“The fire shall ever be burning upon the altar; it shall never go out” (Leviticus 6:13, KJV),
అమర దీపాలను వెలిగించడం అనే సంప్రదాయం ప్రాచీన కాలం నుండి ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో, మతాల్లో ఉంది.
అకేమెనిడ్ సామ్రాజ్యంలోని మూడు ‘గొప్ప అమర దీపాల్లో’ ఒక దానిని, అలెగ్జాండర్ ది గ్రేట్ పాలనలో, క్రీపూ 324లో అతని సన్నిహిత స్నేహితుడైన హెఫేస్టియన్ మరణాన్ని గౌరవించటానికి ఆర్పివేశారని చరిత్ర చెబుతోంది.
క్రీస్తు పూర్వం 87 లో, మిత్రిడేటిక్ యుద్ధ కాలంలో సైన్యాధ్యక్షుడు లూయిస్ కార్నెలియస్ సుల్లా గ్రీస్ లోని డెల్ఫీని ఆక్రమించి నాశనం చేసే వరకూ అపోలో దేవాలయ గర్భంలో అమర దీపం వెలుగుతూనే ఉండేది.
అమర దీపాలు శాశ్వతంగా వెలుగుతాయి. వాటిలో కొన్ని సహజమైనవి. భూగర్భాన్ని చీల్చుకుని వాతావరణంలోకి చొచ్చుకునివచ్చే సహజ వాయువుల్ని పిడుగులు తాకినప్పుడు ఏర్పడతాయి. అవి అలా శతాబ్దాల తరబడి వెలుగుతూనే ఉంటాయి.
మరికొన్ని అమర దీపాలు కృత్రిమమైనవి. పురాతన కాలంలో, మానవ సృష్టితమైన అమర దీపాలు కలప లేదా ఆలివ్ నూనె ద్వారా వెలిగించబడేవి. ఆధునిక అమర దీపాలను వెలిగించడానికి సాధారణంగా ప్రొపేన్ లేదా సహజ వాయువు యొక్క పైపుల సరఫరాను ఉపయోగిస్తున్నారు.
అమర దీపాలు తరచుగా ఒక గొప్ప వ్యక్తిని లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనను జ్ఞాపకం చేస్తాయి, లేదా అంతర్జాతీయ శాంతి వంటి ఉమ్మడి లక్ష్యానికి సమాజపు నిబద్ధతను గుర్తుచేస్తాయి.
బుద్ధని జన్మస్థలం అయిన లుంబినిలో అంతర్జాతీయ శాంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని 1986 నవంబర్ 1న అప్పటి రాజయిన జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షాన్ దేవ్ ఈ అమర దీపాన్ని వెలిగించారు. ప్రపంచ సమాజాల నడుమ శాంతి, సామరస్యాలను ప్రేరేపించడానికి ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్, అమెరికా) నుండి ఈ జ్యోతిని తీసుకువచ్చారు.
ప్రపంచంలో శాంతి సామరస్యాల సాధనకు ప్రతీక అయిన గౌతమ బుద్ధుని జీవితానికి కీలకమైన ప్రదేశమైన లుంబినిలో ఈ అమర దీపాన్ని శాశ్వతంగా ఉంచడం ఎంతో అర్థవంతమైన విషయం.
*
ఇప్పటికి జలియన్విలాబాగ్లో అమరస్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకిర్దం వెలుగుతోనే ఉందీ. మనంపుణ్యక్షేత్రం జ్వాలాముఖిలో కొన్ని జ్వాలలు వెలుగుతూనే ఈంటాయి
అమరర స్వాతంత్ర సమరయోధులకు చిహ్నంగా జలియన్వాలాబిగ్లో ఓ దీపంఎప్పుడు వెలుగుతూనే ఉంటుంంది