ఉప్పు నీటి స్వప్నం

రిగిపోయిన ఓ స్వప్నం తిరిగివచ్చింది,
ముక్కలైన మనసుతో, అనేక ప్రతిబింబాలతో.
మానని గాయాలతో నింగికేసి చూస్తుంది,
మనోఫలకంపై –
మరో స్వప్నం పురుడు పోసుకుంటుంది.****వెన్నెముద్దల మబ్బులు వెండి రేఖలతో మెరిసె,
కుంకుమవర్ణపు సూర్యుడు, పడమటి మొయిలు కప్పుకున్నాడు.
నీలి రంగుల ఛాయల ఆకాశం,
మెల్లగా దట్టమైన మేఘాలతో చీకటి.

*****

వెన్నెలలద్దుకున్న అలలు, రాగమై తీరం చేరె,
నింగిలోని చుక్కలు నీళ్లపై తేలి ఆడే.
ఇసుకతేనెల మనసు, నీటి పాటకి ఒరుసుకుంటుంది,
కలలు కన్న రెప్పల కింద, ఉప్పు నీరు ఉబికి పారుతుంది.

*

బాలు వాకదాని

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు