A Night in the Refugee Camp

Featured Poet: SWAPNA BEHERA

In this issue I’d like to introduce one of the most acclaimed poets of India and abroad by name Swapna Behera from Odisha. She received numerous awards and accolades for her contribution to English literature besides Odia. One of her poems titled “A Night in the Refugee Camp” has been translated into more than 60 languages (Indian & Foreign languages) which came as a volume with my review of the poem.                                                             —–Vasudev

Swapna Behera born in 1955 is a multilingual contemporary poet, author, educationist ,critic translator, reviewer, social worker and editor from Odisha ,India. Her stories, poems and articles are widely published in Newspapers, International journals , magazines Anthologies, ezines and translated into different languages .

Swapna Behera is a former teacher for more than three decades at the Mont Fort School from 1984-1995 and a teacher in Kendriya Vidyalaya, from 1995-2015 under Kendriya Vidyalaya Sangathan ,an Autonomous organization under the Ministry of Human Resource Development, Government of India .She has received outstanding recognition for teaching excellence . She retired as a teacher from Kendriya Vidyalaya Sangathan , in July 2015.

 LITERARY ACTIVITIES

Her poems are published in the Inter National Anthologies ” Tomb Of Words” from the USA , “TimeLess Love “,Lang Lit”, “Hung On the Cross” “Creative Corner”,”The Poetry Wall”,”My Sweetest Love”, ,Diff Truth, “Voices of Humanity”,”Rock Peebles”, Lang Lit , Amarvati InterNational Multilingual Anthology 2016 & 2017,InterNational Multilingual Poetry Anthology of women Poets [Women wit&Wisdom}  ,Indifaring Muse,Heart Heart, ,Symphony of Peace ,Pravati Tara,Chanakya in Hndi,Veena in Hindi, Yugashee Yuganaree ,Sucharita ,Vasudha,And the Rhythm Endures , Sabdalipi in Odia ,FUN-N –FROLIC Anthology, Serious and Hillarious, Heart to Heart, International Anthology for World Peace ,World Poetry on Let there be Peace a paradigm for Peace Strategies ,Plant Poetry Anthology , OPA Anthology of Beyond The Borders ,The Year Of The Poet published from U.S., Article on Complexion Based Discriminations & Global insight ,short story and poems in Different Truth’s special Anthology on Africa ,Symphony of Souls , Medley of Melodies : A Florilegium of Poems, GloMag, Sambad Kalika , Prajatantra, Prameya and in several newspapers .

A NIGHT IN THE REFUGEE CAMP

—Swapna Behera

 

In the refugee camp of Afghanistan

Scorching days of ‘No Water’

Desperate queue of hours’ hue

Only a bucket per a tent

 

Lusty eyes of the guard

Craving gesture of all horror

Precondition placed by him

An extra bucket; come for a night

 

Never a night but explosive fight

Never comes the dawn or peeps the Sun

Shahnaz a  girl of fourteen

Awake whole night in a  fix

in her tent a bucket for six!

Those five days she needs water more

 

Restless Shahnaj makes a  deal

Better to be the Begum of the guard

Instead of burning  every second

Can bathe and wash all her parts

 

Monthly these days will be stress-free

So what the guard above sixty

Certainly water beyond all needs

 

Fourteen year Shahnaz chooses the path

Walks to the guard slowly and slowly

“Uncle, will you marry me?”

 

@Swapna Behera

 

స్వప్న బెహరా || A NIGHT IN THE REFUGEE CAMP ||

అనుసృజన: సి.వి. సురేష్  || శరణార్థుల శిబిరం లో ఒక రాత్రి  ||

ఆ ఆఫ్ఘన్ శరణార్తుల శిబిరంలో

అవి నీళ్ళు లేక ఎండిపోయిన రోజులు.

గుడారానికంతా ఇచ్చే, ఒక్క బకెట్ నీటి కోసం

గంటల కొద్దీ బారులు తీరి

అరుస్తూ నిస్సహాయంగా ఉండిపోవడమే.

..

అక్కడ,  నీటి కాపలాదారుడి కామపు కళ్ళు

కోరికతో చేసే సైగలు భయాన్ని కలిగించేవి.

ఒక అదనపు బకెట్ నీటి కోసం

అతడు పెట్టిన షరతు : ఆ రాత్రికి పక్కలోకి రావాలని!

..

గొడవ తలెత్తని ఏ రాత్రీ లేదు

తగాదా లేని ఏ ఉదయాన సూర్యుడు తొంగి చూడడు!

14 ఏళ్ల షహనాజ్, ఆరవ బకెట్ నీటి కోసం

రాత్రంతా తన గుడారం లోనే

కదలకుండా మేల్కొని  ఉండిపోయింది.

ఎందుకంటే, ఆ అయిదు రోజులు

ఆ పిల్లకు నీళ్ళు ఎక్కువగా కావాలిమరి!

..

అలసి పోయిన షహనాజ్ ;

తన దేహభాగాలన్నిటిని స్నానం చేయించి

శుభ్రం చేసుకోవడానికి …

ప్రతి క్షణం వేదనకు గురవ్వడం కంటే,

ఆ కాపలదారుడి భార్య  కావడమే మంచిదని

ఓ నిర్ణయానికొచ్చింది

..

నెలసరి ఈ రోజుల్లో

ఎలాంటి వొత్తిడికి గురి కాగూడదంటే

అన్నిటి కంటే ఎక్కువ అవసరం నీళ్ళు.

కాపలదారుడు అరవై ఏళ్ల పైబడైతే నేమి!

పదునాలుగేళ్ళ షహనాజ్ ఆ మార్గాన్నే ఎంచుకుంది .

షహనాజ్  నెమ్మది నెమ్మది గా ఆ వృద్ధుడి వైపు నడిచి

“అంకుల్!” “ మీరు నన్ను వివాహమాడతారా!?”

 

*******

 

Srinivas Vasudev/CV Suresh

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శరణార్ధుల శిబిరం లోనేకాదు, కొన్ని చోట్లా, ఇదే పరిస్థితి.. చెప్పుకోలేని, ఈమానసిక, శారీరిక బాధ ను,కవిత గా, అనువాదం గా,..రాసిన మేటి రచయిత లు,ఇరువురి కి,శత కోటి ప్రణాములు!💐ధన్యవాదాలు.. Cv sir&Sv .sir,S.

  • విషాద కవిత్వం…. నిజాల నీడలు సార్

  • వెతల కతలు
    బ్రతుకు పోరాటంలో
    కన్నీటి గాధలు
    భాష మారింది
    బాధ అలానే ఉంది
    గుండె కన్నీరయ్యేలా
    భావంతో పాటూ బాధనీ
    యధాతధంగా తర్జుమా చేసిన
    సురేష్ గారికి శ్రీనివాస్ వాసుదేవ్ గారికీ
    అభివాదములు

      • “భాష మారింది
        బాధ అలానే ఉంది” అవును, పేర్లు మిగతా వివరాలు మారోచ్చేమో కానీ పెయిన్ అలానే ఉండిపోయింది విశ్వమంతా! That’s why it is said that poetry has universal appeal.Thanks a lot Ramesh

  • Thanks a lot Dr Srinivas Vasudev ji For publishing my poem A NIGHT IN THE REFUGEE CAMP in this prestigeous magazine and thanks a lot CV Suresh ji for translating this poem to Telugu.

    I humbly thank the publisher and All my best wishes to SAARANGA….
    Long live creativity ..
    Happy New year to all 🌷

  • సాహిత్య ప్రక్రియలు భావ వ్యక్తీకరణ ల నుండి సంఘర్షణలు,సమాజ అకృత్యాలపట్ల స్పందించిన కవుల ,రచయితల రచనలు చదివినప్పుడల్లా తెలీని బాధ స్పందనలను అడ్డుకుంటుంది..ఆవేదన అక్షరాల్లో చూడలేని రోజు కోసం మనసు వెతుకుతుంది…ఇన్నేసి భాషల్లో ప్రాచుర్యం పొందిన స్వప్న బేహారా గారి ఈ పోయెమ్ తెలుగు లో అనువదించిన CV సర్ కి కృతజ్ఞతలు..కనీసావసరాలు పొందలేని దౌర్భాగ్యం షహనాజ్ వంటి వారిని ఎటువంటి నిర్ణయాలకు ఉసిగోల్పుతుందో..సంఘర్షణలు మనోధైర్యపు లోతుల్ని ఎలా పరిక్షిస్తాయో తెలిపారు..మూలాన్నీ చేరిన సరళమైన అనువాదం చాలా బాగుంది..CV గారు,వాసుదేవ్ గారి కవితా జుగల్బందీ గొప్ప గొప్ప కవులను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు