అమెరికా ఎన్నికలు- కొన్ని సంగతులు

మెరికా ఎన్నికలు ప్రపంచ స్థితిని గతిని మార్చే ఎన్నికలు కాబట్టి, వాటిని ఏమేమి ఎలా ప్రభావితం చేసాయో తెలుసుకోవటం ఉపయోగంగా ఉంటుంది. ఎన్నికల ముందు గెలుపు ఎవరిది అనేది అంచనా వేయటం అనేది చాలా కష్టం. ఎన్నికల తరువాత ఎక్సిట్ పోల్స్ చూసాక కాని కారణాలు అర్థం కావు. పలురకాల పరుధుల్లో ఎన్నికల ఫలితాలని కొలుస్తారు. పార్టీ ఐడియాలజి పరంగా ఎంతమంది వేసారు, దేశ ఆర్ధికస్థితి పరంగా ఎంతమంది వేసారు, అలాగే, జాతి, వయసు, లింగము, వివాహ స్థితి, కుటుంబ ఆర్ధిక వనరులు, మతము ఇలా ఒక్కొక్కటి చూస్తూ వెళ్తే ఓటరు వ్యవహరించే తీరు ఎంత భిన్నంగా ఉంటుందో అర్థం అవుతుంది.

ఇవన్నిటికన్నా కూడా విజయానికి ముఖ్యమైనవి మూడు విషయాలుంటాయి.  అది కేవలం ఎన్నికలకే అనుకుంటే పొరపాటు. ఎవరికైనా వర్తిస్తాయి. దీన్ని అవగాహన చేసుకున్నపుడు విజయం సులువు అవుతుంది. ఒకటి, సిద్ధాంతపరంగా వ్యవహరించటం. నేను ఇంతే, నా పార్టీ సిద్ధాంతాలు ఇంతే, ఇదే మీ అందరికి మంచిది అని మూసలో పోవటం కాకుండా, ప్రజల నాడి ప్రకారం మాట్లాడి వాళ్ళకి అనుగుణంగా ముందు మాట్లాడిస్తే తరువాత విషయం తరువాత. ప్రజల నాడి తెసుకోవటానికి పలురకాల మాధ్యమాలు ఉంటాయి. వీటిని వినియోగించుకోలేకపోవటం ఓటమికి దారి తీస్తుంది.

రెండవది, మనం ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాము అన్నదికూడా మన గెలుపు ఓటములని నిర్ణయిస్తుంది. పేలవమైన వాళ్ళని ఆసరా కోరితే ఓటమి తప్పదు. మూడవది.  నిర్మాణత్మక దృక్పధంలో అన్నిటిని వివరించి, వ్యవహరించలేకపోవటం. సిద్ధాంతాలున్నా, ప్రజలనాడి తెలుసుకున్నా, సరైన సన్నిహుతులున్నా నిర్మాత్మక దృక్పధం, వ్యవహారం లోపిస్తే ఓటమి తప్పదు. ఒకరకంగా చూస్తే పొలిటికల్ మానిఫెస్టోనే చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. సరైనా పాలిసీ అగెండా లేకపోవటం అనేది తప్పక ఓటమికి దారి తీస్తుంది. ఈ మూడింతికి చాలా మంచి ఉదాహరణలున్నా అవి నేను ఇక్కడ ప్రస్తావించబోవటం లేదు.

ఇందాక కొన్ని పరధుల్లో ఎన్నికల ఫలితాలని లెక్కిస్తారు అని అనుకున్నాం. ఈ పరధులు అర్థం చేసుకోవటం జయపజయాలకి ఎంతో ముఖ్యం. ఈ అంశాలన్ని ప్రభావితం చూపుతాయి. ఈ విశ్లేషణలో చాలా ఆసక్తి కరమైన విషయాలు కనిపిస్తాయి (CNN ఎక్సిట్ పోల్స్ డాటా అధారంగా).

> రిపబ్లికన్లు దేశ ఆర్ధిక స్థితి అసలు బాగోలేదు అనుకుంటే డెమోక్రాటులు చాలా బాగుంది అనుకోవటం.

> అబార్షన్ అనేది రిపబ్లికన్లు ఇల్లీగల్ అనుకుంటే, అది ఒక సమస్యే కాదని డెమోక్రాటులు అనుకోవటం.

> మిలిటరీ వెటరన్లు ఎక్కువమంది రిపబ్లికన్ పార్టీని సపోర్ట్ చేయటం.

> మతపరంగా వోట్లు విడిపోవటం.

> ధనిక వర్గం డెమోక్రాటులని ఎన్నుకుంటే దిగువ మధ్యతరగతి వర్గం రిపబ్లికన్ వైపు మొగ్గుచూపటం

> పెళ్ళికాని అమ్మాయిలు డెమోక్రాట్ల వైపు ఉంటే, పెళ్ళి అయిన అమ్మాయిలు రిపబ్లికన్ వైపు ఉండటం. ఇక పెళ్ళి అయినా కాకపోయినా అబ్బాయిలు రిపబ్లికన్ వైపు ఉండటం.

> ఇక జాతి పరంగా చూస్తే నల్ల జాతీయులు, లాటినోలు డెమోక్రాట్ల వైపు ఉండటం, శ్వేత జాతీయులు రిపబ్లికన్ వైపు ఉండటం.

> కాలేజి డిగ్రి ఉన్నవారు డెమోక్రాట్ల వైపు ఉంటే కాలేజి డిగ్రీ లేనివారు రిపబ్లికన్ వైపు ఉండటం.

> వయసుపరంగా చూస్తే యువకులు, మధ్యవయసు మగ వారు రెపబ్లికన్ వైపు, యువతులు, మధ్యవయసు స్త్రీలు డెమోక్రాట్లవైపు ఉన్నారు.

> వలసవాదం పై ఎవరికి వారు విపరీతమైన నమ్మకం కలిగిఉండటం.

ఈ అంశాలన్ని ఓటర్ల స్థ్థిని వ్యవహారికతను తెలియచేస్తాయి. అలా వ్యవహరించటానికి కారణాలు మళ్ళీ పొలిటికల్ సిస్టం నుంచి పుట్టినవే ఉంటాయి. అంటే ఓటర్లు నాయకులని ప్రభావితం చేస్తే, నాయకులు ఓటర్లని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో  మీడియా అనేది అర్థంచేపించే యంత్రంగంలా పనిచేయాలి తప్పించి విడదీసే విధంగా ఉండకూడదు.

చివరిగా విజయానికి కారణమైన రిపబ్లికన్ పార్టీ అజెండా.

ఆర్ధిక విధానాలు: ఆర్ధిక నిబంధనలు తగ్గించటం, సంపన్నులకు, కార్పోరేషన్లకు పన్ను తగ్గించటం
వాణిజ్యం: అన్ని దిగుమతులపై సుంకాన్ని పెంచటం
వలసవిధానం: చట్టవిరుద్ధ వలసలను బహిష్కరించటం
పర్యావరణం: అన్నీ వాతావరణ ఒప్పొందాలనుండి వైదొలగటం
మహిళల హక్కులు: గర్భస్రావం పై జాతియ స్థాయి నిబంధనలు

విదేశాంగ విధానాలు: నాటో కి మద్దతు తగ్గించటం, ఇజ్రాయిల్ కి పూర్తి మద్దతు, ఉక్రెయిన్-రష్యా విషయంలో ఒప్పందాలు

ప్రజాస్వామ్యం: ప్రజాస్వామిక సంస్థలు అయిన, జాతీయ భద్రత,  న్యాయశాఖ, మీడీయా వీటి జోక్యాన్ని తగ్గించటం.

 ప్రజలు తమకు  తాముగా ఇవి కావాలని ఎంచుకున్నారు. ముందుగా చెప్పినట్లు సిద్ధాంతపరమైన వ్యవహార శైలి కాకుండా నాయకులను ఎంచుకోవటంలో వారి బలం, ఆత్మనిర్భరత, ఆధిపత్యం, మరియు రాజకీయ సరళిని వ్యతిరేకించే తత్వం వీటిని చూస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
అంతేకాక ప్రపంచ అస్థిరత, ఆర్థిక అనిశ్చితి,  మానసిక ఆరోగ్య సంక్షోభాల నేపథ్యంలో, బలమైన  నిర్ణయాత్మక నాయకత్వం కోసం చూస్తున్నారు ప్రజలు. దీని ఫలితంగా, నిర్ణయాత్మకమైన, స్పష్టమైన పరిష్కారాలను అందించే నాయకుల పట్ల గణనీయమైన ఆకర్షణ ఏర్పడింది. వారు కొన్నిసార్లు నియంతృత్వ శైలిని ప్రదర్శించినప్పటికీ, సామాజిక స్పృహతో వ్యవహరిస్తారు.పైపైన మనిషిని చూసో, మనిషి వ్యవహరాన్ని చూసో, పార్టీ ని చూసో వీరు గెలుస్తారు, వారు గెలుస్తారు అని ఊహాగానాలు కాకుండా నిర్దుష్టమైన పద్దతులు ఎందుకు ఎపుడు ఎలా ఉద్భవిస్తాయనేది అర్థం చేసుకోవటమే సామాజిక స్పృహ. ఏ ఎన్నికలైనా అన్నీ కోణాల నుంచి చూడాలి.
*

విజయ నాదెళ్ళ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు