that’s termed crow’s cacophony!

 

As though it’s such a grave crime

our objection

to its eating something it had collected—

“There’s nothing that the crow doesn’t eat.”

 

To me you are the one that helps the farmer

eating worms and insects

the environment activist

that feeds on dead animals.

 

 

I might isolate my own people in troubled times

but you are the social being

that proclaims the community principle.

 

 

Not just these.

I remember still how on Kanumu day

mother and sisters would keep coloured balls of rice

call out to you saying “kanpidivechchi, kaakaapidivechchi

wait for you to come and nibble at them.

 

To me you are the sanjeevini

that resurrects and bestows new life on our dear departed.

Pride Vanquished

 

 

I felt pity

looking at the eagle that was hanging

entangled in the thin wire-like manja thread

of the kite the kids were flying during the Sankranthi festival.

 

 

The eagle

always reminds me

of the majestic bird Garutmantha

that flies in the air carrying on its shoulder Lord Vishnu

reminding me of Him who maintains the world-order.

 

 

The eagle

always reminds me

of the windhover that shines with its regal look

that the English poet Hopkins sings in glory.

 

When I look now at this hanging bird

I feel not only pity

but a bit of fear

that it might drop dead in our backyard.

 

By the time I took the help of two people

got ready with a long pole with a knife at its end

like Vishnu of the past who rescued Gajendra, the elephant,

perhaps the bird-king was ashamed

it snapped with one stroke of its beak

the human/ultra new tricky-manjanet

rising to the sky beyond the reach of the eye…

ఎమ్. శ్రీధర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “నాకేమో నువ్వు
    నా చనిపోయిన పూర్వీకులకు
    పునర్జన్మనిచ్చే సంజీవినివి.”

    ఈ వాక్యాలు నాలుగైదు సార్లు చదువుకున్నాను!
    చాలా చాలా బాగున్నాయి 💜💙
    మనస్సుకు పట్టేశాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు