అగులుబుగులు

1.ముసురు మేఘాలు
ఎడతెరిపిలేని వాన
గోడలకంతా నాచు పట్టింది
మనసంతా అగులుబుగులు !

2.పాముల సంచారం ఎక్కువైంది
ఆత్మ రక్షణలో కప్పలన్నీ
తలకిందులుగా పడుకుని చావు నటిస్తున్నాయ్ !
కాపలా కుక్కలన్నీ ఆకలిబాధ తట్టుకోలేక
బిగదీసుకు పడుకుని మొరగడం
మర్చిపోయాయ్                   

3. సందట్లో సడేమియా అని
‘డా విన్సీ’ లా ‘విట్రూవియన్ మాన్’ లాంటి
బొమ్మలేవో గీసి గోడలకంటిస్తున్నారు
ఉత్తరానున్న హిమాలయాల్లోంచి
భంగు మత్తు మెత్తగా ఒంపుతున్నారు
పట్టుబట్టల వెనుక వీపుల్లో
తామర లాంటిదేదో అల్లుకుంటున్నట్లుంది !

4.ఏమో! రహస్యాలు ఛేదించే క్రిప్టోగ్రాఫర్ లా
సూర్యుడు , వెలుతురు కత్తితో
ఈ ముసురుమేఘాల్ని చీరేసి
తొంగి చూస్తాడేమో!

5.ఏమో! భూమి పొరల్లో తపస్సు చేస్తున్న
విత్తులన్నీ చీల్చుకుని పైకొచ్చి పిలకలేస్తాయేమో!!

6.బండికింద నడిచే కుక్క
బండిని నేనే నడిపిస్తున్నాననుకుంటుంది…
అదో పిచ్చిది!

7.కాలంబండి ఆగుతుందా ?
సూర్య చంద్రుళ్లు పఠేల్మని పేలి పోతారా?
గుబుళ్లన్నీ గువ్వల్లా ఎగిరిపోతాయ్ !
ఎగిరిపోతాయ్ !

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

బసవరాజు వేణుగోపాల్

26 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అగులుబుగులు బుగులన్ని గువ్వల ఎగిరి పోతాయి..👌👍.అలాజరిగితే, ఎంత బాగుణ్ణు. సర్,కవిత బాగుంది..అభివందనలు.

    • అగులుబుగులు బుగులన్ని గువ్వల ఎగిరి పోతాయి..👌👍.అలాజరిగితే, ఎంత బాగుణ్ణు. సర్,కవిత బాగుంది..అభివందనలు.

  • Wonderful poem Sir, ముంచెత్తుతున్న వాన ముసురు నేపథ్యంగా జనించిన తాత్విక కవనం..Well crafted👌👌👌

  • దేశ వర్తమాన రాజకీయ సామాజిక అగులుబుగులు పరిస్థితులకు అద్దం పడుతూనే, ఆశావహ దృక్పథంతో ముక్తాయింపు నవ్వడం బాగుంది. మంచి కవనం బసవరాజు వేణుగోపాల్ గారు..

    • దేశ కాలమాన రాజకీయ సామాజిక అగులుబుగులు పరిస్థితులకు అద్దం పడుతూనే, ఆశావహ దృక్పథంతో ముక్తాయింపు నివ్వడం బాగుంది. మంచి కవనం బసవరాజు వేణుగోపాల్ గారు..

    • సాలమోను ఇజియ కొమారు Thank you so much Vijay..You always catch the crux and hits at the bull’s eye.. Great 👍👍👌👌👌💐💐💐💐💐

  • చాలా బాగుంది సార్ మీ తాత్వికత..అభినందనలు

  • ముసురు బయటే కాదు లోన కూడా ఉండటాన్ని బాగా పట్టుకున్నారు.

    వెలుతురు రేఖల కోసం ఎదురుచూద్దాం మండి.

    • తప్పకుండా సర్…సూర్యుడు వెలుతురు కత్తితో ఈ ముసురు చీకట్లను చీరేస్తాడని ఆశిద్దాం సర్…Thank you so much Sir💐💐💐💐

  • చాలా బాగుంది సర్
    మనసుపెట్టి చదవాల్సిన కవిత.
    ప్రతీ అక్షరం ప్రస్తుత స్థితికి అద్దం లాంటిది
    Kudos to your political and social knowledge 👏👏👏

  • పగులు అనే దేశిపదం అగులు అనిచెప్పడంలోనే
    మీ నేర్పరితనం తెలిసిపోయింది.
    మార్మికతతో వస్తువును బలంగా చెప్పారు .
    దన్యవాదాలు వేణుగోపాల్ గారు.

    • Thank you so much Venkatesh……తెలంగాణా మాండలికం లో “భయం భయం’ ఉంది అనేదాన్ని అగులుబుగులు గా ఉంది అంటారు.. .కవిత వస్తువు ను పురస్కరించుకుని ఆ పదం వాడాను….👍👍👍👌👌💐💐💐💐

  • ప్రస్తుత పరిస్థితి పై దృశ్యాన్ని చేస్తూ రాసిన అక్షర కవనం.. అన్న ఒక్కొకవిత ఒక్కో కొత్త అభివ్యక్తి తో పండి పోతోంది.. అద్భుతంగా రాశారు.. కుడోస్ కవి

    • Cv Suresh మీ ఆత్మీయ స్పందన కు ధన్యుణ్ణి సర్🙏🏻🙏🏻కానీ ఆ చివరి రెండు అక్షరాలు తీసేస్తే అత్యంత ధన్యుణ్ణి అవుతాను సర్🙏🏻🙏🏻

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు