ఎప్పుడూ
ఒక చోట నిలువని నీ ఆలోచనలు
మదిలో తడుముతుంటాయి
బాణీ కట్టని పాటలా..
నదీ తీరాన
నీ నడకల పాదముద్రలు
మాత్రమే మిగిలి వుంటాయి
అక్కడ
అలలు తడిమిన తడిలో
మరచిన కలలు, మౌనంగా కన్నీళ్ళవుతాయి.
రాయలేని పదాలు,
చెప్పలేని కథలు,
మనసు నీడలో దాగిన ఖాళీలు ఎన్నో.. నీలో
కానీ, ఆ క్షణంలో
అక్కడ నీ స్వరం నీకు ప్రతిధ్వనిస్తుంది
గాయపడిన పుష్ప సౌరభంలా..
చంద్రుని చూసి కవిత్వం రాయి ,
తారలతో మాట్లాడి రాత్రిని ఆలింగనం చేసుకో…
రాత్రి కళ్ళలో దాగిన చీకటిలో
నక్షత్రాల క్రింద నిదురపో..
నీకు చలి కాసే ఓ ఉదయం
కొత్త కలలు పూస్తాయి
నీలో పుట్టిన పచ్చదనంలో
నీవు నీవుగా విరబూస్తావు..
అది చాలు కాలాన్ని మళ్లీ రాయడానికి.
*
నీలో పుట్టిన పచ్చదనం లో నీవు నీవుగా విరబూస్తావు