లోపల ఎవరైనా ఉన్నారా?

వింటారా

నీడలా ధూళిలా

రాలిపోతున్న క్షణం?

కంటారా

తెర వెనుకటి

చీకటి శిశిరంలో

పెరపెరల నక్షత్ర రవం?

వస్తారా

వెనువెంటే

తెగిన చిటికెన వేలు

తప్పిపోయిన పిడికిట్లో

దిగబడిన శూన్యం

Painting: Rafi Haque

వెళ్తారా

దిక్కులు చిక్కుపడిన

శల్య పంజర రజం…

ఇక్కడే

ఉన్నా

వినండి

చూడండి

రండి

వెళ్ళండి

నేనొక

నిరంతర్జీవ

శకలం

సకలం

*

పసునూరు శ్రీధర్ బాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు