లి యు చైనా సంగ్ సామ్రాజ్య హయాంలో ( 960 – 1279 ) లో ప్రముఖ కవిగా గుర్తింపు పొందాడు.లి యు జన్మించిన సమయం ( 1125 )లో ఉత్తర చైనా దురాక్రమణదారుల దాడుల్లో అతలాకుతలం అవుతూ వుంది. 980 లో తంగ్ వాన్ ని వివాహమాడాడు.వీరి ప్రేమ గాథ ఆ రోజుల్లో చైనా అంతటా ప్రాచుర్యం పొందింది. లి యు సంగ్ సామ్రాజ్యంలో ప్రభుత్వాధికారిగా అనేక పదవులు నిర్వహించాడు. జీవిత చరమాంకం వరకు గొప్ప దేశభక్తునిగా, యుద్ధవీరునిగా పేరు పొందాడు. తన జీవిత కాలంలో 11,000 కవితలు రాసాడని ప్రతీతి.
అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్
దక్షిణ ద్వారం దగ్గర పూలమ్మే
ముసలాడు మీకు తెలుసా..?
అతను పూల మీద తుమ్మెదల్లే
బతుకుతాడు.
పొద్దున అతను ‘మేలో ‘పూలు అమ్ముతాడు..
సాయంత్రం ‘పాపీ ‘పూలు అమ్ముతాడు.
అతని గుడిసె కప్పులోంచి నీలాకాశం
కనిపిస్తుంది.
అతని బియ్యం డబ్బా ఎప్పుడూ
ఖాళీగానే వుంటుంది.
పూలమ్మి డబ్బులు దండిగా సంపాదిస్తే
అతను మద్యంచావిడి ముఖం పడతాడు.
డబ్బులయిపోతే..
ఇంకొన్ని పూలు పోగేస్తాడు.
వసంత కాలమంతా
పూలు ఎంతగా పూస్తాయో..
అతనూ అంతగా విరగబూస్తాడు.
అతను ప్రతిరోజూ రోజంతా
తాగే వుంటాడు.
రాజభవనంలో చక్రవర్తి
ఏ కొత్త చట్టం చేసినా
అతనికేం పట్టింది..?
రాజ్యం ఏ ఇసకలో నిర్మితమయితే మాత్రం
అతనికేం పట్టింది…?
మాట కలుపుదామని ప్రయత్నిస్తే
అతను బదులివ్వడు.
తన చింపిరి జుత్తులో నుంచి
తాగుబోతు నవ్వొకటి నవ్వుతాడు.
—-
చింపిరి జుత్తు లోంచి తాగుబోతు నవ్వొకటి
ఇప్పుడు పేరుకే అది జన చైనా అయినా ఆ కాలాల్లోని కవులు ఇటువంటి కవిత్వంతో నిజంగానే దాన్ని అప్పట్లో జన చైనాగా నిలిపారు. అనువాదం ఆకట్టుకొంది శ్రీనివాస్ గౌడ్ గారు.
తన చింపిరి జుత్తులో నుంచి
తాగుబోతు నవ్వొక్కటి విసురుతాడు
కవిత చాలా బాగుందండి అభినందనలు