అమ్మబడును

చర్య కోసం ఆహ్వానం

————————-

సమీపంలో వున్న ప్రదేశం అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు, సమస్తం తగులబెట్ట బడ్డాయి ఒకే ఒక్క దుకాణం, దాని బోర్డు తప్ప ‌.

అదేమిటంటే “సమస్త భవనములు మరియు కట్టడముల సంబంధిత వస్తువులు ఇక్కడ అమ్మబడును”.

 

భాగం

——-

అతను అన్నింటికంటే పెద్ద భోషాణంను తన గురించి ఎంచుకున్నాడు కానీ ఎంత గట్టిగా ప్రయత్నంచినా అతడు

దాన్ని కదల్చలేకపోయాడు.

ఇంకొక వ్యక్తి తనకు ఉపయోగపడే వస్తువు ఏదీ చేజిక్కకపోవడంతో అతను దగ్గరకు వచ్చి ఆ వ్యక్తితో  “నీకు

ఏమైనా సహాయం కావాలా? అని అడిగాడు.

అతడు సరే అనగానే ఆ వ్యక్తి అంత బరువైన భోషాణాన్ని

ఊపిరి బిగబట్టి ఒక్క ఊపులో తన వీపుపై ఎక్కించుకున్నాడు.

కానీ ఎత్తిన బరువు ఆ వ్యక్తిని ఎంత క్రుంగదీసిందంటే తన నడుము విరిగుతుందేమో లేక కాళ్ళు చచ్చుపడిపోతాయేమో అన్న భయం పీడిస్తున్నా ఏదో ఒక బహుమతి దొరుకుతుందేమో అన్న ఆశ అతనిని వీధి వరకూ నడిపించింది.

ఆ భోషాణం ముందుగా ఎంచుకున్న వ్యక్తి శారీరకంగా పెద్ద ఆరోగ్యవంతుడు కాకపోయినా, దానిపైన తన యాజమాన్యాన్ని తెలిసేలా చేయాలని వీధిలో ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరేవరకూ దానిపై ఓ చెయ్యి వేసే వుంచాడు.

అసలు కష్టమంతా తనే పడుతూ ఆ సురక్షిత ప్రదేశం వరకూ భోషాణాన్ని  మోసిన వ్యక్తి మెల్లగా దానిని కిందకు దించి “నాకు దీనిలో ఎంత భాగం యిస్తారో తెలుసుకోవాలని వుంది” అని అన్నాడు.

“నాలుగో భాగం” అని జవాబు వచ్చింది.

“అది సరిపోదు”

“లేదు ? నేనే ముందుగా దీన్ని కనుక్కొంది గుర్తుంచుకో!”

“నిజమే ! కానీ దాన్ని నా నడుంపై యింత వరకూ మోసుకుని వచ్చింది నేనే “

“సరే సగం సగం ఏమంటావ్?”

“ఇదే సరైన ఒప్పందం.లోపల ఏముందో చూద్దామా?”

భోషాణం తెరవగానే అందులోంచో ఓ వ్యక్తి కత్తితో బయటకు వచ్చి ఆ కత్తితోనే ఆ యిద్దరు భాగస్తులనూ నాలుగుగా మార్చేశాడు.

 

ఆచార భేదం

———————

“నేను నా కత్తిని అతని శ్వాస నాళికకు అడ్డంగా పెట్టి చాలా మెల్లగా  నరికేశాను.” 

“అలా ఎందుకు చేశావ్?”

“ఎందుకు అంటే దాని అర్థం?”

“అతడిని ఎందుకు చంపావు, *కోషెర్?”

“ఎందుకంటే అలా చెయ్యటం నాకిష్టం కనుక”

“ఒరేయ్ వెధవా, నువ్వు వాడి మెడ ఒక్క వేటుతో వేరు చేయాల్సింది. ఇదిగో యిలా”

ఆ విధంగా హంతకుడు కోషెర్ సరైన ఆచార పద్దతిలో చంపబడ్డాడు. 

 

(*కోషెర్ అంటే ఓ శుద్ధ పద్దతిలో వంట తయారు చెయ్యడం)

*

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాదత్ మాంటో కథల ద్వారా ఆయన్ని పరిచయం చేసిన రఘు గారికి వందనాలు. చక్కని అనువాద శైలితో ఆకట్టుకుంటున్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు