సారంగ వేదికగా టాల్ కథల పోటీ

TAL Kindness Day సందర్భంగా…

సహానుభూతి, సాయం, సేవ…
లాంటి మానవతా విలువలను
ప్రతిబింబించే కథలకు ఆహ్వానం!

8 ఉత్తమ కథలకు బహుమతి
ప్రథమ బహుమతి 10,000 రూ.
ద్వితీయ బహుమతి 5,000 రూ.
తృతీయ బహుమతి 3,000 రూ.
5 కన్సొలేషన్ బహుమతులు 2,000 రూ. చొప్పున

నిబంధనలు
– ఇప్పటివరకూ ఏ మాధ్యమంలోనూ ప్రచురితం కాని కథలే పంపాలి.
– కథ స్వీయ రచన అనీ, మరే రచనకు అనుకరణ లేదా అనుసరణ కాదనీ, మరెక్కడా పరిశీలనలో లేదనీ… హామీ పత్రం జతచేయలి.
– రచయిత ఎన్ని కథలైనా పంపవచ్చు.
– ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరైనా సరే, ఈ పోటీలో పాల్గొనవచ్చు.
– హామీపత్రంలో మీ పూర్తిపేరు, చిరునామా, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ పేర్కొనాలి.
– బహుమతులు విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఇందులో ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు.

కథను ఇలా పంపాలి!
– కథ నిడివి 1600 పదాలకు మించకూడదు.
– అన్ని కథలూ ఇ-మెయిల్ ద్వారానే స్వీకరిస్తాము.
– కథలు యూనికోడ్ ద్వారా పంపగలరు. ఇతర ఫాంట్స్ అయితే పీడీఎఫ్ రూపంలో, రాతప్రతులు అయితే స్కాన్ చేసి పంపాలి.
– కేవలం హామీపత్రం మీద మాత్రమే రచయిత పేరు ఉండాలి.

* బహుమతి పొందిన కథలను సారంగలో ప్రచురిస్తారు!
* ఈ కథలు టాల్ రేడియో మాధ్యమాల్లో (రేడియో, పాడ్ కాస్ట్, యూట్యూబ్) కూడా ప్రసారం చేసే అవకాశం ఉంది.

కథలు అందాల్సిన గడువు – అక్టోబర్ 15
కథలు పంపాల్సిన మెయిల్ – info@talradio.org

ఎడిటర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దిగజారుతున్న ‘మానవతా విలువలు’ అంశం పై కథల పోటీ పెట్టడం బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు