అమెరికా వాళ్ళ తెలుగు చదువు 

కొత్త శీర్షిక ప్రారంభం!

సుమారు మూడు వారాల కిందట మా ఊరు డెట్రాయిట్ లో తెలుగు భాష, సాహిత్యాల గురించి రెండు రోజులు సభ చేశారు, డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి వారు, ఆ సంస్థ మొదలై పాతికేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా. ఆ పాతికేళ్ళ జ్ఞాపకాలు కొన్ని ఇక్కడే సారంగలో ప్రచురించారు కూడానూ.

ఐతే ఇప్పుడు నేను ఎత్తుకున్న ముచ్చట జ్ఞాపకాల గురించి కాదు, సభల ముఖ్య ఉద్దేశాలను గురించీ, ఆ ఉద్దేశాలకు సంబంధించి అక్కడ జరిగిన ప్రసంగాల గురించీ, ఆ ప్రసంగాలని వింటున్నప్పుడు నాకు కలిగిన కొన్ని ఆలోచనల గురించీను.

సభల ఆహ్వాన పత్రికలో నిర్వాహకులు ఈ రెండూ ముఖ్య అంశాలు అని ప్రకటించారు. ఈ అంశాలను ఇక్కడ నేరుగా ఉటంకిస్తున్నాను.

1. దూరమైన కొలదీ పెరిగే అనురాగం ప్రవాసంలో మనకున్న తెలుగు భాషాభిమానానికి ఒక ముఖ్య కారణం. ప్రవాసులు కాక ముందు నుంచీ తెలుగు సాహిత్యాన్ని అభిమానించినవారు, సాహిత్యంతో సన్నిహిత సంబంధం ఉన్నవారూ లేకపోలేదు గానీ, అధికభాగ ప్రవాసులు మాత్రం ప్రవాసంలో తెలుగు సాహిత్యం మీద మమకారం పెంచుకున్నవారే. భాషకు సంస్కృతికీ ఉన్న అవినాభావ సంబంధం కారణం గానే అనేక భాషా ప్రాతిపదిక సంఘాలూ ఏర్పాటయ్యాయి. ఆయా సంఘాల్లో భాషకున్న స్థానాన్ని ప్రశ్నించ వలసివచ్చినా, భాషపై మక్కువను అనుమానించలేం. సాహిత్యమనేది పెద్ద మాటగా తోచినా తెలుగుమాటను, తెలుగు పుస్తకాన్ని ప్రవాసంలో మరుగున పడెయ్యటానికి ఇష్టపడని భాషాభిమానుల అనుభవాల సమాహారం ఈ చర్చ ఆశయం.

2. ప్రవాసుల్లో తెలుగు మాట్లాడేవారు, చదివేవారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలనించి వలస వచ్చిన మొదటి తరం తెలుగు వారు. తెలుగు సంఘాల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేది వారే. రెండవ తరం వారికి తెలుగు అర్ధమైనా, అరకొరగా తెలుగు చదవడం రాయడం తెలిసినా కాలేజి చదువుల నాటికి మరుగున పడిపోతాయి. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితుల వంటి సంస్థల సాహిత్య గోష్టుల్లో పాల్గొనేవారు కూడా మొదటి తరం ప్రవాసులే. కాలక్రమేణా తెలుగు రాష్ట్రాలలోని పాఠశాలల్లో తెలుగు నేర్వడం తగ్గుతున్న దృష్ట్యా ప్రవాసులైన తెలుగు యువత లోని భాషాభిమానాన్ని తెలుగు సాహిత్యం వైపు మొగ్గు చూపించేలా మళ్ళించగలిగితే భాషను నిలుపుకోగలిగే అవకాశం పెరుగుతుంది. ఈ పనిలో భాషా ప్రాతిపదికన ఏర్పరుచుకున్న సంఘాల, సాహితీ సంస్థల ఆవశ్యకతను, బాధ్యతలను చర్చించడం రెండవ అంశం ఆశయం.

అమెరికా నలుమూలలనించీ వచ్చిన తెలుగు రచయితలు, తెలుగు భాషా ప్రేమికులూ ఈ రెండు అంశాల గురించీ చాలానే మాట్లాడారు. మొదటి అంశానికి సంబంధించి – అప్పట్లో చదువుకోటానికి ఒక తెలుగు పుస్తకం దొరకడం ఎంత కష్టంగా ఉండేదో, ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా ఎంత సులభమైందో ఇలాంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ముప్ఫయ్యేళ్ళు పైబడిన నా ప్రవాసంలో నేనూ ఇవన్నీ అనుభవించాను గనక అవన్నీ నా అనుభవాలలాగానే నాకు తోచాయి.
రెండో అంశానికి సంబంధించిన సంభాషణలే నాకు కొరుకుడు పడలేదు. నిర్వాహకులు అడిగింది – అమెరికాలో మన తరవాతి తరాలకి ఈ తెలుగు భాషని అందించడం ఎలాగా, ఊరికే అందించి ఊరుకుంటే సరిపోదు ఆ భాషని వారు నిలుపుకుని వారి తరవాతి తరాలకి కూడా అందించే ప్రయత్నానికి ఇప్పుడు ఎలాంటి పునాది వెయ్యాలి – ఇది నాకు అర్ధమైంది.

1991 లో అనుకుంటా నేను మొట్టమొదటి సారి తానా మహాసభలకి వెళ్ళాను. కొన్ని వేల మంది తెలుగువారిని ఒక్క ప్రాంగణంలో చూసేసరికి ప్రాణం లేచొచ్చిన మాట నిజమే. ఆంధ్రదేశం నించి వచ్చిన పెద్దాయన ఎవరో వేదిక మీద నించి – తెలుగు భాషని రక్షించుకోవడానికి అమెరికా ప్రవాసులందరూ నడుములు బిగించాలనీ, ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పాలనీ పిలుపునిచ్చారు. అది జరిగి ముప్ఫయ్యేళ్ళు దాటాక ఇప్పుడూ మన (అంటే అమెరికా తెలుగు) సమాజం అదే ప్రశ్న వేసుకోవలసి వచ్చిందీ అంటే … ???

అమెరికాలో నా తరం వాళ్ళ పిల్లలు ఇప్పటికే కాలేజీ చదువులు ముగించి ఉద్యోగాల్లో స్థిరపడే స్థితిలో ఉన్నారు. నాకంటే పదేళ్ళు చిన్నవారైన వారి పిల్లలు బహుశా హైస్కూళ్ళలో చదువుతూ ఉండి ఉంటారు. హైస్కూల్లోనూ, తదుపరి కాలేజి లోనూ లాంగ్వేజి, లిటరేచర్ కోర్సుల ఆవశ్యకత బాగా పరిచయమయ్యే ఉంటుంది ఈ కుటుంబాల వారందరికీ. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. గత పదేళ్ళలో అమెరికా వ్యాప్తంగా కాలేజి స్నాతకులైన తెలుగు సంతతి వారి పిల్లలని సర్వే చేస్తే వారు ఇంగ్లీషు కాకుండా నేర్చుకున్న మరో భాష ఏదై ఉంటుంది అంటారూ?
అసలు అమెరికాలో ఉంటున్న వాళ్ళు – వాళ్ళు తెలుగు సంతతి పిల్లలైనా, మరో భారతీయ సంతతి పిల్లలైనా, లేక వాళ్ళకి తెలుగుతో ఎటువంటి పూర్వ అనుబంధం లేకపోయినా – వాళ్ళకి తెలుగుభాష నేర్చుకోవలసిన అవసరం ఏవిటి? తెలుగు సంతతి వారు అయితే, ఆయా తలిదండ్రులు ఇది మా భాష, ఇది మా సంస్కృతి, ఇది ఎలాగోలా మా పిల్లలకి నేర్పాలి అని ఆరాట పడవచ్చు, కానీ అది తలిదండ్రుల ఆరాటంగానే మిగిలిపోతున్నది. పిల్లలకి తెలుగు నేర్చుకోవడానికి ఇన్సెంటివ్ ఏది?
భాష నేర్చుకోవడానికి, వృత్తి పరమైన, ఆర్ధికమైన ఇన్సెంటివ్ ఉండాలా?

మాట వరసకి ఒక పాప – ఎవరో ఎందుకు, మా అమ్మాయే అనుకోండి. హైస్కూల్లోనూ, కాలేజిలోనూ స్పానిష్ చదువుకుంది. ఆయా సమయాల్లో రెండు మూడు హిస్పానిక్ దేశాలకి ఎడ్యుకేషనల్ ట్రిప్స్ వెళ్ళొచ్చింది. స్పానిష్ ధారాళంగా మాట్లాడుతుంది. లవ్ ఇన్ ద టైమాఫ్ కలరా నవల మూలంలో చదివింది. ఇంతా చేసి ఆ స్పానిష్ జ్ఞానం అంతా ఇప్పుడు దేనికి ఉపయోగిస్తుంది? ఆమె ఏమీ యునైటెడ్ నేషన్స్ లో గానీ, ఇతర దౌత్య వ్యవహారాలలో గానీ, కనీసం హిస్పానిక్ దేశాలతో ముఖ్య వ్యాపారం చేసే సంస్థలో గానీ ఉద్యోగం చెయ్యడం లేదు. అంటే ఆమె స్పానిష్ చదువు ఆమెకి జీవన భృతిలో, ఉద్యోగ వ్యాపార అభివృద్ధిలో ఎటువంటి ఉపయోగమూ చెయ్యడం లేదు.

ఐనా … ఎనిమిదేళ్ళ చదువులో సుమారు 10 – 15 శాతం సమయాన్ని, శ్రమనీ ఆ భాష నేర్చుకోవడానికి ఉపయోగించింది. మా అమ్మాయిలాంటి విద్యార్ధులు, ప్రతీ ఏటా, మిలియన్ల కొద్దీ – ఆయా భాషా సంస్కృతులతో ముందటి అనుబంధం ఏమీ లేని వాళ్ళు – నేర్చుకుంటున్నారు. స్పానిష్, ఫ్రెంచ్, జెర్మన్ … ఇంకా మాట్లాడితే చైనీస్, అరబిక్ …

1950 లలో ఇదే పరిస్థితి ఉండేదా అమెరికాలో?

లేదు.
కొన్ని సాంఘిక రాజకీయ పరిణామాల వల్ల ఇది సంభవించింది.
ఆర్ధికంగా అమెరికా తెలుగువారు ఎన్నో గొప్ప శిఖరాలు అధిగమించినా ఈ కీలకమైన సూత్రం మనవారి దృష్టికి రాలేదు. వచ్చి ఉంటే తెలుగు నేర్పడం ఒక కుటీర పరిశ్రమగా మిగిలి ఉండేది కాదు. 2023లో మనం ఈ అంశాన్ని చర్చిస్తూ కూర్చునే వాళ్ళం కాదు.
 ***
స్కూల్లో కాలేజిలో స్పానిష్ అభ్యసించడం గురించి చేసిన చిన్న పరిశోధనలో ఈ వ్యాసం నా కంటబడింది. రెండవ భాష నేర్చుకోవడం గురించి హారిస్ గారు చెప్పిన మాటలు నాకు నచ్చాయి. మీకు కూడా ఆసక్తికరంగా ఉంటుందని ఆ లంకె జతపరుస్తున్నాను.
*

ఎస్. నారాయణ స్వామి

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very Interesting. I am sorry I am not able to type in Telugu. Recently, I have been wondering whether we should take classes for Telugu in Andhra Pradesh.

  • అవసరం ఏమిటి అని ప్రశ్నించుకోవడం మొదలుపెడితే దొరికే సమాధానం కాదిది. స్పానిష్, చైనీస్ లాంటి పెడ్డచేపలే కాదు కేవలం 90 లక్షల జనాభా ఉన్న స్వీడిష్ లాంటి భాషలు కూడా తరతరాలుగా వారసత్వంగా సాగుతున్నాయి అంటే వారి స్వాభిమానం, సంస్కృతి పట్ల మమకారం వలనే.

    ఒక 100 యేళ్ళ నుంచే భారతదేశంలో పెరిగిపోయిన సమస్య “కూడుకోసం” “అవసరార్థం” చేసే పనులే ముఖ్యం మిగిలిన అభిరుచుల లేదా కళల మీద సమయం పెట్టడం వృథా అనే అంతర్లీనమైన భావమే భాష వరకు వచ్చింది. క్రమేపీ తిండి, బట్ట, పండుగలు అన్నిటినీ ప్రశ్నించడం అన్నీ అవసరం అని తెల్చేయడం ఒక మేధావి వర్గం యొక్క గొప్ప లక్షణం గా గుర్తించబడడం కడు శోచనీయం.

    భాష మీద దానిలో ఉన్న మెలకువలు మీద జరిగిన అనేక పరిశోధనలు, కృషులు భారతీయ భాషలలో ఉన్నంతగా ప్రపంచంలోనే మరెక్కడా లేవు అన్న సత్యం ఈనాడు మరుగున పడిపోయి మన సంపదను మనమే గుర్తించలేని పరిస్థితికి వచ్చేసాం.

    ఈ అవసరాన్ని బట్టి చేసే జీవనశైలిని పక్కనపెట్టి మళ్లీ మన గత వైభవాన్ని సగర్వంగా గుర్తుచేసుకునే రోజు వచ్చినప్పుడే భాషలోని అందాన్ని ఆస్వాదించడానికి ఆస్కారం పెరుగుతుంది.

  • Narayana Swamy garu
    …thought provoking and well written as always.

    I wrote a series of articles analyzing diaspora stories in Telugu. One of the topics I researched was the history of the key languages like English, Spanish, French, Portuguese, Italian and Irish as they came to Americas along with the immigrants. A key conclusion from that research ties to your point on incentives.

    Countries tie most of the incentives to the national language or rajyabhasha. These incentives can be tangible like money or intangible like fame. So over a period citizens irrespective of their mother tongues gravitate towards these incentives laden national languages. It is true in the case of English adopted by US and Canada, Spanish adopted by South American countries and Portuguese by Brazil. Best of the literary works also evolve in these languages in their respective countries.

    History tells –
    First generation immigrants will continue to practice and pine for their native tongue. The kids of this first generation in couple of generations will become a part of the melting pot and adopt the the national language. Even the literary works of second and third generation immigrants come out in the adopted national language rather than the native language of the roots.

    Having said that – sizeable section of people speaking a particular language even as first generation immigrants are pockets of opportunities for business. There is considerable demand for Spanish speaking folks in the south like Miami.

  • బావుంది, వ్యాసం తెలుగులో రాసినా, ఎక్కువగా వ్యాఖ్యానాలు (అభిప్రాయాలు) ఇంగ్లీషులో ఉన్నాయి. అలాగే ఇక్కడ (అమెరికాలో) తెలుగు నేర్చుకోవాలంటే ఇంగ్లీషు మాధ్యమం ద్వారా నేర్పించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడి పిల్లలకి ముందుగా ఇంగ్లీషు (అమెరికన్ మాండలికం) భాషపై పట్టు అధికంగా ఉంటుంది. పాఠ్యాంశాలను అందుకు తగిన విధంగా రూపొందించుకోవలసి ఉంటుంది.
    ఒక భాష నేర్చుకోవటం అనేది ఆత్మతృప్తికోసం, మరో భాషా స్నేహితుడిని పొందడం కోసం. (Learn a language to earn a friend). అంతకన్నా ఫలాపేక్ష అన్ని భాషల ద్వారా పొందలేం.

  • మాతృభాష అనేది ఒక యాక్సిడెంట్. ఫలానా కుటుంబంలోనో లేక ప్రాంతంలోనో పుట్టటం వల్ల అబ్బేది. అమెరికాలో రెండోవ జెనరేషన్ తెలుగు భాష నేర్చుకోవటం, మాట్లాడుకొనే సౌలభ్యం కోసమే గానీ తెలుగు సాహితీ పరిచయం కోసమో, లేక వికాసం కోసమో కానే కాదు.

    అమెరికాకి వలస తెలుగు ప్రాంతాల నుంచి వస్తూనే ఉంటారు. వారు తెలుగు సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే ఉంటారు. ఇంతకు మించి నాకు ఏమీ అనిపించటంలేదు.

  • వ్యాసం, చాలా ఆసక్తి దాయకంగా వుంది. మొన్న సిలికాన్ ఆంధ్రా & వంగూరు ఫౌండేషన్ వారి తెలుగు సభలకి ఒక రోజు వెళ్ళాను.
    నిజంగా అంత మంది తెలుగు వారిని చూసి, వారి మాటలు విని ముచ్చటేసింది.
    అక్కడ లైబ్రరీ లో “మనబడి ” గురించి కొన్ని పుస్తకాలు చూసాను. వారి కృషి అంభినందించ దగింది.
    మరి ఈ తెలుగు నేర్చుకొనే విద్యార్థులకి ఏదో ఒక ప్రత్యేక ప్రోత్సాహం (ఇన్సెంటివ్ ) అకాడమిక్ కోర్సుల్లో ఉండాలి కదా?
    సంగీతం, నాట్యం కళలలో ఇచ్చే ప్రోత్సాహకాలలా.
    ఆ విషయం మీ లాంటి రచయతలు, రచయత్రులు ఆలోచించండి 🙏
    తటవర్తి నాగేశ్వర రావు,
    Sanjose, CA

  • If I understood correctly,  your question is what incentives can we provide to the kids born and brought up abroad, to learn and bond with Telugu language.
    The little that I had the chance to observe,  incentives were family atmosphere encouraging binding with elders and relatives, and of them not having the practice of talking in English at home, parents who enjoyed watching Telugu movies and didn’t fuss about their quality seem to have passed on more Telugu to kids, than literary enthusiasts. That’s because to them, Telugu was a means of bonding with parents and extended family and simply having fun.
    What acted against passing on Telugu bonding experience for me was the lack of the above. So, I engaged them in creative activities of my own and that had some effect on one of my kids.

    For a more enriched experience of Telugu, classical arts are a great channel. There are many parents who get their children to learn classical dance and music. That has to have them absorb Telugu  just because of that exposure.

    Now, to build an active interest and prepare the ground for them to take it further, I always felt the lack of the most important incentives, original children’s literature and entertainment programs in Telugu. New parents now seem to be able to find books and rhymes in more abundance than me.  So, that’s a step forward already.  And then there are the various initiatives by SiliconAndhra.

    We have to keep in mind that not all kids bond with language the same way, even in case of English. Some children have a special fondness for language(s).  Now, do we have the resources to make the kind of books and materials available to them, that can satisfy their hunger and further their interest in the language?

    I am still struggling to find materials,  perhaps because of my own limited awareness, to provide to my son who re-learned Telugu on his own after a gap of many years.  A nephew of mine also learned to read and write Telugu outside the school system, within India but living in non-Telugu states.

    Love of language is inculcated and absorbed primarily when it is one of the means to bond with family and community. So, what are the programs available for kids in the events organized by various Telugu organizations? All that being said and doing our best to lay a foundations, some kids go an extra mile because of their own fondness for language (not for Telugu, but Telugu being a language and they being lovers of language). So, having cultural and literary programs, more spread out, intimate rather than elaborate,  alongside the the network building grand events are much needed. Parents and children alike need exposure to and awareness of what is available,  so that those interested, even if they are few, will go further and perhaps their numbers will increase too. Events at local Public libraries, perhaps? Young Parents and children come there anyway.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు