ఖుష్కి నేలలోని
రంగురంగుల పూలన్నీ ఒక్కటై
తాంబాళంలో కుదురుకుని సంఘటితమైనాయి
ఆడబిడ్డల నెత్తి మీద కూర్చుని
చెరువు గట్టున దిగాయి
పాట కావాలని పూలన్నీ మొరాయిస్తే
ఆమెలంతా గొంతు కలిపి వినిపించారు
జలకాలాట లో సేదతీరుతామని మారాం చేస్తే
చెరువు లోకి పంపిన వాళ్ళు
ఆడి పాడి అలసిన మహిళలు ఇంటి ముఖం పడుతూ
పూలన్నీ సంఘటితమై ఓ రూపు దాల్చితే
నేలలోని మనుషులేమో నిచ్చెన మెట్లను దాటి ముందుకు
రాక ఏకం కాట్లేదేనని నిట్టూర్చారు!
*
Add comment