మూలం : అమృతా ప్రీతం
కంకర రాళ్లు , సున్నం అధిక మోతాదులోనే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే కొద్ది స్థలంలో ఇంటి గోడలా ఉండిపోయేది. కాని అలా కాలేదు. అది నేల పై పరచుకుంది తారు రోడ్డులా! పైగా వాళ్లిద్దరు జీవితాంతం రోడ్లపై పచార్లు చేయసాగారు.
తారు రోడ్లు ఒకరి నుంచి మరొకరి శరీరాలను చీలుస్తూ వెళ్లుతూండేవి. ఇద్దరికి దగ్గర్నుంచే వెళ్లుతుండేవి. ఇద్దరి చేతుల్లోంచి జారి పోయి, మాయమైపోయేవి రోడ్లు! కొన్ని సార్లు ఆ రోడ్లులు ఒకరి నొకరికి ఆలింగనం చేసుకుని లీనమైపోయేవి. అవి అప్పుడప్పుడు దగ్గరికి వచ్చి ఒకరికొకటి కలసుకునేవి. పరచిన తారు రోడ్డు పై వారిద్దరి పాదాలు వచ్చి కలసుకునేవి.
రోడ్డు. తారు రోడ్డు. నేరుగా వెళ్లుతూంది. కొన్ని చోట్ల, కుడి ఎడమ వైపుకు కూడా వెళ్లుతూంది.
కొన్ని నిమిషాలకోసం బహుశా రోడ్లు కూడ విస్తూబోతు ఆగి పోతాయి. వాళ్లిద్దరి పాదాలు కూడా. అప్పుడు వారిద్దరికి ఇంకా కట్టబడని, నిర్మించబడని ఇల్లు గురించిన విషయం గుర్తుకొస్తుంది. కాని అది ఎందుకు నిర్మించబడలేదు? వాళ్లిద్దరు ఆశ్చర్యబోతు తమ పాదాల క్రింద ఉన్న నేల పై చూపులు పెట్టుతారు. తమ ఇంటిని గురించి నేలను అడుగుతున్నట్లు!
అలాగే చాలా సేపు వరకు రోడ్డును నిశితంగా వెదకసాగారు. ఇంటి పునాదులను వెతుకుతున్నట్లు. నిజంగా అక్కడ మాయ ఇల్లు ఒకటి కట్టబడి ఉన్నట్లు భావించే వారు. పైగా ఆ ఇంట్లో ఎన్నో యేండ్ల నుంచి ఉన్నట్లుగా భావించే వారు.
ఇది వారి నిండు వయసులో ఉన్న మాట కాదు. ఇప్పటి మాట. వర్తమానం లో ఉన్న మాట. వయసుపై పడినప్పటి మాట.
‘అ’ ఓ ప్రభుత్వ మీటింగ్ కోసం ‘స’ పట్టణం కెళ్లింది. మీటింగ్ అయ్యాక బయటి నుంచి వచ్చిన వాళ్లకు టిక్కెట్లు సమకూర్చారు. ‘స’ ముందుకు వెళ్లి ‘అ’ టిక్కెట్ తీసుకున్నాడు. మీటింగ్ రూం లో నుంచి బయటికొచ్చి, ‘అ’ తో తన కారులో కూర్చోమని చెప్పాడు.
“సామాను ఎక్కడ ఉంది? హోటల్ లోనా?” అని ‘స’ అడిగాడు.
‘స’ డ్రైవర్ తో మొదట హోటల్కు ఆ తర్వాత ఇంటికెళ్లుదామని అన్నాడు.
‘అ’ అభ్యంతరం చెప్ప లేదు. కాని “ప్లేన్ కు కేవలం రెండు గంటలే ఉన్నాయి. హోటల్ నుంచి ఎయిర్ పోర్ట్ కెళ్లడం కష్టమే అవుతుంది. అంత సమయం ఉండదేమో!” సందేహం వెళ్లబుచ్చింది.
“ప్లేన్ రేపు కూడా వెళ్లుతుంది. ఎల్లుండి కూడా వెళ్లుతుంది. రోజు వెళ్లుతుంది.” ‘స’ అన్నాడు. దారిలో ఏమీ మాట్లాడలేదతను.
హోటల్ లో నుంచి సూట్ కేస్ తీసుకొని కారులో పెట్టాడు. ‘అ’ మరోసారి అంది, “సమయం కొద్దిగానే ఉంది. ప్లేన్ మిస్ అవుతుంది.”
“ఇంట్లో అమ్మ ఎదురు చూస్తుంది”‘అ’ తో ‘స’ అన్నాడు.
‘అ’ ఆలోచించసాగింది, బహుష ‘స’ ఈ మీటింగ్ గురించి అమ్మకు చెప్పాడేమోనని. కాని తనకు అర్ధం కాలేదు ఆమెకు చెప్పాల్సిన పనేముందని! ‘అ’ అప్పుడప్పుడు తన మనసుతో ఇలా ఎందుకు ప్రశ్నించుకొంటుందో కాని జవాబు కోసం మాత్రం నిరీక్షించదు. మనసు దగ్గర ఏలాంటి జవాబు లేదని ఆమెకు తెలుసు.
ఆమె నిశ్శబ్దంగా కారులో కూర్చొని గాజు కిటికిలో నుంచి బయటి వైపుకు పట్టణంలోని మేడలను చూడసాగింది.
కొంత సమయం గడిచాక, మేడలు అదృశ్యమైయ్యాయి.
దూరం నుంచి పట్టణంలోని మనుషులు దగ్గరికి వస్తూ కనిపించారు.
దగ్గరలో ఉన్న చెట్లు/వృక్షాలు బారులు తీరి ఉన్నాయి.
బహుశా సముద్రం దగ్గర్లోనే ఉంది. ‘అ’ కు శ్వాస ఉప్పుగా అనిపించింది. అమెకు అనుభవం అయింది…పామ్ ఆకుల మాదిరిగా ఆమె చేతులలో కంపనం వచ్చింది. ‘స’ ఇల్లు దగ్గరికొచ్చినట్లుంది…
చెట్లతో చుట్టుకోబడినట్లున్న చిన్నగా ఉన్న ఇంటి దగ్గర కార్ వచ్చి ఆగింది.
‘అ’ కారు నుంచి క్రిందికి దిగింది. కాటేజ్ లో ప్రవేశానికి ముందు అక్కడున్న ఓ అరటి చెట్టు దగ్గర కొన్ని నిమిషాలు ఆగిపోయింది. వణుకుతూన్న తన చేతులను వణుకుతూన్న అరిటాకుల మధ్యలో పెట్టుకోవాలని కొద్ది సేపు వరకు అనుకుంది. ఆమె ‘స’ తో కాటేజ్ లోపలికి వెళ్లగలదు. కాని చేతులకు అక్కడేమి పని లేదు! ఇప్పుడీ చేతుల ద్వారా ‘స ‘ కు ఏమీ ఇచ్చి, తీసుకునే స్థితిలోనూ లేదు.
అమ్మ కారు చప్పుడు విని ఉంటుంది. బయటికి వచ్చింది. ఆమె ఎప్పటిలా ‘అ ‘ నుదురును చుంబింది. “రా అమ్మాయి” అని అంది.
ఈ సారి ‘అ’ చాలా రోజుల తర్వాత అమ్మతో కలిసింది. అమ్మ ఆమె తల పై చెయి నిమురుతూ ఇంట్లొకి తీసుకెళ్లి అడిగింది, “ఏం తీసుకొంటావు అమ్మాయి”
‘స’ కూడా ఇంట్లొకి ప్రవేశించాడు. “ముందు చాయ్ తాగించు. ఆ తర్వాత భోజనం”
డ్రైవర్ కారులో నుంచి సూట్ కేస్ ఇంట్లోకి తీసుక రావడం ‘అ’ చూసింది.
‘స’ తో అంది, “సమయం చాలా తక్కువగా ఉంది. అతికష్టంగా ఏర్పోర్ట్ చేరుకొంటానేమో!
‘స’ ఆమెతో కాక డ్రైవర్ తో అన్నాడు, “రేపుదయం వెళ్లి, ఎల్లుండి కోసం ఫ్లైట్ టికెట్ తీసుకొని రా.” అని, అమ్మతో, “అమ్మ నువ్వు కొందరు మిత్రులను భోజనానికి పిలవాలని అన్నావుగా. రేపు వాళ్లను ఆహ్వానిద్దాం” అని అన్నాడు.
‘అ’ ‘స’ జేబు వైపుకు చూసింది. అందులో ఆమె తిరుగు ప్రయా ణం టికెట్ ఉంది. “…కాని ఈ టికెట్ వృదా అయిపోతుంది” లో గొంతుతో అంది.
వంట గదిలో కెళ్ళుతున్న అమ్మ ఆగి, ‘అ’ భుజాం పై చేయి వేసి అంది, “వాడు అంతగా చెప్పుతుంటే ఆగి పోరాదు”
‘కాని ఎందుకు?’ ‘అ’ మనసులో ఓ ప్రశ్న ఉదయించింది. కొన్ని నిమిషాల తర్వాత మాయమైపోయింది.
కుర్చీ లో నుంచి లేచి వరండాలో కొచ్చి నిలబడింది.
ఎదురుగా, దూరం నుంచి ఎత్తైన పామ్ చెట్లు కనిపించసాగాయి. సముద్రం కొద్ది దూరం లో ఉంది. దాని అలల ఘోష వినిపిస్తుంది. ‘అ’ మస్తిష్కం మేఘావృతమైంది ఆలోచనలతో. ఈ రోజు ‘ఎందుకు’ అన్నప్రశ్న! కాని ఆమె మనసులో ఇలాంటివి ఎన్నో ‘ఎందుకు’ అన్న ప్రశ్నలు తన జీవితంలో, సముద్ర తీరంలో దృఢంగా నిలబడి ఉన్న పామ్ చెట్లలా మొలిచి ఉన్నాయి! వాటి అకులు ఎన్నో సంవత్సరాల నుంచి గాలిలో వణుకుతున్నాయి.
‘అ’ ఇంటి అతిథిలా టీ తాగింది. రాత్రికి భోజనం చేసింది. వాష్ రూం ఎక్కడుందో తెలుసుకొని, అక్కడికెళ్లి నైట్ డ్రెస్స్ వేసుకుంది.
ఇంట్లో పెద్ద హాల్, డ్రాయింగ్-డైనింగ్ రూం మరియు రెండు గదులున్నాయి. ఒకటి ‘స’ కోసం. మరొకటి అమ్మ కోసం. అమ్మ తన గదిని బలవంతంగా ‘అ’ కు ఇచ్చింది పడుకోవడానికి. తను డ్రాయింగ్ రూం లో పడుకుంది.
‘అ’ పక్క గదిలో కొచ్చింది. సంకోచిస్తూ నిలబడింది. అతిథిలా డ్రాయింగ్ రూం లో ఒక రెండు రోజులు గడపితే బాగుండేది. ఇది అమ్మ గది. అమ్మయే ఈ గదిలో ఉంటే బాగుంటుంది అని అనుకుంది.
పడక గదిలోని మంచం పై , కర్టెన్స్ లో మరియు బీరువాలలో ఇంటి వాతావరణం ఉంటుంది. అందులో ఓ సువాసన లాంటిది ఉంటుంది. ‘అ’ గట్టిగా ఈ సువాసన మిళితమైన ఓ శ్వాస పీల్చింది. కాని వెంటనే ఇలాంటి శ్వాసను ఆపుకుంది. తను తీసుకొంటూన్న శ్వాసతో భయపడుతున్నట్లు! పక్కనున్న గది ‘స’ కు చెందింది. అందులో ఏలాంటి చప్పుడు లేదు. కొన్ని నిమిషాల క్రితం తల నొప్పిగా ఉందని చెప్పాడు. నిద్ర మాత్ర వేసుకున్నాడు. నిద్రబోయాడేమో!
పక్కనున్న గదిలో కూడా ఓ విధమైన వాసన ఉంటుంది. ‘అ’ ఆ గదిలోని వాసనను కూడా పీల్చుకోవాలని అనుకుంది. కాని శ్వాస ఆగిపోయి ఉంది!
‘అ’ చూపు అల్మైరా దగ్గర నేల పై ఉన్న తన సూట్ కేసుల పై పడింది. చిన్నగా నవ్వుకుంది. తనలో తానే అనుకుంది…చూడు ఈ రాత్రంతా నువ్వు అతిథివే అని ఈ సూట్ కేసులు గుర్తు చేస్తూంటాయి. ఆ సూట్ కేసెల వైప్ చుస్తూ, అలసిపోయి, మెత్త పై తల ఆనించి పడుకుంది. నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియ లేదు. నిద్రలో నుంచి మేల్కొన్నాక చూస్తే చాలా పొద్దెక్కిపోయింది.
వరండాలో రాత్రి పార్టీ కోసం హడావుడి మొదలైంది. అక్కడ ‘స’ నిలబడి ఉన్నాడు, ఊదా రంగు గళ్ళ లుంగి కట్టుకొని. ‘అ’ ఎప్పుడు కూడా ‘స’ ను రాత్రి పూట బట్టలేసుకొని పడుకునే, నైట్ డ్రెస్ లో చూడ లేదు. ఎప్పుడు కూడా పగటి వేళ్లయే అతన్ని చూసేది. ఏ రోడ్డు మీదనో, రోడ్డు చివర్లో ఉన్న ఏ కేఫేలోనో, హోటల్లోనో లేదా ప్రభుత్వ మీటింగ్స్ లోనో చూస్తూండేది. ఈ వేషం లో అతడు కొత్తగా కనిపించాడు. ఆమె కండ్లు అతని వైపు అతుక్కుపోయాయి.
‘అ’ ఈ సమయం లో నైట్ సూట్ లో ఉంది. వరండాలోకి రాక ముందు ఆమెకే మనిపించక పోయినా, ఇప్పుడు ఆమెకు ఎలాగో అనిపించింది. సాధారణం అసాధారణంగా అనిపించింది. వరాండాలో నిలబడి ఉంది. ‘స’ వస్తూన్న’అ’ ను చూసి అన్నాడు, “ఈ రెండు సోఫా సెట్లను జరిపి నిలువుగా పెట్టండి. మధ్యలో కొంచం జాగా ఉంటుంది.”
‘అ’ సోఫా సెట్ లను ‘స’ చెప్పిన ప్రకారం అమర్చింది. చిన్న టేబుల్ ను కుర్చీల మధ్య పెట్టింది.
ఇంట్లోనుంచి అమ్మ పిలవగా చాయ్ తీసుకొచ్చి టేబుల మీద పెట్టింది.
ఇంట్లోనుంచి అమ్మ పిలవగా చాయ్ తీసుకొచ్చి టేబుల మీద పెట్టింది.
చాయ్ తాగాక ‘స’ ఆమె తో అన్నాడు, “పద. ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో వారిండ్లకెళ్లి చెప్పొద్దాం. అలాగే తిరిగొస్తూ కొన్ని పండ్లు తీసుకొందాం.”
ఇద్దరు కలసి పాత మిత్రుల ఇంటికెళ్లి రాత్రి భోజనానికి రావాలని ఆహ్వానించారు. ఇంటికి తిరిగొస్తూ దారి మధ్యలో కొన్ని వస్తువులు తీసుకొన్నారు. ఇంటికొచ్చాక మధ్యాహనం భోజనం చేశారు. వరాండాలో పూలమాలలతో అలంకరించారు. దారిలో పండ్లు ఏం తీసుకోవాలి. కిళ్లిలు తీసుకోవాలా వద్దా! డ్రింక్స్ తో కవాబులు ఎన్ని తీసుకోవాలి? లాంటి మామూలు మాటలే మాట్లాడారు. కాని ఏడేండ్ల తర్వాత కలసిన వాళ్లు మాట్లాడుకునేలా లేవు.
ఉదయం తమ మిత్రుల ఇంటి ద్వారం తట్టడం లో ‘అ’ కు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. వాళ్లు ‘స ‘ కు మిత్రులైనా చాలా రోజుల నుంచి ‘అ ‘ తో కూడా పరిచయం ఉంది. తలుపులు తెరచిన మిత్రులు ‘స’ తో పాటు ‘అ’ ను చూసి విస్తూబోయారు. అలా ఇద్దరిని ఒకేసారి చూసిన మిత్రులు తేరుకొని చిన్నగా నవ్వసాగారు.
సాయంత్రం పూట ‘స’ ఛాతీలో నోప్పి అవుతుందని చెప్పాడు. ‘స’ అమ్మ ఓ చిన్న కప్పులో కొంచెం బ్రాండి వేసి, “అమ్మాయి ఈ బ్రాండిని అతని ఛాతీ పై రుద్దు” అని ‘అ’ తో అంది.
‘అ’ ‘స’ కమీజ్ పైనున్న మొదటి రెండు బొత్తాలను విడదీసింది. కుడి చేతి వ్రేళ్ల తో కొంచెం బ్రాందిని తీసుకొని అతని చాతీ పై రుద్దసాగింది.
బయట పామ్ చెట్ల ఆకులు బహుష ఇంకా వణుకుతూనే ఉన్నాయి. కాని ‘అ’ చేతిలో మాత్రం వణుకు లేదు.
ఓ మిత్రుడు సమయానికి ముందే విచ్చేసాడు. ‘అ’ బ్రాందిలో మునిగిన చేతులతో అతన్ని ఆహ్వానించింది. రెండు చేతులు జోడించి నమస్కారించింది. కప్పులో మిగిలి ఉన్న బ్రాందిని చేతి వ్రేళ్ల తో అతని మెడ పై నుంచి భుజాల వరకు రాసింది.
ఓ మిత్రుడు సమయానికి ముందే విచ్చేసాడు. ‘అ’ బ్రాందిలో మునిగిన చేతులతో అతన్ని ఆహ్వానించింది. రెండు చేతులు జోడించి నమస్కారించింది. కప్పులో మిగిలి ఉన్న బ్రాందిని చేతి వ్రేళ్ల తో అతని మెడ పై నుంచి భుజాల వరకు రాసింది.
ఒక్కొక్కరుగా అతిథుల రాక తో గది నిండిపోయింది. ‘అ’ ఫ్రీజ్ లో నుంచి మంచుముక్కలను తీసి సాదా త్రాగే నీళ్ల లో వేసి తిరిగి ఫ్రీజ్ లో పెట్టసాగింది. అప్పుడప్పుడు వంటగదిలో కెళ్లి, చల్లారి పోయిన కవాబులను మళ్ళీ వేడి చేసి తీసుకొని వచ్చేది.
‘స’ నెమ్మదిగా ‘అ’ కు దగ్గరగా వచ్చి ఆమె చెవులో, “ముగ్గురు నలుగు పిలవకపోయినా వచ్చారు. బహుష ఎవరో వాళ్లకు చెప్పి ఉంటారు. నిన్ను చూడడానికి వచ్చి ఉంటారు!” అని అన్నాడు.
కొన్ని క్షణాల వరకు ఆమె నిర్ఘాంత పోయిన, తేరుకొని వంటదిలో కెళ్లింది. కప్పులను కడగడానికి.
సభ వేడేక్క సాగింది. రాత్రి చల్లారుతుంది. వచ్చిన అతిథులందరు దాదాపు వెళ్లిపోయారు. ‘అ’ పడక గదిలోకెళ్లి బట్టలు మార్చుకొంటుండగా, ‘రోడ్ల పై కట్టబడిన మాయజాల ఇల్లు ఎక్కడ కూడా కనిపించలేదు…
ఈ మాయజాలం ఇల్లును ఎన్నో సార్లు చూసింది. దీని నిర్మాణం… కూలి పోవడం! అందుకే ఆమెకు ఆశ్చర్యం కలగలేదు. బాగా అలసిపోయింది. తలగడ పై తల ఆనించి ఆలోచించసాగింది.ఎప్పటి మాట ఇది…బహుష ఇరవై ఐదేండ్లై పోయి ఉంటాయి…కాదు ముప్పై యేండ్లు…మొదటి సారిగా జీవితపు రోడ్డు మీద కలసినప్పుడు. ‘అ’ ఏ రోడ్డు వైపు నుంచి వచ్చింది? ‘స’ ఏ రోడ్డు వైపు నుంచి వచ్చాడు? ఇద్దరు ఈ విషయం గురించి అడగడం మరచి పోయారు. చూపులు నేల పై పెట్టి నేల పై పునాదులు త్రవ్వసాగారు. మరి మాయజాలం ఇల్లు ఒకటి ఇక్కడ వెలిసింది. రోజంతా నిండు మనసుతో ఆ ఇంట్లో ఉండసాగారు.
వాళ్లిద్దరు తమ తమ రోడ్ల వైపుకు వెళ్ళసాగారు.
ఇద్దరి రోడ్లు పిలిచాయి. ఇద్దరు ఆశ్చర్యబోతూ అగిపోయారు. వారిద్దరి రోడ్ల మధ్య ఓ పెద్ద అగాధం కనిపించింది. ‘స’ చాల సేపు వరకు ఆ అగాధాన్ని చూడసాగాడు. ‘అ’ వైపు చూశాడు. ఈ లోతైన అగాధాన్ని నువ్వు ఎలా దాటి రాగలవు అన్నట్లు! ‘అ’ ఏమి మాట్లాడలేదు. కాని ‘స’ చేతుల వైపు చూసింది. ‘నువ్వు నా చేయి పట్టుకొని దాటించేయి. నేను కులపు ఈ లోతైన లోయను దాటేయగలను.’ అన్నట్లుగా చూసింది అతని వైపు.
‘స’ దృష్టి ‘అ’ చేతి వైపుకు వెళ్లింది. ‘అ’ చేతి వ్రేలిలో డైమండ్ ఉంగరం మెరియ సాగింది. ‘స’ చాలా సేపు వరకు ఆ ఉంగరాన్ని చూడసాగాడు. ‘నీ వ్రేలి లో ఈ సంప్రదాయ దారం చుట్టబెట్టి ఉంది. దాన్ని ఏం చేయను!” అని మనసులో అనుకున్నాడు. ‘అ’ తన చేతి వ్రేలి వైపు చూసింది. చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో…నువ్వో సారి ఓకె అని చెప్పేయ్…నేను ఈ సంప్రదాయ దారాన్ని నా గ్రోళ్లతో గీకి తీసేస్తాను. అలా కుదరక పోతే నా పండ్లతో కొరికి పారేస్తాను.’ అన్న అర్ధం తేట తెల్లమవుతుంది.
కాని ‘స’ మౌనంగా ఉండిపోయాడు. ‘అ’ కూడా మౌనంగా నిలబడింది. ఎలాగైతే రోడ్డు ఒకే చోట నిలబడి
ఉంటుందో! కాని అవి నడుస్తుంటాయి కూడా! వాళ్లిద్దరు కూడా ఓ చోట నిలబడి, నడక ప్రారంభించారు…
ఉంటుందో! కాని అవి నడుస్తుంటాయి కూడా! వాళ్లిద్దరు కూడా ఓ చోట నిలబడి, నడక ప్రారంభించారు…
ఓ రోజు ‘స’ పట్టణం నుంచి వస్తూన్న రోడ్డు ‘అ’ పట్టణానికి చేరుకుంది. ‘స’ గొంతు విని ‘అ’ తన ఒక సంవత్సరం అబ్బాయిని తన చేతులతో ఎత్తుకుంది. ఆమె బయట ఉన్న రోడ్డు పై నిలబడింది. ‘స’ ఆమె భుజాలపై నిద్రబోతూన్న అబ్బాయిని ‘అ’ నుంచి తీసుకొని తన భుజాల పై వేసుకున్నాడు. తర్వాత ఆ రోజంతా ఇద్దరు పట్టణం లోని రోడ్డు పై గమనం చేయసాగారు.
అవి వాళ్ల యుక్త వయసులో ఉన్న రోజులు. వాళ్లకు ఎండ, వాన, చలి లాంటివేమి బాధించ లేదు. వీళ్లిద్దరు చాయ్ తాగడానికి ఓ కేఫే లో వెళ్లగా ఈ ముగ్గురిని చూసి వెయిటర్ ఓ మూలాన ఓ టేబుల్ కుర్చీలు వేశాడు. ఆ మూలాన ఓ మాయ జాల ఇల్లు కట్టబడి ఉంది.
ఓ సారి…అనుకోకుండా పరుగెడుతూన్న రైలుబండి లో కలుసుకున్నారు. అందులో ‘స’, అమ్మ మరియు ‘స’ స్నేహితుడు కూడా ఉన్నాడు. ‘అ’ సీటు చాలా దూరంగా ఉంది. ‘స ‘ మిత్రుడు తన సీటు మార్చుకున్నాడు. తన సూట్ కేస్ తీసుకొని ‘స’ సూట్ కేస్ పక్కన పెట్టుకున్నాడు. రైలుబండిలో పగటి పూట చలిగా లేదు కాని రాత్రి పూట చలి మొదలైంది. అమ్మ కప్పుకోవడానికి ఇద్దరికి ఓ వెచ్చని చాదర్ ఇచ్చింది. సగం ‘స’ కోసం, సగం ‘అ’ కోసం. పరుగెడుతూన్న రైలు బండిలో పంచుకున్న చాదర్ చివరన మాయ గోడలు వెలిశాయి.
మాయజాల గోడలు వెలిసేవి. కూలిపొయేవి. చివరికి వారి మధ్య శిథిలాల్లాంటి మౌనం పర్వతంలా అవతారమెత్తేది.
‘స’ కు ఏలాంటి బంధాలు లేవు. ‘అ’ కు ఉండేవి. వాటిని ఆమె త్రెంచుకోగలిగేది. మరెందుకో వాళ్లు జీవితాంతం రోడ్ల పై తిరుగుతూండే వారు…విహారిస్తూండేవారు.
ఇప్పుడైతే జీవితం గడచి పోయింది. ‘ఆ జీవితం లో తపించిన రోజుల గురించి ఆలోచించింది. చలి రోజులను కూడా గుర్తు పెట్టుకుంది. గడచిన రోజుల్లో పామ్ చెట్ల ఆకుల్లా గాలిలో ఎన్నో సార్లు వణకసాగింది.
ఇప్పుడైతే జీవితం గడచి పోయింది. ‘ఆ జీవితం లో తపించిన రోజుల గురించి ఆలోచించింది. చలి రోజులను కూడా గుర్తు పెట్టుకుంది. గడచిన రోజుల్లో పామ్ చెట్ల ఆకుల్లా గాలిలో ఎన్నో సార్లు వణకసాగింది.
చాలా రోజులు ఇట్టే గడచిపోయాయి.
ఓ రోజు ‘ఆ’ సంవత్సరాల మౌనాన్ని ఛేధిస్తూ, “నువ్వు ఏమి చెప్పవ్? ఏమైన చెప్పు!మాట్లాడవెందుకు?” అని అడిగింది.
‘స’ నవ్వాడు.
“ఇక్కడ వెలుతురు చాలా ఉంది. అన్ని చోట్ల వెలుతురు ఉంటుంది. నేనేమి మాట్లాడ లేను!” అని ‘స’ అన్నాడు.
‘స’ ఓ సారి, సూర్యుడిని పట్టుకొని మలిపేద్దామని అనుకున్నాడు…కేవలం రోడ్ల పైనే పగలు తచ్చాడుతుంటాయి. రేయి ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది…కాని ఇంట్లో ఎవరూ లేరు. అందుకే రాత్రి కూడా ఎక్కడా లేదు. వాళ్ల దగ్గర కేవలం రోడ్డు మాత్రమే ఉంది. సూర్యుడు కూడా. అందుకే ‘స ‘ సూర్యుడి వెలుతురు లో మాట్లాడే వాడు కాదు.
ఓ సారి ‘స’ మాట్లాడాడ!. తను మౌనంగా కూర్చొని ఉన్నప్పుడు, ‘ఆ’ అడిగిన ప్రశ్నకు. “ఏమాలోచిస్తున్నావు?”
“ఆలోచిస్తున్నాను…అమ్మాయిలతో ప్లర్ట్ చేయాలని…నిన్ను ఏడిపించాలని!”
కాని ‘ఆ’ దుఖించదు. పైగా సంతోషిస్తుంది. ‘స ‘ జావాబుకు ‘ఆ’ నవ్వుతుండేది.
ఆ తర్వాత ఓ పెద్ద మౌనం…
‘ఆ’ ఎన్నో సార్లు మనసులో అనుకుంది! ‘స’ లోని మౌనాన్ని తన చేతులను చాపి అతని గుండె లో నుంచి తీసి తన గుండెల నొప్పి పై రుద్దుకోవాలనుకుంది! కాని తన చేతులను కేవలం చూస్తూనే ఉండిపోయేది. ఆమె తన చేతులతో ఎప్పుడు ఏమి అనలేదు.
ఓ సారి ‘స’ అన్నాడు, “పద చైనా కెల్దాం”
“చైనా?”
“వెళ్దాం. కాని తిరిగి రావడానికి కాదు!”
“చైనాయే ఎందుకు?”
ఎందుకు అన్న ప్రశ్న బహూశ పామ్ చెట్టు ఆకులా గాలిలో వణకుతున్నట్లుంది…ఈ సమయంలో ‘అ’ తలగడ పై తలానించి పడుకుంది. కాని నిద్ర రావడం లేదు. ‘స’ పక్క గదిలో పడుకొన్నాడు. బహుష నిద్ర మాత్రలేసుకున్నాడేమో!
‘అ’ కు తను మెలకువ ఉన్నందుకు గాని, ‘స’ నిద్రపోతున్నందుకు గాని కోపం రాలేదు. కాని ఆలోచించసాగింది. రోడ్ల పై నడుస్తూ…కలసుకున్నప్పుడు అక్కడ కొంత సేపు వరకు ఓ మాయ కుటీరం వెలసిపోతుందెందుకూ?
‘అ’ కు నవ్వొచ్చింది. మంచి వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. అది సరే కాని ఇప్పుడు అలా ఎందుకు అవుతుంది? ఈ రోజు అలా ఎందుకైంది? ఇదేమిటో అర్ధం కాకుండ ఉంది. ఇలా ఆలోచిస్తూండగా మిగత రాత్రి ఎలా గడచి పోయిందో…డ్రైవర్ చిన్నగా తలుపు తట్టాడు.
‘ఎయిర్పోర్ట్ కెళ్లె సమయం అయింది’ అని తెలిపాడు.
‘అ’ చీర కట్టుకుంది.సూట్ కేస్ తీసుకుంది.
‘స’ కూడా మేల్కొన్నాడు. గదిలోనుంచి బయటికొచ్చాడు.
ఇద్దరు కలసి ద్వారం వైపుకెళ్లారు. అది బయటికి రోడ్డు వైపుకు తెరచుకొంటుంది…డ్రైవర్ ‘అ’ చేతిలో నుంచి సూట్ కేస్ అందుకున్నాడు. ‘అ’ కు తన చేతులు ఖాళీ ఖాళీగా అనిపించాయి. ఆమె గడప వరకు వచ్చి చిక్కుకు పోయినట్లనిపించింది. త్వరగా లోనికెళ్లి డ్రాయింగ్ రూం లో పడుకున్న అమ్మకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది.
ఇంట్లోంచి బయటికెళ్ళింది…మళ్లీ ఎయిర్పోర్ట్ కెళ్లే రోడ్డు మొదలైంది. రోడ్డు ఆగిపోయింది. ‘స ‘ మౌనంగానే ఉన్నాడు. ‘అ’ కూడా…
ఉన్నట్టూండి ‘స’ అన్నాడు, “నువ్వేదో చెప్పదలచుకున్నావు?”
“ఏం లేదు!”
అతను మళ్లీ మౌనం వహించాడు.
‘అ’ కు అనిపించింది…బహుశ ‘స’ కు కూడా ఏదో చెప్పాలని ఉందేమో! వినాలని ఉందేమో! కాని చాలా ఆలస్యమైపోయింది. మాటలన్నీ నేలలో పాతుకుపోయాయి. పామ్ చెట్లుగా మారాయి. మనసు సంద్రం తీరం లో పెరుగుతూన్న చెట్లాకులు బహుశ గాలి వీస్తూన్నంత సేపు వణుకుతూనే ఉంటాయి…
ఎయిర్పోర్ట్ వచ్చేసింది. కాళ్ల క్రింది ‘స’ పట్టణపు తారు రోడ్డు తెగిపోంది.
ప్రస్తుతం ఎదురుగా ఓ కొత్త తారు రోడ్డు ఉంది. అది గాలిలో ‘స’ నుంచి వెళ్లుతూ ‘అ’ పట్టణం లోని ఓ తారు రోడ్డుతో కలువనున్నది.
అంతేకాదు, ఎక్కడి నుంచైతే రెండు తారు రోడ్లు ఒకదాని కొకటి ప్రక్క ప్రక్క నుంచి వెళ్లుతున్నాయో…’స’ నెమ్మదిగా ‘అ’ ను తన బహువుల్లో బంధించాడు.
వాళ్లిద్దరు వణుకుతూ తమ కాళ్ల క్రింది నేలను చూడ సాగారు. వారికి అప్పటివరకు నిర్మించబడని తమ ఇంటిధ్యాస వచ్చింది.
***
***
Add comment