ఆ బూడిద రంగు భవనం
ఈ గులాబీ రంగు మేడ
అలాగే నిలబడి ఉంటాయి
ఈ గులాబీ రంగు మేడ
అలాగే నిలబడి ఉంటాయి
ఆ కొబ్బరి చెట్టు తలూపుతూనే ఉంటుంది
ఈ పున్నాగ పూలు
ఈ పున్నాగ పూలు
పరిమళం వెదజల్లుతూనే ఉంటాయి
నిదురో మెలుకువో తెలియని స్థితిలో
పాదరసంలా పరుగులు పెడుతూనే ఉంటుంది
పాదరసంలా పరుగులు పెడుతూనే ఉంటుంది
లోకంఏదీ ఎవరి కోసం ఆగదని
ఉండటానికి లేకపోవటానికి తేడా లేదని
ఈ ఉనికికి అర్థం లేదని
తెలుసుకోకుండానే ప్రయాణం ముగిసిపోతుంది.
ఉండటానికి లేకపోవటానికి తేడా లేదని
ఈ ఉనికికి అర్థం లేదని
తెలుసుకోకుండానే ప్రయాణం ముగిసిపోతుంది.
బొడ్డుతాడు తెంచుకున్న బంధం
సుదూర తీరం నుండి రెక్కలు కట్టుకొని వాలుతుంది
రెండు కన్నీటి బొట్లు రాల్చి ఋణం తీర్చుకుంటుంది
కన్నపేగు కంటతడి పెడుతుంది
పది జతల కాళ్లు వీడ్కోలు పలుకుతాయి
సుదూర తీరం నుండి రెక్కలు కట్టుకొని వాలుతుంది
రెండు కన్నీటి బొట్లు రాల్చి ఋణం తీర్చుకుంటుంది
కన్నపేగు కంటతడి పెడుతుంది
పది జతల కాళ్లు వీడ్కోలు పలుకుతాయి
ఎవరి చుట్టూ నీ లోకం నిర్మించుకున్నావో
వారి లోకంలో అనివార్యంగా ఓ పదిహేను రోజులు
ఓ నలుగురు స్నేహితుల జ్ఞాపకాల్లో నాలుగు రోజులు.అప్పటివరకూ నీ మేలుకొలుపుతోనే నిద్ర లేచే వంటగది
మరొకరి గాజుల చప్పుడుకు అలవాటు పడుతుందిఅసలెప్పుడూ నువ్వు లేనట్లుగానే
అంతా చాలా మామూలుగా…
వారి లోకంలో అనివార్యంగా ఓ పదిహేను రోజులు
ఓ నలుగురు స్నేహితుల జ్ఞాపకాల్లో నాలుగు రోజులు.అప్పటివరకూ నీ మేలుకొలుపుతోనే నిద్ర లేచే వంటగది
మరొకరి గాజుల చప్పుడుకు అలవాటు పడుతుందిఅసలెప్పుడూ నువ్వు లేనట్లుగానే
అంతా చాలా మామూలుగా…
నుసిగా మారి ఏ నదీ జలాల్లోనో ప్రయాణిస్తూ
నేను కూయకపోతే లోకానికి తెల్లవారదనుకున్న
కోడి అమాయకత్వానికి నవ్వుకుంటావు
2
ఎటు చూసినా అవే…
పిల్లా! ‘దూరాంతరం’ పోదామా?
కన్ను గీటుతాడు విభూతి భూషణ్
‘మైదానం’ మాటేమిటి?
గదమాయిస్తాడు చలం తాతకలలోనూ కాఫ్కా వదిలిపెట్టడు.
కన్ను గీటుతాడు విభూతి భూషణ్
‘మైదానం’ మాటేమిటి?
గదమాయిస్తాడు చలం తాతకలలోనూ కాఫ్కా వదిలిపెట్టడు.
దోస్తాయేవ్ స్కీ దోస్తీకి పిలుస్తాడు
‘ఫౌంటెన్ హెడ్’ ను పట్టించుకోలేదని
అయాన్ రాండ్ అలుగుతుంది‘వేయి పడగల’ కు
విలువ కట్టమంటాడు విశ్వనాథ
‘మట్టి మనిషి’ ని హత్తుకుంటావనుకుంటే
‘మరీచిక’ ను ముందుంచుతావా?
రోషంగా చూస్తుంది వాసిరెడ్డి‘అమృతం కురిసిన రాత్రి’ ని చూడవా?
అమాయకంగా అడుగుతాడు తిలక్
‘ఫౌంటెన్ హెడ్’ ను పట్టించుకోలేదని
అయాన్ రాండ్ అలుగుతుంది‘వేయి పడగల’ కు
విలువ కట్టమంటాడు విశ్వనాథ
‘మట్టి మనిషి’ ని హత్తుకుంటావనుకుంటే
‘మరీచిక’ ను ముందుంచుతావా?
రోషంగా చూస్తుంది వాసిరెడ్డి‘అమృతం కురిసిన రాత్రి’ ని చూడవా?
అమాయకంగా అడుగుతాడు తిలక్
నిలువెత్తు ‘మహాప్రస్థానం’
నన్ను దాటుకొని ఎలా పోతావంటుందిఎప్పుడూ కవితలు, నవలలేనా?
‘నన్ను గురించి కథ వ్రాయవూ’
మందలిస్తాడు బుచ్చిబాబు
‘గాలివాన’ లో నైనా
‘పడవ ప్రయాణం’ చేయాల్సిందే
పద పద అంటాడు పాలగుమ్మి
‘మూగజీవుల’ ను
మరిచిపోవద్దంటాడు మా గోఖలేఎవరినీ కాదనలేను
దేనినీ వద్దనుకోనుఅనంత నదీ ప్రవాహంలో
మునకలు వేస్తూనే ఉండాలి
తీరం సంగతి మరిచిపోవాలి
హంస ఎగిరి పోయేవరకు
నన్ను దాటుకొని ఎలా పోతావంటుందిఎప్పుడూ కవితలు, నవలలేనా?
‘నన్ను గురించి కథ వ్రాయవూ’
మందలిస్తాడు బుచ్చిబాబు
‘గాలివాన’ లో నైనా
‘పడవ ప్రయాణం’ చేయాల్సిందే
పద పద అంటాడు పాలగుమ్మి
‘మూగజీవుల’ ను
మరిచిపోవద్దంటాడు మా గోఖలేఎవరినీ కాదనలేను
దేనినీ వద్దనుకోనుఅనంత నదీ ప్రవాహంలో
మునకలు వేస్తూనే ఉండాలి
తీరం సంగతి మరిచిపోవాలి
హంస ఎగిరి పోయేవరకు
——-
స్వస్థలం ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) యద్దనపూడి. ప్రస్తుతం ప్రభుత్వ మహిళా కళాశాల, చీరాలలో తెలుగు శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 40 కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని వివిధ సాహిత్య అంశాల మీద పత్రసమర్పణ చేశారు. ‘ఆంధ్రమహాభారతం-మహర్షులు’ వీరి సిద్ధాంత గ్రంథం. వీరి కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
లోకం ఎవరికోసం ఆగదు .. అలతి పదాల అల్లిక బావుందమ్మా ..
హృదయపూర్వక ధన్యవాదాలు.
Annee alaage Dr Nannapaneni Vijaya Lakshmi gaari kavita chalaabagundi. Valsapoina Santhanaanni chivari chupulokudaa chusukoleni kannatallula kannitipora kanipistundee kavitalo.Tanuvu nasinchinaa talli hrudayapu alalaprakampanalu kanipistunnaieekavitalo 👌
హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజంగా పున్నాగపూల పరిమళం లా ఉంది మీ కవితలోని భాష, మధురంగా మనసుపొరల్లోకి వెళ్లి మస్తిష్కమ్ లో నిలిచిపోయేలా…..
హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎవరి చుట్టూ నీ లోకం నిర్మించుకున్నావో
వారి లోకంలో…
గొప్ప గమనింపు
బాగుంది మేడం
హృదయపూర్వక ధన్యవాదాలు సర్.