లోపల ఏదో దహించబడ్తోంది

ఉండీ ఉండీ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడ్తుంది

ఎందుకో తెలియదు

అప్పటిదాకా అంతా ప్రశాంతంగా ఉన్న సముద్రమే

అప్పుడప్పుడు ఒక్కసారిగా రగులుతున్న రాచపుండువంటి

హరికేన్ కన్ను జలతలంపై పుట్టి

ప్రచండ వేగం.. ప్రతిహత విధ్వంసం మొదలై

సుడిగుండం.. దిశ తెలియదు.. గమనమూ తెలియదు

అంతే.. అంతా మోకళ్ళ నడుమ కన్నీళ్ళను ధరించిన శిరస్సు

అన్నింటికీ కారణాలుండవు

కార్చిచ్చు పుట్టుకకూ, అరణ్యదేహంపై పండువెన్నెల వర్షానికీ,

అంతా నిశ్చితానిశ్చితాల అసంగత రోదన

అనుభవాలు చెబుతూనే ఉంటాయి

లోపల ఏదో దహించబడ్తోందని –

ఒక్కోసారంతే.. హేతువుకోసం వెదకడం

‘ఆత్మనిర్భరత ‘ భ్రాంతిలో కూలిపోతూ  కూలిపోతూ

సముద్రతరంగాలు.. తీరానికి తలలుబాదుకుని

నిస్సహాయంగా మౌనించడమే ఔతున్నపుడు

ఇక మళ్ళీ పడిలేవడానికీ

లేచి మళ్ళీ పడిపోకుండా నిలదొక్కుకోడానికీ,  భూమి  ఆకాశంలోకి అభిక్రమించడానికీ

న్యూటన్ చర్యా ప్రతిచర్యా  సిద్ధాంతాన్ని వెదుక్కుంటూ

అదుముకోవాలి.. నిన్ను నువ్వే ఒక స్ప్రింగ్‌వలె అదుముకోవాలి

ఇంకా ఇంకా.. బలంగా.. రిజీలియెన్స్.. అంతఃశక్తి

ప్రతిదాన్నీ హార్స్ పవర్‌తో కొలుస్తూ కొలుస్తూ

ఎవరికివారే .. ఒక హిమసునామీ ఐ –

డేగవలె చిన్న కన్నుతో ఐదుకిలోమీటర్ల దూరంలోని సూక్ష్మాన్ని వీక్షించాలి

నీ రెక్కల ఈకలను నువ్వే పెకిలించుకుని రక్తాలోడ్తూండగా

నీ పునర్జన్మను నువ్వే సృష్టించుకోవాలి.. కమాన్.. లే.. గెటప్

రక్తసిక్త పాదాలను మళ్ళీ సంధించు అటు గమ్యంవైపు-

*

రామాచంద్ర మౌళి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అరణ్య దేహంపై పండు వెన్నెల వర్షానికి

  • డేగవలె చిన్న కన్నుతో ఐదుకిలోమీటర్ల దూరంలోని సూక్ష్మాన్ని వీక్షించాలి

    నీ రెక్కల ఈకలను నువ్వే పెకిలించుకుని రక్తాలోడ్తూండగా

    నీ పునర్జన్మను నువ్వే సృష్టించుకోవాలి.. కమాన్.. లే.. గెటప్

    రక్తసిక్త పాదాలను మళ్ళీ సంధించు అటు గమ్యంవైపు-

    evi kavitayokka praanavaakyaalu. very motivative. thank you chandramouli garu.

    narasimharao.c
    Hyderabad

  • Regaining one’s self, at one point of time, is a required task that grants life in life. The poem here channelises the reader to undertake such a task. Man generally submits to fate, time, situation or circumstances. The poet, Prof. Moulee suggests to challenge our bell curve of confidence very powerfully. An inspiring poem that stands intrinsically positive by a contemporary legendary writer of all literary genres from Telengaana.

  • A poem that can be read in a motivational session by any seasonal public speaker. All works of this modern experimental writer can be categorised the same way. Kudos to him!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు