తుప్పు పట్టిన వెండితెర!

నిజమే శ్రీరెడ్డి బ్లాక్మెయిలే చేసింది. ఐతే ఏంటట? ఎవరిని చేసింది బ్లాక్మెయిల్? ఎవరికి చెమటలు పట్టించింది? ఎవరికి నిద్రాభంగం కలిగించింది? అనేది ముఖ్యం.

సాధారణంగా మనిషి తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యతనిచ్చేది, నీచంగా తీసి పారేసేదీ కూడా శృంగారమే.  మనిషి శృంగారం చుట్టూ జరిపేంత రాజకీయం, ధార్మికం, వ్యాపారం మరే అంశం చుట్టూ జరపడేమో!  ఏ భావజాలాలతో సంబంధం లేకుండా జీవన్మరణాల మధ్య ఓ అద్భుత మానవీయానుభూతుల యాత్ర శృంగారమే.  భావజాలాలతో సంబంధం వున్న చోట అదే జీవన్మరణాల మధ్య మనిషిని అతి దారుణంగా పతనం చేసేదీ శృంగారమే.  రెండో ఉదంతంలో తప్పు శృంగారంది కాదు.  శృంగార పరమార్ధం తృప్తి తప్ప మరేదీ కాదు.  కానీ అదే శృంగారానికి ఒక ధర పెడితే వ్యభిచారమౌతుంది.  ఒక ప్రతిఫలం పెడితే కేస్టింగ్ కౌచ్ అవుతుంది.  రెండు సందర్భాల్లోనూ దేహానికీ, ధనానికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లంకె ఏర్పడుతుంది.

దేహాల్ని అద్దెకి తీసుకునేవాడెప్పుడూ బాధితుడు కాలేడు.  డబ్బు పరమైన “వన్ టైం సెటిల్మెంట్” కింద లావాదేవీ చేసి, ఆ తరువాత “ఎవరికి వారే యమునా తీరే” అన్న చందాన వెళ్ళిపోవటం ఒక పద్ధతి.  నలుగుర్నీ తొక్కుకొచ్చి, నెత్తుట్లో డబ్బు జబ్బు నింపుకున్నవాడే ఆశ చూపించి దేహాల్ని తన ఇష్టం వచ్చినప్పుడల్లా స్వాధీనం చేసుకోగలడు.  వాడిది కామం తప్ప మరేదీ కాదు.  కానీ దేహాల్ని ఓ అవసరం కోసం ఖరీదుకో లేదా ఒక ప్రతిఫలం కోసమో అద్దెకు ఇచ్చే వాళ్ళకి కామంతో పని లేదు.  వాళ్ళకి బతుకు బండి నడపటానికి ధనమో లేక ఆ బతుకు బండిని ముందుకు నెట్టడానికి ఓ అవకాశమో మాత్రమే కావాలి.  అవకాశాల్ని ఆశించి  దేహాల్ని మంచాల మీద పరిచిన వాళ్ళు ఆశాభంగానికి గురైనప్పుడు వాళ్ళు బాధపడేది పోయిన శీలాల గురించి కాదు, జారిపోయిన అవకాశాల గురించే.  దురదృష్టం ఏమిటంటే ప్రతిఫలం దక్కుతుందని వ్యభిచారులకుండేంత భరోసా కూడా వీరికుండదు.  ఆశాభంగం గౌరవభంగం కన్నా భరింపరానిది.  ఆ ఆశాభంగం తట్టుకోలేకనే శ్రీరెడ్డి పెద్దగా అరిచింది.  ఏడిచింది.  బూతులు తిట్టింది. చివరికి బట్టలు కూడా విప్పి “మా” ముఖాన విసిరేసి సినిమారంగం సిగ్గు తీసేసింది.

శ్రీరెడ్డి ఏం చెప్పిందనేది ముఖ్యంగా కనబడలేదు శీల శిఖామణులకి.  ఆ అమ్మాయి వేష భాషలే ప్రధానమైపోయాయి.  తెలుగమ్మాయిలు బోల్డ్ గా సినిమాలు చేయరన్న వాదానికి విరుగుడుగా “ఏం నన్ను చూస్తుంటే నీకు నైంటీ డిగ్రీస్ అవ్వటం లేదా?” అని గుచ్చి గుచ్చి అడిగింది.  అంతే జనం గుండెలు బద్దలైపోయింది.  సినిమా పాటల్లో “ఆకు చాటు పిందె తడిసె” అనో లేక “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అనో పురుషస్వామ్యపు బూతు పాటలు ఎంత రాసినా, పాడినా, గెంతినా ఎంజాయ్ చేసే జనాలకి శ్రీరెడ్డి కడుపు మండి మాట్లాడిన మాటల్లో  బూతు మాత్రమే వినిపించింది.   చీకటిగదిలో లేని నల్ల పిల్లి వంటి శీలాన్ని అర్ధ నిమీలిత నేత్రాలతో ఆరాధించి, పోతరాజులా తన్మయత్వంతో ఊగిపోతూ ప్రేలాపించే వేదభూమి మీద “నేనేమీ శీలవతిని కాదు.  అవకాశాల కోసం దాన్ని ఎడమకాలి చిటికెన వేలితో ఈడ్చి తన్నాను” పొమ్మంది.  తనలాంటి వాళ్ళు సినిమారంగం నిండా వున్నారని తెగేసి చెప్పింది.  తెలుగమ్మాయిలను అవకాశాల ఎర చూపించి సెక్స్ కోరికల్ని తీర్చుకొని సిగరెట్ పీకలా విసిరేస్తున్నారని ఆక్రోశించింది.  కొబ్బరి పచ్చడిలో కొబ్బరుండాలన్నట్లే, చికెన్ బిర్యానీలో చికెనుండాలన్నట్లు  తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకి ప్రధానంగా అవకాశాలివ్వాలని డిమాండ్ చేసింది.  అంతే బొబ్బలెక్కేలా భుజాలు తడుముకోవటంతో పాటు పగిలిపోయేట్లు గుండెలు బాదుకోవటంతో తెలుగు టీవీ చానెళ్ళన్నీ దద్దరిల్లిపోయాయి.  సినిమారంగంలో అందరూ పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం తెలియని శంకరశాస్త్రులూ, సోమిదేవమ్మలై పోయి ఆ అమ్మాయి మీద శీల భాషతో విరుచుకు పడ్డారు.  “తెలుగు సినిమా రంగం ఇంత సంస్కారవంతమైనదా? అబ్బ ఛా”  అని మనల్ని మనం గిల్లుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.   సినిమా పిల్లి మెడలో గంట కట్టిన శ్రీరెడ్డి కొద్ది రోజుల పాటు ఒంటరి పోరే చేసింది.

నిజమే శ్రీరెడ్డి బ్లాక్మెయిలే చేసింది.  ఐతే ఏంటట?  ఎవరిని చేసింది బ్లాక్మెయిల్?  ఎవరికి చెమటలు పట్టించింది?  ఎవరికి నిద్రాభంగం కలిగించింది? అనేది ముఖ్యం.  తానేం కోల్పోయిందో సిగ్గు పడకుండా బహిరంగంగా చెప్పిన అమ్మాయికి అందుకు కారకులైన వారి ముసుగులు వూడబెరకటం అంత కష్టమైన పనేమీ కాదు.  సరిగ్గా అదే పని చేసి చూపించింది.  పట్టుమని నాలుగు సినిమాలు కూడా చేయని అమ్మాయి దెబ్బకి సినిమారంగం పెద్దలంతా కుదేలైపోయారు.  మహిళాసంఘాలు అండగా నిలవటంతో, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా శ్రీరెడ్డీ ఉదంతాన్ని స్వీకరించటంతో అందరిలో కలవరం మొదలైంది.  ఆ రకంగా శ్రీరెడ్డి తాను అర్ధనగ్న ప్రదర్శన చేసి సినిమారంగాన్ని పూర్తి నగ్నంగా నించోబెట్టింది.

వెండితెర మీద సీతాకోక చిలుకలా ఎగరగలమని ఇండస్ట్రీకి వచ్చి, అదే ఇండస్ట్రీ గోడ మీద ఎప్పటికీ గొంగళిపురుగుల్లా బతుకులీడ్వాల్సొస్తున్న అనేకమంది జూనియర్ ఆర్టిస్టులకి శ్రీరెడ్డి తెగింపు ధైర్యాన్నిచ్చింది.  మహిళాసంఘాలు కూడా గొప్ప మద్దతు ఇచ్చారు.  ఒక్కొక్కరు తమ గుండెకోతని వినిపించారు.  చీర చుట్టాలే కానీ ఊరకుక్క వెంట కూడా పడే దగుల్బాజీ మై సన్స్ పేర్లు కూడా వాళ్ళు చెప్పారు. “ట్రాన్స్ జెండర్ అయిన నన్నే గుడ్డలు విప్పి చూసిన ఈ దొంగ నా కొడుకులు అమ్మాయిల్ని వదుల్తారా?” అని ఒకరు నిలదీసారు.    వెండితెర మీదనే కాదు, ఆ లోపల కూడా వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందనటానికి అంతరాత్మ చచ్చిపోయిన ఓ సాంస్కృతిక మృత జీవిత వ్యాఖ్యలే సాక్ష్యం.  నిజానికి ఆశోపహతుల వేదనకి స్పందించని ప్రతి హీరో దొంగ వెధవే.  సినిమాల్లో హీరోలందరూ నిజ జీవితంలో ఐతే జీరో అన్నా అయివుండాలి లేదా విలన్లన్నా అయివుండాలి అని నిరూపించారు.  తమ బాధల్ని పట్టించుకోమంటే శుంఠ హీరోలు పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చుకోమని కుంటి సలహాలిచ్చారు.  ఏ రంగం నుండైతే తానో సూపర్ స్టార్ అయ్యాడో ఆ రంగంలో దోపిడీకి గురైన వారు సహాయాన్ని అర్ధిస్తే సానుభూతి చూపలేని “మెగా సూపర్ జీరో” రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడట.  ఎవరి సలహా ఐతే ఏం కానీ శ్రీరెడ్డి అనకూడని మాటే అన్నది.  ఆమె ఒక్కసారి మాతృదూషణ చేస్తే  “మా అమ్మని ఆ మాట అంటుందా?” అంటూ జీరోగారు ఆ మాటని  వందల సార్లు పునశ్చరణ చేసుకున్నాడు.  పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రదర్శనలకే దిగాడు.  అగ్ర జీరోలందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని మూకుమ్మడిగా భోరుమనే పరిస్తితి తీసుకొచ్చిన శ్రీరెడ్డి ధన్యురాలు!

హాలీవుడ్ నుండి బాలీవుడ్, టాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా అక్కడ విశ్వరూప సాక్షాత్కారం చేస్తున్న “కేస్టింగ్ కౌచ్” రాజకీయాల్లో కూడా వుందని పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న ఒప్పుకోలు!   నిజం!  కేస్టింగ్ కౌచ్ మానవజాతికి సంబంధించిన ఓ అతి పెద్ద నగ్న సత్యం!  కేస్టింగ్ కౌచ్ అన్న ఒక్క పదం లక్షలాది వేదనామయ బతుకులకి అసాంస్కృతిక భాషా ప్రతినిధి.

ఇక్కడ శ్రీరెడ్డిలు వున్నారు జాగ్రత్త!!!

*

అరణ్య కృష్ణ

46 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పోలీస్ స్టేషన్ లు కోర్టులు ఏమి చేయలేవని తెలిసే అక్కడకు వెళ్లాలని సలహా
    ఇచ్చారు .వాళ్ళూ తెలివైనవాలు కాబట్టి పోలీస్ స్టేషన్ లు కోర్టులు వెళ్లకుండా వీధి పోరాటాలు
    ,ప్రెసుమీత్ రంకెలు వేస్తున్నారు .మొత్తం విషయాన్నీ బాగా విశ్లేషించారు
    .అన్ని విషయాల్లాగే కొంతకాలానికి అందరు మర్చిపోతారు.రిఫరెన్స్ కు అప్పుతప్పుడు వాడతారు
    .

  • వెరీ well said Aranya Krishna గారు! అసలు సమస్యని పక్క దారి పట్టించి ఆమె భాష పైన, ప్రవర్తన పైన పడి ఏడుస్తున్న వాళ్ళను ఏకి పారేశారు. బావుంది!

  • అవును
    ఇక్కడ శ్రీ రెడ్డిలూ వున్నారు జాగ్రత్త..

    శ్రీ రెడ్డీ నోరువిప్పి
    వీళ్ళని పంట్లాం లో
    ఉఛ్ఛ పోసుకునేలా చేసింది..

    మైఫుట్ అంటూ మధ్యవేలుని చూపింది..

    నడిబజారున నగ్నత్వాన శ్రీ రెడ్డి కాదు
    మొత్తం సినీ బాబుల యవ్వారాన్ని
    నగ్నంగా నిలబెట్టింది

    హితుడా..చక్కని విశ్లేషణ కు.. ధన్యవాదాలు

  • కేస్టింగ్ కౌచ్ అనే పెద్ద సమస్య వెలుగులోకి రావడానికి శ్రీరెడ్డే కారణం. ఆమెకు నీతులు చెప్పేంత గొప్పగా తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ లేదు. మొత్తం ఉదంతాన్ని బాగా విశ్లేషించారు.

  • చాలా చక్కగా అర్థవంతంగా రాశారు.”ఆశాభంగానికి గురైన వాళ్ళు బాధపడేది పోయిన శీలాల గురించి కాదు.జారిపోయిన అవకాశాల గురించే.”నూరు శాతం నిజం.దాన్ని భరించే శక్తి లేక అదాటున అన్న ఒక్క మాటను వాళ్ళు వేల సార్లు అని గురివిందగింజలైపోయారు.నిజంగా జీరో లని అందరికీ అర్ధం అయ్యింది.. Excellent post sir.Tq for sharing.

  • మంచి వివరణ సర్ – సినీ పరిశ్రమలో స్త్రీ అంటే ఓ ఆటబొమ్మ మాత్రమే అనే అర్థం శ్రీరెడ్డి స్పందించేవరకు తెలియకపోవడం విచిత్రంగా వుంది! నిజానికి శ్రీరెడ్డి చాలా ఘాటుగా స్పందించింది – పురుషాధిక్య బావాజాలం కలిగిన ఎందరో తన ప్రవర్తనను కర్ణ కఠోరంగా వర్ణించడం చూసాను.. కారణం ఓ ఆడది ఆడదానిలా ( బొమ్మలా వుండక ) బరితెగించడం అనుకోవడం.. బరితెగింపు అనగా – సెక్స్.. శృంగారాన్ని పవిత్రంగా చూడటం వలన పుట్టుకొచ్చేదే పురుషాధిక్యత అని అర్థం చేస్కుని వాళ్ళ అమాయకత్వాన్ని జాలిగా చూసాను.. శ్రీరెడ్డి – ఎందరిలాగో తనదీ ఓ వాడిపారేసిన జీవితం అనుకుని వుంటే సనీ పరిశ్రమ కామతనం బయటపడేదే కాదు!
    ” అవకాశం కోసం సెక్స్ చెయ్యడం తప్పుకాదు నాదృష్టిలో – అదే అవసరం కోసం మాత్రం కాకూడదు !”

  • తుప్పుపట్టిన వెండితెర నగ్న చిత్రం బట్టబయలు చేసిన శ్రీరెడ్డి సాహసం అడుగడుగునా దర్శితం చేశారు

  • శ్రీ రెడ్డి దెబ్బకి….మా…ముగబోయి….హీరోలు జీరోలు అయ్యారు….
    ఇదీ ఒక్క సినీ రంగం అని కాదు…అన్ని రంగాల్లో ఉంది…మీ విశ్లేషణ చాలా బావుంది….ఎవరో ఒకరు ఎపుడో..అపుడు….నడవాలి…కదా ..

  • ఆద్యంత అత్యద్భుతం
    అద్భుతం గొప్పపదమనికాదు
    అంతకంటే అద్భుతమైన గొప్పపదం నాకు తెలీదు
    ముష్టి వాడి బొచ్చలో దబ్బులేస్తున్నామన్నట్టు ఫోస్ ఇచ్చి ముష్టాడి డబ్బులు కొట్టేసే రకాలు ఈ సినీరంగ పెద్దమనుషులు
    ఏ రంగము లో ఐనా పైకి రావాలంటే వాళ్ళ స్వయంకృషి ఉండాలి
    ఈ ఒక్క రంగం లోనే 24 ఫ్రేంస్ వెనకేసుకుని
    అన్ని కాళారంగాల్ని చిదిమేసి
    ఒక్కడు హీరో ఔతాడు
    మళ్ళీ వాళ్ళకి గోష్టులు , డూపులూన్ను
    ఎక్కడైతే వ్యక్తి పూజ మొదలౌతుందో అక్కడ ఇక అన్ని చచ్చి పోతాయి
    ఈ హీరో ల కి హీరో వర్షిప్ నిలబెట్టుకోడానికి,
    మువీ మొగల్స్ సామ్రాజ్యం నిలుపుకోడానికి
    ఎన్ని సవాల్నైనా భుజాలకెత్తుకోని తిరుగుతారు
    అసలు వాల్లు మీడియాని బహిష్కరించడం కాదు సినిమాల్నే జనాలు బహిష్కరించాలి
    ముఖ్యంగా వారసుల సినిమాల్ని
    ఆ పేడిగాళ్ళని ఒదుల్చుకుంటే గాని
    సమాజం బాగుపడదు

  • కానీ శ్రీరెడ్డి అనకూడని మాటే అన్నది. ఆమె ఒక్కసారి మాతృదూషణ చేస్తే “మా అమ్మని ఆ మాట అంటుందా?” అంటూ జీరోగారు ఆ మాటని వందల సార్లు పునశ్చరణ చేసుకున్నాడు.

    ఆ ఒక్క చిన్న కారణాన్ని పెద్దగా చూపెట్టారు. మాతృభక్తి కాదు తొక్కా కాదు. కుంజర యోజమూ, కుత్తుక జొచ్చెన్ – అనేదాన్ని నిజం చేస్తూ, ఆ ఒక్క చిన్ని అవకాశం లోకి అవకాశవాదులందరూ దూరిపోయి ఉద్యమం అనుకొన్న దానిని ఉఫ్ అని ఊదేశారు.

  • కానీ శ్రీరెడ్డి అనకూడని మాటే అన్నది. ఆమె ఒక్కసారి మాతృదూషణ చేస్తే “మా అమ్మని ఆ మాట అంటుందా?” అంటూ జీరోగారు ఆ మాటని వందల సార్లు పునశ్చరణ చేసుకున్నాడు.

    ఆ ఒక్క చిన్న కారణాన్ని పెద్దగా చూపెట్టారు. మాతృభక్తి కాదు తొక్కా కాదు. కుంజర యోజమూ, కుత్తుక జొచ్చెన్ – అనేదాన్ని నిజం చేస్తూ, ఆ ఒక్క చిన్ని అవకాశం లోకి అవకాశవాదులందరూ దూరిపోయి ఉద్యమం అనుకొన్న దానిని ఉఫ్ అని ఊదేశారు.
    గాయబ్! It’s gone

  • పోలీసులు,కోర్టులు అన్న జీరో స్టార్ అవ్వన్నీ తమ కాళ్ళకింద వున్నాయని తెలిసే మాట్లాడాడు.కార్మిక చట్టాలు ఎందుకు అమలుజరగడం లేదో ఎవరు మాట్లాడారు.సినిమారంగం అంటేనే ప్రయివేట్ సామ్రాజ్యం .ఇక్కడ డబ్బులకు అన్ని పలుకుతాయి.ప్రభుత్వం,నిర్మాతలు,మాఫియా కలిస్తేనే యి అరాచకాలు.అడ్డా మీద కూలీలే నయమనిపిస్తున్నారు.ఆర్థిక దోపిడీ,లయింగిక దోపిడీ అరికట్టే ప్రభుత్వం మాట్లాడం లేదు.ప్రభుత్వాన్ని వదిలేసి న్యాయం జరుగుతుందంటే ఎలా నమ్మడం?శ్రీరెడ్డి పచ్చిగా మాట్లాడడం బాధితులు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది.ఆర్యనాయకృష్ణ వ్యాసం కొత్త ఆలోచానలు కల్గిస్తోంది.

  • అరణ్య కృష్ణ మీరు శ్రీ లేవనెత్తిన అనేక సమస్యల కన్నా…ఆమెను చాలా అద్భుతంగా విశ్లేషణ చేసి బాగారాసారు.అందుకు కృతజ్ఞతలు..నిజానికి శ్రీరెడ్డి.. ఓ అమాయకురాలు..తళుకు బెళుకుల వెండితెరపై ఒకే ఒక్క చాన్స్ అంటూ..ఆ ఒక్క ఛాన్సుతో సినిమా తెరను ఏలవచ్చన్న అత్యాశతో అందరమ్మాయిల్లాగే సినిమా రంగానికి వచ్చింది..అనాదిగా స్త్రీలెప్పుడూ ఎవరో ఒకరి చేత రక్షించ బడాల్సిన వారే అన్న మనువాద కుట్రపూరిత దృక్పథంలో తర్ఫీదు పొందబడినవారే. శ్రీ కూడా అదే కోవకు చెందిన అమ్మాయి. అందు వలన…. సినిమా పెద్దల పుత్రరత్నాల అండను ఆశ్రయించింది..ఫలితంగా. …ఆమె అనేక విధాలుగా ఆ వ్యవస్థాలో మోసపోయింది…ఆమె జీవితం అప్పటికే అనేక మలుపులు తిరగటం వలన ఆమెలో సహనం చచ్చిపోయింది. అందరిలా వలవలా ఏడ్వకుండా…కొందరిలా మౌనంగా ఉండకుండా..చావో రేవో..తేల్చుకుందామని తన భవిష్యత్తును ఫణంగా పెట్టి బజారులో నిలబడి పబ్లిక్ గా ఒక్కొక్కరి బుతుపురాణ చిట్టాలని నిర్లజ్జగా విప్పి చూపింది.. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకొని తమలో ఉన్న తుప్పును వదిలించుకోకుండా ఒక్కొక్కరు తమ హావభావాలతో ఆ అమ్మాయికి అపవిత్రతను అంటగట్టి చేతులు దులుపుకొని మళ్లీ అదే కలుగులో దూరి తలుపులేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఈ సంఘటనను వీక్షించిన ప్రతిఒక్కరికీ తెలుసు…కాకపోతే ఆమె లేవనెత్తిన అనేక సమస్యలకు బాసటగా మేము ఇప్పటికీ ఆమె వెంటనే ఉన్నాం…..అందుకు సంధ్య లాంటి వారిపై కూడా pk ఫ్యాన్సు ట్రోలింగ్ చేయటం చాలా దురదృష్టకరం.

    • ఈ మొత్తం విషయంలో నా వ్యక్తిగత మిత్రులైన మీ అందరి పాత్ర నాకేంతో గర్వకారణం విజయా! స్ఫూర్తివంతమైన పోరాటం చేస్తున్నారు. సంధ్యలేని అరణ్యకృష్ణ లేడు. నా కవిత్వాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిత్వం తనది.

  • మీరు చెప్పినది అక్షరసత్యం తిరుగులేదు.. కాని మన సినిమా ???? %శాతం పెట్టుబడడి, రాబడి, తప్ప రామానాయుడు, రామారావు ల నుండి నేటి హీరోల వరకు ఎవరు ప్రజా కళాకారులు కాదు కేవలం వారి అబివృద్ది వారి సంపద వారి పిల్లలు,. NTR,. A. N. R., Ramana I’d, chiranjivi Krishna, పైకి ఎన్ని చెప్పినా సంపద వృద్ధి తప్ప వీరికి సమాజం మీద, సమాజాన్ని ఉద్దరించాలని ఎవడికి వుండదు. ముందుగా సమాజం మారకుండానే, సమాజంలోని అన్ని. భాదిత వర్గాలు (including మహిళలు) చైతన్యం రాకుండా, వీరంతఏకం కాకుండా ఇలాంటి మహిళలు బాధితులలే పాపం, మంచి విశ్లేషణ Sir, I support your opinion……

  • విశ్లేషణ చాలా బాగుంది సర్. చాలా చక్కగా వివరించారు.

  • డియర్ అరణ్య క్రిష్ణ గారు, మీరెంచుకున్న ఈ టాపిక్ తుప్పు పట్టిన వెండితెర.. “కాస్టింగ్
    కౌచ్..శ్రీరెడ్డి” మానవ మానసిక విశ్లేషణ కు సంబంధించినది.. ఇంచు మించు ఇదే విషయంపై రాసిన ”పాకుడు రాళ్లు”..రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చిపెట్టింది.మీ లోతైన విశ్లేషణ నన్నెప్పుడూ ఆలోచింపజేస్తుంది.
    “”ఇడిసినమ్మ..ఈదికి పెద్ద”…అన్నీ విడిచిపెట్టి బ్లాక్ మెయిలింగ్ కు దిగిన ఓ దిగజారిన, ప్రతిభ లేని ఓ అమ్మాయి గురించి.. అరణ్యకృష్ణ రాయడం ఏమిటి? అనుకుని..కాదు ఇందులో వేరే కోణం ఉంటుంది..చదివా!! Hats off to you!!.You always call a spade a spade!!..అనుకున్నట్లుగానే మీ విశ్లేషణ వ్యవస్థ పైన, మానవ సంబంధాల పైన.. చాలా చక్కగా రాశారు.మీలో ఒక లెఫ్టిస్ట్, ఒక ఫెమినిస్ట్ అన్నిటికీ మించి ఓ హ్యూమనిస్ట్ దాక్కొని ఉన్నారు… మిమ్నల్ని కూడా ఆఖరుకు ” రమణ మహర్షి”.ఆశ్రమంలో చూడలేమో!!(1976 లో చలం గారిని రమణ మహర్షి ఆశ్రమంలో నే చూసాను)
    Regards

    • మీ నిజాయితీతో కూడిన ప్రతిస్పందనకి ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ! నేనెప్పటికీ ఏ ఆశ్రమమూ వెళ్ళను. ఎందుకంటే ఆ రోజుల్లో చలం ఒంటరి. ఇప్పుడు నేనైతే కాదు. మీ వంటి వారున్నారుగా మద్దతుగా!

  • గుడ్ ఎనాలిసిస్. అరటి పండు వలిచి నట్టుగా చెప్పారు

  • అరణ్య కృష్ణ గారూ, మీ కోరికమీద మీ వ్యాసం చదివాను.

    నా అభిప్రాయాలు: ఏదైనా సమాజంలో హద్దులుమీరి, హక్కులు అణచి, మానవత్వంలోని హూందాతనాన్ని మట్టుపెట్టి ఎవరైనా మరొకరిని హింసిస్తే అల్లా బాధలు పెట్టీన వాళ్ళూ, బాధపడి భరించలేని స్థితిలోకి వచ్చి వీధిని బడి ఇవండి ఇక్కడి అత్యాచారాలు అని ఎలుగెత్తి చాటింపువేస్తే, గోతులదగ్గర నక్కల లాగా కాచుకూచున్న పత్రికల వాళ్ళు, చానళ్ళూ ఉబ్బి తబ్బిబ్బయిపోయి అబ్బ, దొరికిందయ్యా విషయం అని మాంసం ముక్కలకోసం కలియబడే కుక్కల్లాగా ఎగబడి పగలు రాత్రి మనల్ని ఊదరగొట్టేసి పబ్బంగడుపుకుంటూంటే ఇదేసమయంలో మనం ఏదన్నా రాస్తే మురికి కాలవలో వేసిన మరొకరాయి అవుతుంది.

    మరికొన్నిరోజులు పోయాక శ్రీరెడ్డిని జనం మర్చిపోతారు. ఆవిడ ఎవరిపేర్ల మీద దుమారాలు లేపుతోందో వాళ్ళు తమకున్న డబ్బు, దస్కం, అధికారం, వ్యామోహం, జనాలలో వాళ్ళూ నిర్మించుకుని భారత సంవిధానానికి అతీతంగా ఎదిగిన ఎదుగుతున్న అభిమానసంఘాలనే గూండారాజులు వేరే అంశాలమీదికి మనస్సు మళ్ళీంచేస్తారు. కధ కంచికె ళ్తుంది. మనం అప్పుడు ఇంటికి వెళ్ళకుండా ఏ ఒక్కవ్యక్తి భాధ్యులు కాని ఈ కుళ్ళూ వ్యవస్థమీద ఏ పక్షపాతమూ లేకుండా నిర్మోహంగా నిర్మొహమాటంగా సభ్య మైన పదజాలంతో మీరు చెప్పదలుచుకున్నది రాయండి. ఇప్పుడు నలుగురులో నారాయణ అనుకుంటూ ప్రతిస్పందిస్తే చదివేవాళ్ళు మర్చిపోయే అవకాశంవుంది. దుమారంలో అన్నీ కొట్టూకుపోతాయి. సద్దుమణిగాక గొంతు విప్పండి. ఫేస్ బుక్ లో కాదు. సారంగలో చదువరులందరు ఆలోచించి స్పందించి చోట ఏదైనా చెపితే ఉపయోగంకాని అందరూ గళ్ళమెత్తి గోల చేస్తుంటే ఎవరు వింటారు? ఎవరికి ప్రయోజనం? శ్రీరెడ్డి తన భవిష్యత్తుని పూర్తిగా ప్రశ్నార్థకం చేసేసుకుంది. పవన్ కల్యాణ్ రాజకీయ పరిఙ్జానం తక్కువ, ఫామేదాతనం లేదు అభిమాన సంఘాల మత్తులో వోట్ బాంకుల్ని కూడకట్టూకోవాలని కలలు కలలు కంటున్నాడు. ఈవ్వాళన్నమాట రేపనడు. ఆలోచిస్తే అతనిచ్చిన సలహా చెడ్డదికాదు. న్యాయవ్యవస్థ ద్వారా లేటయిన న్యాయం జరుగుతుంది. యాగీ జరిగితే మళ్ళి ఎవరు ముఖంచూస్తారు. వాళ్ళూ ఒక సంఘటిత శక్తిగా మారాలంటే ఈ చౌకబారు రాజకీయాలు, బ్లాక్ మైల్స్ మానేస్తే సర్వత్రా ప్రయోజనకారిగా వుంటూంది. అంత యాగీ అయింది కనుక కొన్నాళ్ళందరూ భయపడతారు. వాళ్ళనివాళ్ళే శుద్దీకరించుకునే చాన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే నేరపవృత్తితో అమ్మాయిలని వాడుకున్నారో వాళ్ళ గురించిన సమాచారం సినమా సంఘాలు కూడ బలుక్కుని రంగంనుంచి బహిష్కరించాలి.

    ఇవాన్నీ అవచ్చు అవకపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న రాద్దాంతం వల్ల మాత్రం ఏ ప్రయోజనం వుండదు. ఇదంతా మన సమ్మాజంలో జరిగే అత్యాచారాలపట్ల మన స్పందన్ గురించి. నేను దానిని సమర్థించను. వ్యతిరేకించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను

  • అరణ్యా – బాగా రాసావు – ముందుగా నీ శైలి నచ్చింది. ఇక తెలుగు సినిమా రంగం గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతం తెలుగు సినిమా సమాజాన్ని ప్రజల్నీ మర్చిపోయి ఎక్కడో అధఃపాతాళం లో కొట్టుమిట్టాడుతోంది. ఏ ఒక్క విలువకూ దానిలో స్థానం లేదు. పెద్ద హీరోల సినిమాలు మరీ అధ్వాన్నం. పెట్టుబడి లాభాలు స్క్రీన్ల సంఖ్యా సినిమాకు పెట్టిన వందల కోట్ల ఖర్చు మళ్ళీ ఎట్లా తిరిగి రాబట్టుకోవడం అనే దుగ్ద తప్ప మరొకటి లేదు. ఏ దేశంలో నైనా ఏ ప్రాంతమా లోనైనా సినిమా ఆ దేశ ప్రాంతాల కాలాన్ని చరిత్రను కొంచెమైనా ప్రతిఫలించాలి. ఒక దశాబ్దం లో వచ్చిన సినిమాలు చూస్తే ఆ చరిత్రను రికార్డ్ చేసేటట్టు ఉండాలి. ౧౯౭౦ ల తర్వాత తెలుగు సినిమా మరీ అధ్వాన్నమై పోయి చరిత్రనూ కాలాన్ని విలువలను మురిక్కాలవ లో కలిపేసింది. ఇక సినిమా పెట్టుబడి లో స్త్రీఅందచందాలు భాగమై వ్యాపారమై అందులో పురుషాధిక్యత విర్రవీగి స్త్రీలను విపరీతంగా అణచివేసినాయి. స్త్రీలు అందమైన మాంసపు ముద్దల్లా తప్ప వ్యక్తిత్వం ఉన్న పాత్రల్లా వచ్చిన సినిమాలు తెలుగులో చాల తక్కువ. ఇప్పుడైతే తెలుగు మాట్లాడే హీరోయిన్లే లేరు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితిని తెలుగు సినిమాకు తెచ్చిన హీరో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల ఆధిపత్య వ్యవస్థను వ్యతిరేకించి ధ్వంసం చేసి ప్రత్యామ్న్యాయ స్వతంత్ర వ్యవస్థను నిర్మిస్తే తప్ప మంచి సినిమాకు భవిష్యత్తు లేదు. అందుకు ఎట్లా చేసిన ఏమి చేసిన శ్రీ రెడ్డి ప్రయత్నం కొంతలో కొంతైన దోహదం చేస్తుందని ఆశ.

  • అయ్యా మీరు సామాజిక మార్పుకోసం అందులోనూ మహిళా స్వా బిమానం కోసం మీ కృషి కి పాదాభివందనం

  • జీరోల బాద్యతారాహిత్యాన్ని, దేవతా వస్త్రాల వెనుక నక్కిన పిరికిపందల మనస్తత్వాన్నీ భేషుగ్గా ఎండగట్టారు.
    ప్రతొక్కడికీ శ్రీరెడ్డి అశ్లీలతే కనిపిస్తుంది. వాడెంతయినా బూతు మాట్లాడొచ్చు గానీ, ఒక స్త్రీ మాట్లాడితే మాత్రం తట్టుకోలేడు. ఆమె మాట్లాడిన మాటల్నే పట్టుకొని ఆ మాటల్ అవెనుకాల ఆక్రోశాన్ని తొక్కిపెట్టేశారు.
    మరికొందరు గడుసువాళ్ళు..ఎక్కడ లేదు “పడకకు పని” అని సినిమా రంగంలో వ్యవస్థీకృతమైన అమానవీయ పరిస్థితిని పలుచన చేయ ప్రయత్నించారు.
    ఎవరెన్ని చెప్పినా, ఎంతగా ఈసడించినా.. శ్రీరెడ్డి ఓ విప్లవం. అనాదిగా నొక్కిపెట్టిన స్త్రీ గొంతు హటాత్తుగా విస్పోటించిన అగ్నిపర్వతం శ్రీరెడ్డి.

  • నా చిన్నప్పుడు స్కూలుకెల్తున్న దారిలో రైలు పట్టాలు దాటి వెళ్ళవలసి వస్తుండేది.ఓ రోజు పొద్దుట లంగడా ఆడపిల్ల బూతుల్తోతిడుతూ దారిన వెడుతున్న వాళ్ళందర్నీ దమ్మంటేరండి…అప్పుడదర్ధమవలేదు..
    శ్రీరెడ్డి ఉదంతం ఆ చిన్నప్పటి విషాదాన్ని గ్యాఁపకానికి తెచ్చింది…మీ రాత మళ్ళీ హ్రుదరాంతరాళ్ళని‌ కెలికింది..

  • నిజమే సీతాకోకచిలుకలు ఎప్పటికీ కాలేరు. వారిది గొంగళి పురుగు జీవనమే. ఎలా మెరుగుపరచాలో ఆలోంచించవలసిన విషయం…

  • మూవీ ఇండస్ట్రీ కూడా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అవ్వాలి. అప్పుడే ఈ గోల ఉండదు. మల్టి నేషనల్ కంపెనీలో ‘హాయ్ బేబీ’ అంటే ఫైర్ చేస్తారు, అలాంటిది మూవీ ఇండస్ట్రీ లో అడ్డు అదుపు ఉండదు. ఆ అడ్డు అదుపు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • యథాప్రకారం చక్కగా విశ్లేషించారు. నిజమే. I am fully with you in all aspects of this.

    -వాసు-

  • అరణ్యకృష్ణ గారు శ్రీరెడ్డి విషయంలో మొదటి నుండి మీ స్పందన చూస్తున్నాను ..”నీ గుడ్డలు విప్పుకోవడం కాదమ్మా వీళ్ళందరి గుడ్డలూ ఊడదియ్యాలి..” అన్నమీ వాఖ్య చదివి ఇదీ నిజం అనుకున్నాను.. ఇవ్వాళా మొత్తం పరిశ్రమ.. ఒక శ్రీరెడ్డి కొందరు బడాబాబుల చుట్టూ మీడియానల్లుకు పోయి ఉంది. కొన్నాళ్ళకు ఒక్కొక్కరు ఆమె నుండీ పక్కకు వెళ్ళిపోతారు. వార్త పాత బడుతుంది. బడాబాబులు మరింత మేకప్ వేసుకుని మరింత పడుచుపిల్లతో. అదీ ఇతర రాష్ట్రాల పిల్లతో సినిమాలు దున్నేస్తారు .. ఈ పిల్ల దిక్కులేని దానిలా అయిపోతుంది. ప్రస్తుత బూతు సినీ వర్గాన్ని కడిగేయ్యడానికి, నిలదీయడానికి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలా అవసరమే .. కానీ వాట్ నెక్స్ట్ .???. ఏమి జరగనుంది..? అసలీ పిల్లను బతకనిస్తారా ..? ఎన్నో ప్రశ్నలు ..

  • చాల చక్కటి వ్యాసం సర్. All the bigwigs of Industry have diluted the topic and digressed from her agitation . శ్రీ రెడ్డి ఆక్రోశం సినిమారణ్య రోదనం అయిపొయింది అనిపించింది

  • Dear AK,

    I appreciated your protest voice in support of
    Sree Reddy’s struggle from the inception. I have a
    deep sympathy towards her struggle. I understand
    that some positive moves from the HRC body and women organisations. As someone commented unionisation would address such issues for certain
    extent. You should leave Sree Reddy here.

    Need to look into bigger picture whilst analysing such issues with historical perspective. The issue of sexual exploitation in the film industry is complex. I do not think whether any outsiders have clue to address the the issue to resolve. Social attitudes, regulatory frame work, social awareness campaigns and training, cultural change among business houses will have positive impact. Who will work for this?

    Your agitational tone and approach inadvertently put you in a defence lawyer role. Your essay resembles an agitational leaflet. If you are writing a prose try to meditate to come out of ‘poetic mode’. However, this is the context to ask the writers and women fronts how much space and time writers and women orgs are allocating about the conditions of working class women?

  • బావుంది , కానీ ఎన్ని చురకలేసి ఏం లాభం ? దహించే సినిమాదీపం ఆకర్షణకి లాగబడి – మాడి మసయ్యే దేహాలే ఇక్కడ ఆ మహోజ్వల దీపానికి సమిధలు . అభి’మానుల’ దగ్గర నుంచి , మానం కొయ్యకి ఉరేసుకుంటున్న ఎర జీవుల వరకు అందరూ ఆ మసిబారిన గుడ్డిదీపపు దేదీప్యతలో తారల వెలుగులకు కేవలం చమురు ! మెజార్టీ మూర్ఖత్వంలో – మైనార్టీ హృదయాలు , అరుదైన సున్నితత్వాలు , సూటైన నిజాయితీలు అచ్చం ఇలానే వింత పదార్ధాలై వెలివేయబడతాయి !
    “ దాన్నెవడు పడుకోమన్నాడని ? “ అడిగే ఓ చపల యక్షుడి ప్రశ్నకి ఏం చెప్తే సమాధానం అవుతుంది ?
    యుగాల తుప్పుతో సెప్టిక్ పడ్డ సిక్డ్ మెదళ్ళకి ఎప్పటికి అర్ధం కావాలి ,ఈ మానాలు – అభిమానాలు .?
    అవెక్కడుంటాయి ఒంట్లో అంటే ఏ డిక్షన్లో బదులివ్వాలి ? వాడకస్వామ్యంలో “ఆడదాన్ని పక్కపైకి లాక్కోవడం , మగవాన్ని పక్కన తిప్పుకోవడం “ ప్రాధమిక సూత్రాలు ! కడిగేసుకున్న తరవాత ఆడైనా మగైనా ఆటలో అరటిపండే ! కానీ ఈ సారి ఆటలో ఈ అరటిపండు – చిరుగుల బట్టలపై , మెరుపుల కోటు వేసుకు తిరుగుతున్న వందేళ్ళ సినీ వైభవాన్ని బొక్కబోర్లా పడేసిన ఓ “ అరటితొక్క “ !

    తెల్లారే మెదన్ని తట్టి లేపిన మీ అక్షరానికి హగ్సు అన్న !

  • అరణ్య కృష్ణా.. చక్కని శైలి మీది.
    విషయాన్ని అన్ని కోణాలలోంచి చూసి సమగ్రంగా విశ్లేషించారు.

    కాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పిన విషయాలతో ఇంకా లోతుల్లోకి వెళ్లకుండా మధ్యలో అసలు విషయాన్ని వదిలి కొసరు విషయాలు తెరపైకి తేకపోతే ఎలా ఉండేది..?!
    సినిమావాళ్లతో పాటు రాజకీయాల్లోని పెద్దల రంగూ బయటపడేది. అందుకే తుస్సు మనిపించే ప్రయత్నం జరిగింది.
    ఏదేమైనా ఒక మార్పు కోసం ప్రయత్నం మొదలైంది. మీరూ అందులో భాగమైనందుకు అభినందనలు.

  • Aranya Krishna garu…
    Very good analysis sir????
    I was following this because women activists like Sajaya n all were involved in helping to solve the issue. Alas.. see the development…n the drama that followed..and the issue was buried .????
    But they were successful in getting sanction of CASH committee…!

  • Chaalaa sunisithanga ,suutigaa sprusimchaaru aa sensitive issue ni. Meeru raasimdi chaduvuthunte, oka kotha konaanni chusthunnattu anipinchindi. Srireddy issue ni nenu kuda adapa dadapa YouTube lo chuusthunna. Maanasikanga valuvalu vidihesthunna vaariki bhinnanga, bahiranganga cineeranga digajaarudu valuvalni vippataaniki saayasakthula krushichesindi. Mee ee article chadivaaka naaku srireddy pai gouravam kaligindi modatisaarigaa. Aranya Krishna garu Well said Andi

  • అరణ్యకృష్ణ గారి ఈ వ్యాసం మీ ద వచ్చిన ప్రతి విశ్లేషణా చదివాక ఒకటే అనిపించింది. ఇంతమందిలో అరణ్యకృష్ణ గారి అభిప్రాయాలపట్ల అంగీ కారాన్ని కొన్నిచోట్ల హర్షాతిరేకాన్ని వెలిబుచ్చారు కొందరు. ఫేస్ బుక్లో ఏమన్నా రాస్తే ఎన్ని లైకులొచ్చాయి అన్ని పొగడ్తలొచ్చాయి అని లెక్కపెట్టుకుంటే ఈ వ్యాసానికి సారంగలోను ఫేస్ బుక్ లోన్ చాలా మట్టుకు అంగీకారం వచ్చింది. అంటే ఈ రచయిత జనం మెచ్చిన రచయిత అనే కదా అర్థం.

    ఇందులో సినిమా రంగాన్ని సమాజాన్ని కుదిపేసిన ఒక సమస్యని గురించిన విస్తార ప్రస్తావన వుంది. దాని మీద రేగిన దుమారాలు, వాద వివాదాలు వున్నాయి. స్తీలపట్ల సినిమారంగంలో జరిగే అత్యాచారలపై ఘాటైన విమర్శలున్నాయి. నేనడిగేది ఒక ప్రశ్న. ఎనిమిదినెలల పాపనుంచీ ఎనభై ఏళ్ళ వయోవృద్దురాలి దాకా ఎవరిని వదలని దుష్ట సమాజంలో ఈ సినిమా ప్రపంచపు సంక్షోభం సముద్రంలో కాకి రెట్ట. ఈ దుమారం కొన్ని రాజకీయ వాసనలని కూడా అద్దుకుని మన దృష్టిలో వుండటానికి సర్వవిధాల ప్రయత్నం చేస్తోంది, మీడీయా సహకారం, చానెళ్ళ సంరంభం ఏరోజు కారోజు కొత్త మసాలతో మనముందుకు వస్తోంది. కొంచెం సద్దుమణుగుతోందేమోనని అని అనుమానంరాగానే చానెళ్ళు శ్రీ రెడ్డిదో మరో బాధిత మహిళదో లీక్ అనేది జారవిడుస్తున్నారు. ఙ్జానం తెలియని పసిపిల్లలు మంచి స్పర్శ, చెడు స్పర్శ అనే అవగాహనే లేని చిన్నారులు అమాయికంగా బలవుతున్నారు. దుర్మార్గం ఎక్కడలేదు? అధికారం, అహంకారం, ప్రతీకారం, దురభిమానం (భాషపట్ల, మతం పట్ల) ఇవన్నీ కారణాలే. అలాంటిది ఈ రంగంలోకి అమాయికమైన కలలోతోనే అవచ్చును, కానీ ఒక్క అనుభవంతో ఙ్జానమున్న వాళ్ళకి ఙ్జానోదయం అవాలికదా! షాక్ థెరపీ ఇచ్చే ఉద్దెశ్యంతో కానీ, ఉద్దెశ్యపూర్వకంగా కానీ ప్రతీకార వాంఛతో కానీ అల్లరి పెట్టాలనే వుద్దెశ్యంతో కానీ ఆక్రోషంతోగానీ, అవేదనతో కానీ అన్ని రోజులపాటు పత్రికలకీ చానెల్స్ కీ స్టేట్ మెంట్స్ ఇస్తూ ప్రజల మధ్య తన సమస్యని సజీవంగా వుంచే ప్రయత్నాలు చేసిందిశ్రిరెడ్డి, మెచ్చుకోవాలి ఆ ధైర్యానికి. ఆమెకి తర్వాత తర్వాత చాలా సానుభూతి లభించింది.
    ఆవిడ జరిగిన అన్యాయాలకి సానుభూతి లేదని కాదు, ఆఅమ్మాయి ఎన్నుకున్నమార్గం కరెక్ట్ కాదనిపిస్తుంది. చివరికి సాధించిందేమిటి? అందరూ మర్చిపోతారు మరో శ్రీరెడ్డి మరో సంచలనం సృష్ట్టించేదాకా ఆగుతామా! ఏదైనా కార్యాచరణ వుండాలని సినిమా పరిశ్రమకి ఇలాంటి చీడపురుగుల్ని ఏరెయ్యడానికి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘం వాళ్ళు పోలిసు కంప్లైన్ట్ ఇస్తే కోర్టులు సహకరిస్తాయి చట్టబద్దంగా అమ్మయికంగానో ఆశలతోనో కలలతోనో వచ్చి వ్యూహంలో చిక్కడిపోతున్న వాళ్ళకి రక్షణ లభించాలి. అందరూ శ్రీరెడ్డిలు కాదు. నిశ్శబ్దంగా అనుభవించి పరాభవాన్ని పరాజయాల్ని ఎదుర్కొని జీవితాన్ని ముగించుకునే వాళ్ళు వున్నారు.
    దీనిమీద రచయితలు దృష్టిపెడితే కొంత మార్పుకు దోహదమవుతుంది. ప్రివెంటివ్ మెజర్స్ అలోచించాలి అనేదే నాకోరిక. అమ్మాయిలకి కూడా అవగాహన వుండాలి. మాకివన్నీ తెలీదు అనుకోవడం అఙ్జానమేకాదు. అసందర్భంగూడా. పేపర్లు చదివనా వార్తలు చూసినా తెలియని విషయమేమిటి ఈ రోజుల్లో!కల్లూరి Syamala

  • అరణ్య కృష్ణ ారు మీాసం చదివాను శ్రీ రెడి చేసిన పోరాటపు ఆవశ్యకతను చాలా సూటిగా చక్కగా వివరించారు క్తిని కతి తోనే ోాలన్న్లు సిొిలిన వ్యవస్థలకు సిగ్గొదిలిన పోరాటాలే చేయాలనుకుంటా..మీవిశ్లేషణ అద్భుతంగా ఉందనిచెబుతూనే దురదృష్టం ఏమిటంటే ఆమె బట్టలు విప్పుకున్నా వాళ్ళు స్పందించలా తెలివిగా వాల్లబండరాలు బయట కొన్ని పెట్టేసరికి మిగతావాళ్లకు చెమటలు పట్టాయి దానితో దిగివచ్చారు ఏది ఏమైనా ఈరోజు క్యాష్ కమిటి ఏర్పడటానికి అదే కారణమయ్యింది ఈ వాస్తవం ఎవరు కాదనలేరు కానీ భాష సంస్కారం విషయంలో అది ఎవరు విధ్వంసానికి పాల్పడ్డా ఖచ్చితంగా తప్పే మాలాంటి వాళ్ళం అప్పుడు చీదరించుకున్నాం ఇప్పుడు వేదన పడ్డాము తన హక్కులు సాధించుకొనేవరకు పరవాలేదు తరువాత ఒక్క పవన్ కళ్యాణ్ తల్లి విషయమే కాదు అన్నివిధాలా ఆ అమ్మాయి హద్దు మీరు ప్రవర్తించింది అది అతిగా ఉంది ఆమెను ఆ విషయంలోనే ప్రజానీకం వొప్పుకోలేకపోయారు ఏదిఏమైనా కొన్ని పీడిత బాధిత గళాలు విచ్చుకొనేందుకు ఆమె పోరాటం దోహదపడింది అనడంలో సందేహంలేదు మీరన్నట్లు రాజకీయాల్లో ఉద్యోగాల్లో అన్నింటా ఇది వేళ్ళూనుకొంటోంది .కాలం వీటిపై ఏ కత్తులు నూరుతుందో ? నూరితే ఎదురుచూసే వాళ్లలో నేనొకదాన్ని మంచి విశ్లేషణాత్మకమైన స్త్రీవాద మద్దతు వ్యాసంగానే దీన్ని భావిస్తున్నా

    • తప్పులు దొర్లినందుకు మన్నించగలరు

  • అయ్యా, చక్కగా విశ్లేషించారు. విషాదం ఎక్కడంటే అత్యంత ప్రజాదరణ గల సినిమా/ టీవీ చేస్తున్న దేమిటంటే చెప్పేది శ్రీరంగనీతులు, చేసేవి దొమ్మరిపనులు, దోపిడి, స్త్రీల అంగాంగప్రదర్శన సినిమాల్లో, వాళ్ళశరీరాలను వాడుకొని వదిలెయ్యడం.. మనం సినిమాలను బహిష్కరించాలి….జరుగుతున్న అన్యాయాన్ని విరోధించడానికి యిది జరిగితే ఈవ్యాపారస్తులకు భయం మొదలవుతుంది…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు