కవిత్వం

నగరానికీ ఒక కల వుంది..

1 ఎంతమంది కడుపు చేత పట్టుకొచ్చినా చేయి పట్టుకు చోటిస్తుంది నగరం. చెరువుల్ని, చెట్లనీ మింగేస్తున్నా కక్కలేక మింగలేక చూస్తుందీ నగరం. రోడ్ల మీద ఏరులై పారుతున్న వర్షానికి కన్నీరై పారుతున్న రోడ్డు మీద వ్యాపారికి నగరం బాధ్యత...

కుందుర్తి కవిత: రెండు కవితలు

1 అంకురం   మారాకువేస్తున్న ఆకుల మీద ఏడు రంగుల నీటిచుక్కల్ని ఉదయింపజేసే రోజులు కొన్నుంటాయి   అప్పుడే విచ్చుకున్న తెల్లటి పూవు వెచ్చగా పొదువుకున్న పుప్పొడిని చిరుగాలై వెదజల్లే రోజులవి పారుతూ అలసిన నదిని...

రవూఫ్ కవితలు మూడు

1 ఐక్య గీతం నీ మతం నీ అభిప్రాయం నీ భావజాలం ….. కేవలం నీవి మాత్రమే ; నావి కాదు. అట్లాగే, నా మతం నా అభిప్రాయం నా భావజాలం ….. కేవలం నావి మాత్రమే ; నీవి కాదు. ఐనా, నువ్వు నన్ను ప్రేమిస్తావు ; నేను నిన్ను...

పరుగు ఆపాలి ఇక !

1 లక్ష్యం ఏదైనా గానీ ఎంత దూరమైనా వుండనీ వాలిపోతున్న పొద్దులో పరుగు ఆపాలి ఇక ! ఓ సారి వెనుతిరిగి నాకు సాయం చేసిన చేతుల్ని తాకాలి దారి చూపిన వారి పాదాలకు నమస్కరించాలి మేలుకోరిన హితుల సన్నిధి చేరి ధన్యవాదాలు తెలపాలి...

ఆషాఢస్య ప్రథమ దివసే…

ఇంతలా ముసురుకొచ్చి గుండె ముందు కూచుంటే యక్షుడిలా ఎన్ని కవితలు కురిసిపోతావో అనుకుంటా కదా   ఎండ మాటా పాటా లేకుండా రేయీ పగలూ తెలియనీకుండా మండించి వెళ్ళిపోయింది మునుపటి నీ ఊసులతో పచ్చ పూల తంగేడునై నీ తడి కౌగిళ్ల...

స్వేచ్ఛ కవితలు రెండు

1 యుద్ధం అంటే అనేకం…   యుద్ధమంటే ఏకవచనం కాకపోవచ్చు. కొన్ని లోపలి యుద్ధాలు..కొన్ని బయటి యుద్ధాలు.. అన్నీ కలగలిసి ప్రాణం తీయొచ్చు..లేదా.. ఒక్కొక్కటీ ఒక్కొక్కసారి చంపేయనూ వచ్చు. ఊపిరి తీసుకోవడం..ఊపిరి తీసేయడం...

గరిమనాభి

తగులు తెంపుకున్న పల్ల బర్రె ఏ దిక్కువోయ్యిందో ఊర్లకు ఊర్లు జల్లెడవడుతున్న దెవులాట మారెమ్మ గుడికింద రాగిరేకుల యంత్రం గవ్వలిసిరేసి ప్రశ్న చెప్తుంది దాసర్లపెల్లి దేవునమ్మ తూర్పుకు మూడు బాటలు జువ్వి చెట్టు నీడలు పరిమర్క...

ఒకానొక క్షణాన

మనమిద్దరం ఈ జనసంచారంలో LH -8 ముందు కూర్చుని ఉన్నాం. నీ ముఖంలో ఎందుకో ఒక చిర్రాకు కనిపించింది స్ట్రీట్ లైట్ వెలుగు కింద అన్నావు ఇలా నాతో నువ్వు వెనుకగా చూపిస్తూ ఇద్దరిని నిట్టూర్పుగా ఒక నిచ్చ్వాసని వదులుతూ- ఎందుకు తనలా...

ప్రవర

నువ్వెవరంటే ఏం చెప్పాలి? యుగయుగాలుగా చెప్పి చెప్పి అలిసిపోయాను అల్లంత దూరంలో నేను అస్పష్టంగా కనిపించినా ముందు నీచూపు పడేది నా కనుబొమ్మల మధ్యనే కదా అక్కడ బొట్టు ఉందా లేదా అని చూస్తున్నావా? లేదంటే  చూపు కిందకి దింపి ...

కడలికి తెలియని కథలు

చీకటిని పులుముకుని చుక్కల్ని అంటించుకుని కడలి కళ్లలోకి చూసింది గగనం. పొంగి పొరలుతూ కడలి తన అలలతో కలిసి ఉన్న కొన్ని అడుగుల్ని తుడిచేసింది. వాళ్ళెప్పటికీ కలవరని ముందే తెలుసేమో ! వాళ్ళు తెచ్చిన పువ్వులని తీరాన వదిలేసి...

చిత్త వైకల్యం

1  ఇక్కడ మనుషులు తప్పిపోతుంటారు అలౌకికంగా మజిలీల్ని మననం చేసుకొంటూ. ఎవరైనా సందేహపడితే నాకేం సంబంధం లేదు. చిత్త వైకల్యం మా జన్మహక్కు. బతుకు గాలిపటం ఎగురుతూనే ఉంటుంది జీవితానుభావాల్ని కూడగట్టుకొని దేన్నీ విరమించనీయకు...

జీవితమే ఒకవర్ణచిత్రం

నేనొక చిత్రం గీయాలి మనసు కేన్వాస్ ని పరిచాను చూపుని సూదిలా చెక్కుకున్నాను తీరా వేయాల్సిన బొమ్మ తీరుగా రాకముందే సూది ముల్లు పుటుక్కున విరిగింది పదేపదే చెక్కుకుంటునే ఉన్నాను నేనొక చిత్రం గీయాలి కనీసం పెన్నుతోనైనా వెయ్యాలి...

పది హైకూలు

1 నా భుజం మీద పిచ్చుకొచ్చి వాలింది మీరూ చూడండి 2 నల్ల మబ్బులు ఒకింత జరిగాక ఓ చందమామ 3 నిద్ర గన్నేరు రాత్రి నిద్ర పోలేదు పొద్దున్నే పూలు 4 నాన్న ఎన్నడూ తన గాయాలమూట విప్పనే లేదు 5 నాన్న చెప్పులు తిరగేసి చూసాను వందల ముళ్ళు...

గిరి ప్రసాద్ చెలమల్లు కవితలు రెండు

1 యాదిలో సంతకం   మబ్బులు కురిసెనో లేవో ఉరుములు ఉరుముతున్నాయ్ పిడుగులు యాడనో పడ్డ శబ్దం ఓ మట్టి సుగంధాన్ని మోసుకొచ్చిన గాలి ముక్కుపుటాలకందించి ఆగింది ఆమె వస్తుందో రాదో గాజులగలలు వినిపిస్తున్నాయ్ కాలి గజ్జెల సవ్వడి...

దేశరాజు కవితలు రెండు

1 దగ్గర నీవు వచ్చిన సవ్వడీ లేదు విడిచి వెళ్లిన శబ్దమూ లేదు కొన్నిసార్లు బాల్కనీలో బంతిమొక్క ఊగితే, గాలికే అనుకున్నా. గోడల మీద వెలుతురు చిలకరించిన నీడల్ని ఇటుకలు పీల్చేసుకున్నాయి. సాయంత్రపు నీరెండ సిరామిక్ టైల్స్ పై...

పిల్లలు – సెలవులు

బడులు మూతపడ్డప్పటి నుంచీ పిల్లల కనుపాపలపై సీతాకోక చిలుకలు వాలుతాయి భుజాలపై భారమంతా పోయి కాళ్ళకు చేతులకు రెక్కలు మొలుస్తాయి తాతగారూ అమ్మమ్మ ఇళ్ళల్లో పూల కుండీలు అన్నీ ఒక్కసారిగా నవ్వులు విరాబూస్తాయి తాత చేతిలోని ఊత కర్ర...

Illusion

నేనేమీ అడగలేదు నిన్ను ప్రేయసిలా నా భుజం మీద వాలిపొమ్మని… కొంత చనువు తీసుకుని నువ్వే చుట్టేసుకున్నావు బాంబుష్ లను చూసి భయపడే పసిపిల్లలా నా ఎడం చేతిని నల్లని కాటుక మధ్యలో చిక్కుకుపోయిన నీ కళ్ళు చీకట్లో రంగులు కోల్పోయిన...

ధార 

మధ్యాహ్నపు గాలులు ఆకుల మీద గీసుకు పోతూ.. శాంతి లేని కాలంలో బరువుగా చెదిరి పోయే దృశ్యాలు నలత పడ్డ కంటి తడి. చిత్రకారుడి చిత్రం లో నిరాశ చేరితే చిత్రమంతా చీకటి మరకలు విషాదం గా  కనిపిస్తాయి. * అయినా కూడా మళ్ళీ  పగుళ్ల...