సెవిటి మావఁ మాట సలవ

మావఁ జెప్పింది ఇన్నాక ఎలవరపొయ్యి తలెత్తి ఆయిన మొకంలోకి సూసినాను. పసిబిడ్డ నవ్వు నవ్వినాడు మావఁ. నా ఈపున సెయ్యేసి మాలివిఁగా నివఁరతా, నామాటిని పో నాయినా, ప్యాప్తం ల్యేనోట్ని తలుసుకుంటా ఎంతకాలం యల్లీదినా యాం లాబం సెప్పో ? ఇంకపైన నీ బతుక్యాందో నువ్వు ఆలోసిచ్చుకోకుండా దేశమ్మ కాకి మాదిర్న ఊళ్లు తిరగతుంటే వొరిగేద్యాంద్యే ? అన్నాడు.

నేను గెనిం మింద కూలబడి రొండు శాతల్తో తలకాయి పట్టుకున్నాను. నా పక్కన్నే ‘ఈస్పరా’ అంటా కూకోని నా బుజాన సెయ్యేసి పేరివిఁ నిండిన కళ్లతో నన్నే సూస్తా, కస్టవోఁ నస్టవోఁ రానోడెవుడు నాయినా ? వొచ్చేటియొస్తుంటాయి, పొయ్యేటియి పోతుంటాయి. అన్నిట్నీ తాళుకుంటా ఎప్పుడెట్టా బతకాలో ఎరిగినోడే మణిసి. ఇంకట్నుంచైనా ఈ ముసిలోడి మాట ఇన్నావంటే బతుకు గాట్లో పడతాది అన్నాడు.

సీకటిబడి శానాసేపయ్యింది. కల్లాంలో పైరుకోసి కుప్పలేసుండారు. సల్లటిగాలి తోలతుండాది. సేనుకొకరు లెక్కన కుప్పలకాడ నులకమంచాల మింద జేరి అరిసరిసి మాట్లాడుకుంటుండారు ముసిలోళ్లు. మాకు ఎదాళంగా మావఁ సేలో కుప్పకి అమ్మిడిగా నిలబడుండాది ఒకమ్మి. మొబ్బు దాటి బైటబడిన సందమావఁ ఎలుతుర్లో, పొడుగు రైకా పావడా గట్టుకోని తీరుగా గీసిన బొమ్మ మాదిర్న నిలబడి సేతులు రొండూ కిందకి కలేసి పట్టుకోని కళ గలిగిన కళ్లతో మాతొట్టే సూస్తుండాది ఆయమ్మి. ఇంతట్లో సందమావఁని మొబ్బు గమ్మింది.

కడుపు కూటికి పొణుకునే ఆడోళ్లు నాయినా, నీ మనాది సూడ్ల్యాక నేనే వోళ్ళకాడికి పొయ్యి నీకు వొనారైన పిల్లని గెవణిచ్చి మందల మాట్లాడినా. ఆయమ్మితో పో నాయినా, ఈ రేత్రే గాదు కుప్ప నూర్సి వొడ్లు ఇంటికి తోలిన్దాకా పెతి రేత్రీ వొస్తాది. దిగుళ్లన్నీ ఇంతట్తో వొదిలేసి పేణం సల్లబరుసుకో అని నాతొట్టు జూసినాడు మావఁ.

నేను తలకాయి వొంచుకోని కూకోనుండాను..

అవతల కుప్పల కాడ రేడియాలో పాటొస్తుంటే ఎవురో సవుండు పెంచినారు.

దోరానికి తారా మణిహారం..

ఆరతి ఎన్నిల కరుపూరం..

మోసం దేషం లేని సీవఁలో…

మొగసాల నిలిసి నీ మందారం…

*

ఒకనాటి పొద్దన్నే మాయమ్మ నాతో లెయ్యిరా లేసి లడీ అవ్వు నాకు పేణం బాగల్యేదు కలిపేటిదకా పొయ్యొద్దాం అన్నాది. నేను కదల్నుగానీ ఈమద్దిన మాయమ్మ ఊరికూరికే గుండెల్లో నెప్పి అంటుండాది. ఇప్పుడు గూడా పేణం బాగల్యేదు అనేతలికి యాందో యావోఁ అని బయిఁవేసి గమ్మున సొక్కాయేస్కోని రడీ అయ్నాను. నా సిన్న మేనత్త ఉమాని ఇచ్చింది కలిపేడులో ఉండేటి కిస్టమావఁకి. మాయత్త ఆయినకి రొండో పెళ్లాం. మావఁకి సెవుడు, అందుకే మేం అల్లుళ్లం ఆయిన్ని సెవిటిమావఁ అని పిలస్తుంటాం. ఆయిన మొదుటి పెళ్లాం పావుఁ కరిసి సచ్చిపొయ్యింది. మజ్జానానికి కలిపేడు జేరుకున్నాం. ముందర మాయమ్మ, ఎనికాల నేను వాళ్ల వాకిట్లోకి పొయ్యే యాళకి వొసాట్లో నులకమంచం మింద పొణుకోనుండాడు సెవిటిమావఁ. ఆయిన మంచం పక్కన్నే న్యాలమింద ప్లాస్టీకు గోతాలు పరుసుకోని తిరగట్లో రాగులు ఇసర్తా ఉండాది ఉమత్త. మమ్మల్ని సూడంగానే నవ్వతా లేసి రాండొదినా అంటా లగిస్తావొచ్చి ఈది తడికి దీసింది. మావఁ కూడా మంచం మింద లేసి కూకోని రాండమ్మా రాండి అన్నాడు.

మాయమ్మ వసాటి గుంజకి అనుకోని న్యాలమింద కూలబడి అందుకే ఆడికి వొచ్చినట్టు సెణం గూడా తడువు ల్యాకుండా ఓ అంటా ఏడుపుకెత్తుకునింది. ఈనా కొడుకు నాకు అలివి గాడం లేదమ్మే ఉమా. పొగులు పొద్దస్తం ఈడిదే ఏడ్యాటం ఐపోతుండాది నాకో. ఎవుతినో పేఁవిచ్చినానని జెప్పి దాన్ని ల్యాపకపొయ్నాడు. నానా రచ్చలూ అయ్నాయి. ఈళ్లని ఎతికి పట్టకొచ్చి ఆయమ్మిని ఎవుడికో కట్టబెట్టి కాపరానికి గూడా పంపిచ్చేసినారు. ఆ పిచ్చిలోనే బడి ఈనా బట్ట ఇంట్లో నుంచి సెప్పాపెట్టకుండా ఎల్లిపొయ్నాడు. రొండునెల్లు సచ్ఛినాడో బతికినాడో అడ్రాసు ల్యేడు. కూడూ నీళ్లూ ల్యాకుండా నా బట్ట కోసరం యాడవని రోజుండాద్యా, ఎతకని ఊరుండాద్యా ? ఎవురి సేతల్లోనో కుంగా సావ దెంగిచ్చుకోని ఊపిరి తాపిరి ల్యాకుండా ఆస్పత్తిర్లో బడ్డాడు. ఈడి జివానికి కయ్యి అడుమోనం బెట్టి డబ్బుబోసి బతికిచ్చుకుంటిని. ఇప్పుటికైనా బుద్దిగా పడుంటాడు గదా అని నిన్న సెర్సీవోళ్లని పిలిసి ఇంట్లో పేర్దన బెట్టిస్తే నా కన్ను గప్పి పేర్దన్లో కూకోకుండా ఎల్లిపొయ్యి సంద్యాళకి యాలాడతా వొచ్చినాడు. యాడికి బొయ్నావురా అనడిగితే సిలవంతుకూరు రైలుగేటు కాడికి పొయ్యొస్తుండానన్నాడు. ఆ మాట ఇనంగానే నా పై ప్యాణాలు పైనే పొయ్నాయమ్మ్యా ! ఆడ్నే గదా ఈనా బట్టని తెగ్గొయ్యిబొయ్యింద్యా. సిగ్గుండేటి నా బట్టయితే ఇంకోతూరి ఆ దిక్కుకి పోతాడా ? ఇంక నావల్ల గాదమ్మ్యా, వొకేవొక్క బిడ్డగదా అని ముదిగారంగా బెంచుకొంటే నా సెప్పుతో నా మాడనే గొడతుండాడు. మాయన్న కూతుర్ని ఈనా కొడుక్కి ముడెయ్యాలని నేను కొట్టకలాడ్డం యాంద్యే, ఈనా కొడుకు ఆడేటి లయికతల్యాంద్యే ? ఇదంతా మాయన్నకి దెలిస్తే బిడ్డనిస్తాడా ? ఈడి గుద్దలో నోట్లో క్యాకరిచ్చి ఉయ్యిడా ? అని గుక్క దిప్పుకోకుండా రాగాలు దీసింది. బొమ్మలాలా నోళ్లు దెరుసుకోని ఇంటుండారు ఉమత్త, సెవిటిమావఁ. మాయమ్మ ఏడుపుని సుట్టుపక్కల ఆడోళ్లు దడులకాడికొచ్చి ఆలకిస్తుండారు.

మాయమ్మ పైటసెంగుకి బర్రన ముక్కు సీదుకోని సెవిటిమావఁ తొట్టు దిరిగి, ఓ ఎనా నాకీమజ్జిన వొకటే గుండెల్లో నెప్పొస్తుండాదినా. రేతిర్లు నిదరబడితే ఒట్టో. నేను సచ్చిన్దాకా నా బట్ట కళ్లు సల్లబడేటట్టుల్యేవునా. నాకేదొకటయ్యి నేను సస్తే గదా అప్పుడు నిజింగానే ఈదలపాలూ దోవలపాలూ అయ్యి ఊరోళ్ల పూకు ఉప్పేస్కోని నాకి పోయ్యేద్యా నా కొడుకా అన్నాది.

నిల్సుకోనుండేటి నన్ను, గుంజకి జారబడి యేడ్సేటి మాయమ్మని మార్సిమార్సి సూసి పసిబిడ్డ నవ్వు నవ్వినాడు సెవిటిమావఁ. మైకుసెట్టు మాదిర్న మాయమ్మ ఎన్నవలు దీసి యాడస్తా మాట్లాడిన మాట్లన్నీ ఆయినికి గెట్టెంగానే ఇనిపిచ్చినట్టుండాయి. నన్ను జూస్తా, యాం నాయినా ఇజియా నిలబడే ఉండావా ? రా ఇట్టొచ్చి కూకో అన్నాడు. మాయమ్మ తొట్టు జూసి యాడవబాక బుజ్జమ్మా. అబ్బిని నాలుగునాళ్లు ఈడ్నే ఉండిచ్చిపో. నిదణంగా నేను మాట్లాడ్తాలే బయిపడబాక, ఏయారప్పుడు బయిల్దేర్నారో కూడు తినండి ముందో అన్నాడు. ఈస్పరా అంటా మంచం మింద నుంచి లేసి మా ఉమత్త తొట్టు జూసి మేయ్ కానిచ్చి ఎసురుబెట్టో, మన ఎర్రకోడి ఏ దిబ్బలో ఉండాదో సూసి పట్టకొస్తా అని బైటికెల్లిపొయ్నాడు.

నన్నాడ వొదిలేసి మాయమ్మ ఆ సంద్యాళ ఊరికెల్లిపొయ్యింది.

*

ఎట్ట గడిసినాయో సెవిటిమావఁ ఇంట్లో వారవోఁ, పదినాళ్లో తెలవకుండానే గడిసిపొయ్నాయి. నాకు దినమ్మూ రొండు పూట్లా కూట్లోకి ఏదొక నీసు కూరాకే సెయ్యిచ్చేది మావఁ. అది మారిస్తే ఇది, ఇది మారిస్తే అది సియ్యా శాపా తినల్యాక ఎగుటు బుట్టేసింది. రేతిర్లు కల్లాంలో కుప్పకాడనే మావఁకి నాకూ పడకలు. సందమావఁ దినానికంత పెరిగి పెద్దయ్యేటి ఎన్నిల కారు రేతుర్లయ్యి. అవతల కుప్పల్లో నుంచి పెతి రేత్రీ రేడియాలో పాటలు మోగేటియి. ఆ పాటల్లో ఏదొక పాట గుండికి తాకేటిది.

నీదు మనుసు నీలో లేదు, నాలోన లీనవఁయే..

నేటి నుంచి మేనులు రొండూ నెరజాణా వొకటయ్యే…

ఓ… ఓ.. నిండు సందమావాఁ.. నిగనిగలా భావాఁ…

వొంటరిగా సాగలేవు కలిసిమెలిసి పోదావాఁ.. ఓ…

 

సిలకమ్మ పలికింది.. సిరుగాలి కులికింది..

సిరునవ్వు సిలికించవే.. నీ ల్యేత సింగారఁవొలికించవే..

నీ ల్యేత సింగారఁవొలికించవే..

 

శారదా.. నను సేరగా..

ఏవిఁటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే ల్యేత బుగ్గా..

ఓ.. శ్రావణా నీరదా శారదా…

 

పందిట్లో పెళ్లౌతున్నదీ.. కను ఇందౌతున్నదీ..

నటనవేఁ ఆడెదనో.. ఓఓఓఓ నటనవేఁ…

పెతిరేత్రి ఇట్టా రేడియాలో ఎన్ని పాటలు ఇన్నా ‘మొగసాల నిలిసి నీ మందారం’ పాట మటుకు ఒక్క రేత్రి కూడా తప్పిపోల్యేదు. కుప్ప సాటున వొత్తుగా గెడ్డి బరుసుకోని దానిమింద బొంతేస్కోని నా పడక. కుప్పకి అవతలపక్కన నులకమంచం మింద మావఁ పడక. ఒకనాటి రేత్రి ఏంటికో యాడల్యేని సలి బుట్టింది. ఆయమ్మిని గెట్టెంగా అబ్బిలిచ్చుకోని పొణుకున్నాను. నిమసాల్లో నిదర బట్టేసింది. మెలకవొచ్చేతలికి తెల్లారి వొక్కడ్నే బొంతమింద పడుండాను. లేసి ఇవతలకొస్తే నులకమంచం మింద కూకోని సుట్ట కాలస్తుండాడు మావఁ. ఆడదాన్ని కవగూడడం అంటే ఇంతకి ముందుట్లాగా ఎవురికంట్లో పడతావోఁ అనేటి బయింతో ఏ తుప్పల్లోనో పరిగిస్తా పాలు తాగినట్టు పని కానిచ్చి లగిచ్చడం కాదని తెలుసుకున్న రేతుర్లయ్యి. ఆయమ్మి రైకిప్పి సళ్ల మజ్జిలో మొకం బెట్టుకోని సేతిని నడుం సుట్టూ ఏసి తడంతుంటే సల్లబడిన ఎనకటి దినాల ఏడి మల్లా ఎగదన్నింది. గెట్టెంగా అబ్బిలిచ్చుకోని మెడమిందా, సళ్ల మిందా మొకం రాస్తుంటే ఏట్లో మునిగి లోఈత కొట్టినప్పుటి ఊపిరాడని ఉనుమాదం ర్యేగింది. ఆయమ్మి సళ్లనీ, పిఱ్ఱల్ని, ముళ్లెంటికిల్ని నివఁరతుంటే సారాయి పీకల్దాకా తాగినంతటి కైపు గమ్మింది. బూవీ ఆకాశిం సద్దుమణిగి అలికిడనేదే ల్యేని నిసిజాఁవున ఏటెల్లవ సెట్లనీ పుట్లనీ గుట్లనీ గెట్లనీ ముంచేసి ఊరిమిందబడి అంతట్నీ ఊడ్సకపొయ్యి మున్నీట్లో గలిసి మాయిఁవైనట్టు ఆడదానిలో మునిగి త్యేలి కొట్టకపొయ్యి అట్టడుక్కి ఆర్సకపొయ్యినప్పుడే.. అది గదా మొగపుటక్కి అసలైన కవగూడేతనం అని కొత్తగా అనుబోగం అయ్యింది.

కుప్పలు నూర్సి వొకనాటి సంద్యాళకి కల్లాంలో వొడ్లు ఇంటికి జేర్నాయి. మాపిటి కూడు తిన్నానక నాకూ మావఁకి వసాట్లో మంచాలేసింది ఉమత్త.

నిద్రబడితే గదా ! నిన్నటి దాకా కుప్ప సాటున పొణుకున్న ప్యాణం ఈరేత్రి తీపి దిగని జ్యాగారం అయ్యింది. పడక తోడు కోసరం పేణం పెరుకులాడింది. ఆడదాని అబ్బిలి జెరం ఎన్నుబాకి ఇంక ఒంటిగా బతకల్యేనని తెలిసొచ్చింది. రొండు సేతులూ తలకింద బెట్టుకోని ఎల్లికిత్తలా పొణుకోనుంటే యాంద్యాందో ఆలోసిన్లు. మాయమ్మ ఏడుపు సలవ, సెవిటిమావఁ మాట సలవ, కుప్పకాడ అమ్మితో కవగూడిన సలవ నన్ను మల్లా మణిసిని జేసినాయి గదా అని కళ్లల్లో నీళ్లు దిరిగినాయి. ఎప్పుడు కన్ను గొరికినానో తెల్లారుజావఁన మావఁ లేపితే లేసినాను. పదరా అల్లుడా పూటకల్లు తాగదాం అని ఆ యాకాజాం కోళ్లు కూసేటి సీకట్లోనే నన్ను సెరువు కట్టకి లాక్కపొయ్నాడు. ఆడనుంచి ఊరెనక తాటితోపులోకి పొయ్యేతలికి ఎలుతురొచ్చి సెట్టు మింద నుంచి కల్లు దించతుండాడు గౌడు. తాటాకుతో రేక కట్టిచ్చి సల్లంగా జిల్లుమనేటి పూట కల్లు రెండుమూడు తడవలు నాతో తాగిపిచ్చినాడు.

ఆయిన గూడా రొండు తడవలు తాగినానక, నాయినో వొక మాట జెప్తా సెవిని బెట్టుకుంటా ? అనన్నాడు. యాందో సెప్పు మావాఁ అన్నాను. నీ మేనమావఁ కూతురు సురేకమ్మ బంగారు తల్లిరా. నీ మాదిర్నే మా కళ్ల ముందర పుట్టి పెరిగిన బిడ్డ. ఆ బిడ్డ గానీ నీ ఇంట్లో అడుగుబెడితే నీ బతుకు బంగారఁవవ్తాది. నాయిన్ల్యేని నిన్ను మీయమ్మ పైన బెడితే గెద్ద తన్నకపోతాది కింద బెడితే కాకి తన్నకపోతాది అన్నంత అపురోపంగా పెంచుకున్నాద్యే గెవణం ల్యేదా ? అట్టాటి మణిసిని యాంటికిరా ఈవాటాన యాపక తింటుండావా ? నీ వొయిసులో ఎవుడికైనా అంతో ఇంతో అలబరెవ్వారం ఉంటాది. అట్టని పెద్దోళ్ల మాటినకపోతే బతుకు ఎట్టా గాకుండా పోతాది. మీయమ్మకి యాఁవన్నా ఐతే నీ గురించి ఆలోసిచ్చేది ఎవుర్రా ? మీ మావఁ గూడా బిడ్డని నీకే ఇయ్యాలని ఉండాడు. మీయమ్మ మాటిని సురేకమ్మని మనువు జేసుకో నాయినా, నీకు ఇస్టంల్యాకుండా బలొంతంగా మటుకు వొద్దు. తెలిసి తెలిసీ ఆ బిడ్డ ఉసురు బోసుకున్నోళ్లం అవతాం. ముందుగాల నువ్వు ఏదొక పనిలో కుదురుకోని మనుసారా పెళ్లికి సరే అంటేనే జరగాల్సినాటివన్నీ పెద్దోళ్ళం ముందుండి సూస్కుంటాం అన్నాడు. నేను గమ్మునుండినాను. ఆకరితూరి ఎవురో పెళ్లిలో జూసినాను పైటా పావడాలో సురేకని, ఆయమ్మి రూపు నా కళ్లకి గట్టింది. ఆయమ్మి మింద అప్పుటిదాకా ల్యేని ఆలోసిన్లతో లోపల తొండ ఎక్కిరిచ్చేదానికి మల్లుకోడంతో నా పెద్యాలమిందకి నవ్వొచ్చింది. యాం నాయినా గమ్మునుండావా అనడిగినాడు మావఁ. ‘సరే మీ ఇస్టం మావాఁ’ అన్నాను. యాంద్యే పెద్దంగా జెప్పో అనన్నాడు. తెకతెకా నవ్వేసినాను, ఎన్ని ఇగాలయ్యింది నేను నవ్వే !! ఆయిన సెవ్వుకాడ నోరుబెట్టి ‘మీ ఇస్టం మావాఁ మీరు జెప్పినట్టే ఇంటా’ అని పెద్దంగా అన్నాను. మావఁ ఈస్పరా అంటా లేసి ఇంటికి పద మీయత్తని తోడుకోని నాయిడిపేట దాకా పొయ్యేటి పనుండాది మనకో అన్నాడు.

*

నాయిడిపేట కొత్త బస్టాండ్లో కూకోనుండాం నేనూ, ఉమత్త. ఇప్పుడే వొస్తానని పొయ్యిన మావఁ గెంట దాటినా అంతు ల్యేడు, ఏడెతా మావాఁ యాడికి బొయ్నాడా ? అని ఇసుగుతో అడిగినాను. మీయమ్మని తోడుకోనొచ్చేదానికి పొయ్నాడ్రా అన్నాది ఉమత్త. మాయమ్మన్యా ! ఈ బస్టాండ్లో ఉండేటి రచ్చా రావిడీ సాలదని మాయమ్మేంటికితా ఈడక్యా ? అనడిగినాను. అందురుం గలిసి నెల్లూరు కపాటి మాలాడకి పోతుండాం అన్నాది. ఆడక్యాంటిక్యా ఇప్పుడా ! అనడిగినాను బిత్తరగా, నా బట్టా నా రాళ్లకమ్మలు దెంకపొయ్యి కుదవబెట్టి మీ మావఁ నీతో కల్లాంలో ఆడిచ్చిన బోగాతం ఎరగవా ? ఎల్లకాలం ఎవుతిని దెంకోనొచ్చి పండెయ్యి మంటావురా అగుమూడ్నా బట్టా నీ పక్కనా ? కుత్త మూస్కోని గమ్మున మాతో రా. మీ మావోఁళ్ల ఇంటికి బొయ్యి పిల్లని మాట్లాడుకోనొద్దాం అన్నాది.

ఆ మరసటి నెల డిసంబర్లో నాకూ సురేకకీ నెల్లూరు లూదరన్ సెర్సీలో పెళ్లి జరిగింది.

మా తొలిరేత్రి యాకాజాఁవన సలికి మెలకవొచ్చి సూద్దును గదా నామింద కాలు సెయ్యి ఏస్కోని నిదరబోతుండాది నాయాడది. వోళ్లమ్మ పక్కనా, అవ్వ పక్కనా ఇదే వాటాన పొణుకోడం అలవాటని తరవాత దెలిసింది. సరైందే దొరికిందనుకోని ఆయమ్మిని నిదాణంగా పైకి లాక్కోని నామింద పండేస్కోని దుప్పటి కప్పుకోని అబ్బిలిచ్చుకున్నా.

*

చిత్రం: సృజన్ రాజ్ 

సొలోమోన్ విజయ్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనా హ్హి హ్హి హ్హి…
    నీ మాటల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి… హ్హి హ్హి హ్హి.

    మా సెల్లికి తెల్సానా నీ కుప్ప ఎనకాల యవ్వారం? మెట్తో కోట్లేదానా?

    బలే ఉండాదినా కతో.. పూట కల్లు తాగినట్టో.

    • చాలా బాగుంది.
      మీ”మునికాంతపల్లి కతలు” తర్వాత మీ రచనలు కనబడలేదు. చాలా రోజుల తర్వాత మీ కథ చదివితే చాలా సంతోషం గా ఉంది.
      మధ్యలో మీ రచనలు రాలేదా లేక నేను మిస్సయ్యానా ?

      • సన్ ఆఫ్ జోజప్ప నవల వచ్చింది సర్. ఛాయా పబ్లిషర్స్ వేశారు. థ్యాంక్యూ.

  • కథ చాలా బాగుంది. సహజంగా జరిగే విషయాలను అలవోకగా చెప్పి మీ ఊరు చూపించారు! Thank you!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు