1.బర్రెపై వాలింది
కొంగ
బందిపోటు వలె
2.జీవితాన్ని
జీతం ధరలెప్పుడు
కొలుస్తూనే ఉంటాయి
3.ఆనందం
ఆదివారం బిర్యానీలో ఉందనుకుంది
ఆధునిక జీవితం
4.పళ్లెంలో రూపాయి
పిల్లోడిలా అల్లరి చేస్తూ
వెక్కిరిస్తుంది
5.అందరూ మంచోళ్లే అని నమ్మి
సంతలో అమ్ముడుపోయింది
గొర్రె
6.దారి తెలియక
ట్రాఫిక్ గుంతలో ఇరుక్కుపోయింది
నగరంలో వాన
7.ఆరిపోయిన దీపం మీద
వెలుగుతున్న దీపమే
మరణం
8.ముసురు వాన
జ్ఞాపకాల తడిలో
మునిగిపోయింది కాగితం పడవ
*








హైకూలు చాలా బాగున్నాయి. అభినందనలు.
బావున్నాయి