నొప్పి అంతగా లేదు

న్నగా ఝూ అంటున్న ఏసీ
చల్లగా కళ్ళు మూతలు పడుతున్నాయి
ఏవో గ్నాపకాల దొంతరలు, పసితనపు
ఆటల నవ్వుల పువ్వులు
యవ్వనపు కలల నవ్వులు
కీక్, కీక్ అంటున్న తల ప్రక్క మానిటర్
తెలుసునాకు ఆ కౌంట్  డవున్
కష్టపడి తల తిప్పితే కనిపించే
ఆ క్రిష్టమస్ ట్రీ కి వేలాడున్న ఆ ఐవీలు
ఆ చెట్టు ఎంత పెద్దదైతే చీకటి అంత దగ్గరట
నొప్పి అంత లేదు, ఇంకా ఇది సంధ్యే కదా
ఏవేవో కలలు, ఈ గ్నాపకాలు నావేనా
నిజంగా, మసక, మసకలో ఈ స్పర్శ
భయవేవీ లేదు, ఎవరో, ఎవరెవరో
కలలోలా కరిగిపోతున్నారు
చెంప మీద తడి తెలుస్తుంది
పెదవులపైన ఏదో వెలుగు
మాటకావటానికి ప్రయత్నిస్తుంది
గొంతులో గురగుర ఆగటం లేదెందుకో
ఇంకా కిక్, కిక్ నెమ్మదిగానే,
కానీ వినిపిస్తుంది, నిజవా
కళ్ళు తెరుసుకున్న ఈ చీకటిలో
నన్నునేనే కనే కలా-
*

రవికిరణ్ తిమ్మిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు