అమరావతి కథ ఒక్కో కథా ఒక్కో సజీవ శిల్పం. ఎప్పుడో మనమెక్కడో చూసి మరిచిపోయిన అపరిచితల్లాంటి కథలు. ఇక్కడే మన పక్కనే నిలబడి మనల్నే గమనిస్తున్న చిరపరిచితుల్లాంటి కథలు.
ఏ కథ ఎవరిదైనా, ఏం చెబుతున్నా, ఏదీ శ్రద్ధగా గమనించకుండా చదివేసినా సరే, ఒక్క అనుభవం మాత్రం ఈ కథలు చదివినవారంతా అనుభవించి తీరాల్సిందే. ప్రతీ కథలోనూ, ఎక్కడో, ఏదో సందర్భంలో, మన కన్ను ఆనందాన్నో, దుఃఖాన్నో చెమర్చి తీరుతుంది. లేదూ, ఏడవటం నాకలవాటు లేదంటే, గుండె బరువైనా ఎక్కిపోతుంది.
అమరావతి కథల గురించి ఎవరెన్నైనా చెప్పనీ, నే చెప్పేది మాత్రం ఒక్కటే. ఈ కథలు చదివితే, అలలు అలలుగా మనసు చెదిరిపోవాల్సిందే. ఎంత బండరాయివంటి హృదయపు స్వంతదారైనా, తానూ మనిషినేనన్న విషయాన్నోసారి గుర్తు చేసుకోవాల్సిందే.
అందుకే శంకరమంచి సత్యం గారు 1975-77ల మధ్య కాలంలో రాసిన ఈ కథల్ని, ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించినా, శ్యామ్ బెనగల్ వీటిని ధారావాహికగా చిత్రీకరించినా, అవి వరుసగా దూరదర్శన్ లో ప్రసారమైనా (1994-95), రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డును అందించినా (1979) పెద్ద విచిత్రమేమీ కాదు.
బాగుందండి !
ధన్యవాదాలు సత్య గారూ
చాలా చక్కగా cheppe randi Thanku
ధన్యవాదాలండీ
…కథ చాలా బావుంది… అభినందనలు…
ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు, ఆడియో (రేడియో నాటకంలా) నవ్వుకుంటూ విన్నాము 🙂
మీకు నచ్చినందుకు చాలా హ్యాపీ, ధన్యవాదాలండీ
Fantastic. Thank you so much.
Thank You Very Much Sir