వెంకటేశ్ పువ్వాడ కవిత హిందీలో …

ఈ పూలకి ముందే తెలుసు
~~~~~

అతి జుగుప్సాకరమగు ఇదే నేల మీద
అతి సుందరమగు ఇదే నేల మీద
ఎన్ని చితిమంటల్ని కలగంటే గాని,
ఎన్ని విధ్వంసాల్ని ఊహిస్తే గాని
ఈ పూలు ఇంత త్వరగా నేల రాలగలవు

ఈ పూలకు ముందే తెలుసు

నిన్నలా ఈ నది కనబడదని
ఎగువన యుద్ధాలు జరిగే దేశాల రక్తాన్ని కలుపుకుని ఎర్రగా ప్రవహిస్తుందని

కమ్మిన కారు పొగలతో అసహ్యంగా మబ్బులు ఆకాశానికి గూళ్లు కడతాయని

నిప్పు శకలాలు తగిలి తెగిన కాళ్ళతో పక్షులు ఎగురుతాయని

మిస్సైళ్ళు ముద్దాడిన పసికందుల ఆర్తనాదాలతో గాలి ఘోష పెడుతుందని

భస్మీపటలమగు సౌధాల శిధిలాల కింద కుప్పల కుప్పల శవాలతో భవనాలన్నీ మహాసమాధులై కనిపిస్తాయని

గాయాలై మిగిలిన క్షతగాత్రుల అనాథ శోకాలు
ఈ పూలకి ముందే తెలుసు

యుద్ధమొక దీర్ఘ దుఃఖం – రక్తం దాని దాహం

విస్ఫోటనం ఒకటే కానీ దాని విధ్వంసం విస్తరిస్తుంది

కాలాల్ని కాల్చి రుధిర ఋతుఒక్కటే పరిమళిస్తుంది
రాత్రి పగళ్లను ఆ కార్చిచ్చు ఆక్రమిస్తుంది

ఈ రక్తపు కళ్ళాపి ఏ కాంతి శాంతుల్ని అలకగలదు వినాశనాన్ని తప్ప

యుద్ధాధినేతలంతా
భవిష్యత్తు స్మశానాలుగా మిగిలిపోయే మహానగరాలకి

కాపలా కుక్కలుగా మిగిలిపోతారు

దహనం కాబోయే ఆధునిక మానవ చరితంతా అణుబాంబుదే సాక్షి సంతకం

ఈ పూలకి ముందే తెలుసు
అందుకే కాబోలు త్వరగా రాలి పోవడం – మౌన నిరసన అని అనుకోవచ్చు.

తెలుగు మూలం – వెంకటేశ్ పువ్వాడ

కవి పరిచయం:

నా పేరు వెంకటేష్ పువ్వాడ, మాది కనిగిరి ఉమ్మడి ప్రకాశం జిల్లా. ప్రస్తుతం బెంగుళూర్ లో ఉంటున్నాను. రచన ఊహ తెలిసినప్పటినుండి సహజంగా రాస్తున్నాను. ఎక్కువగా సామాజిక అంశాలపై స్పందించి రాస్తుంటాను. ఇంకా సంకలనం తీసుకురాలేదు. ప్రయత్నంలో ఉంది.

 

इन फूलों को पहले से ही पता ~~~~~~ था
~

अत्यंत जुगुप्सा भरी इस धरती पर
निहायत खूबसूरत इसी सर जमीं पर
इन फूलों ने कितनी चिताओं की लपटों के सपने देखें हों!

कितने विध्वंसों को अपने विचार में लाये हों!

यही वज़ह होगी कि ये इतनी जल्दी जमीं पर झड़ जाते होंगे!

इन फूलों को पहले से ही पता था
कि
यह नदी कल की तरह दिखाई देती नहीं
क्यों कि यह
ऊपर घमासान लड़ाई में लगे मुल्कों के खून की लालिमा लिये लाल – लाल बहनेवाली है

घुमड़े काले धुआँ से गंदले बादल आसमां में अपना आशियां बनाने वाले हैं

अंगारों से टकराकर कटे पाँव लेकर परिंदे उड़ान भरने वाले हैं

मिसाइलों के चूमे बाल गोपालों के हाहाकारों से हवा हहरानिवाली है

जलकर राख बनी इमारतों के खंडहरों तले ढेर बनते मुर्दों के मारे सारे सौध महा समाधियाँ बनकर दिखनेवाले हैं।

आहत शेष क्षतगात्रों के अनाथ आक्रोश
ये फूल पहले से ही सुन लेते हैं।

युद्ध एक लम्बा दुखड़ा होता है युद्ध खून का प्यासा होता है

विस्फोट तो एक बारगी होता है प्रत्युत, उसका विनाश दूर – दूर तक फैल जाता है
वक्त – काल को जलाकर रुधिर ऋतु ही सुरभिल होती है
उसका भभक दिन रातों का कब्जा कर लेता है

खून की यह चौक पुराई किन शांति कान्तियों की रंगी पुताई कर पाती है , सिवाय विनाश के!

ये सारे सिपहसालार भावी श्मशान बनकर रह जानेवाले महानगरों के रखवाले कुत्ते बने रहेंगे

दंदह्यमान होनेवाले अर्वाचीन मानव इतिहास के ,अणु बम ही साक्षी हस्ताक्षर बनने जा रहे हैं

इन फूलों को पहले से ही पता था
शायद इसी लिए जल्दी झड़ जाते होंगे – मान लें कि यही उनका मूक आक्रोश हो!

हिंदीकरण – डॉक्टर गणेश राम अनुवेदी

 

గణేశ్ రామ్ అనువేది

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.