యివాళ్టి నా పేరు షమ్స్ తబ్రీజ్ అన్సారీ

1
యివాళ్టికి నా పేరు షమ్స్ తబ్రీజ్ అన్సారీ.
 
మీ ఆటలో వోడిపోయిన నా శరీరానికి ఆ పేరే యెందుకు వుందో నాకు తెలీదు. మీరందరూ మారణాయుధాలై నా మీదికి పరిగెత్తుకు వస్తున్నప్పుడు యే దేవుడిని యే పేరుతో తలచుకున్నానో కూడా నాకు తెలీదు. దేవుడు స్త్రీ అయితే అమ్మలానో, పురుషుడైతే నాన్నలానో వుండాలని మాత్రమే నాకు తెలుసు.
 
మీ అందరిలానే నేనూ వాళ్ళ కన్నీళ్ళ పొత్తిళ్లలోనే పెరిగాను. నా చెట్టు మీంచి వొక్కో కలా నిరాశపడి, వున్న పళాన యెండిపోయి రాలిపోతున్నప్పుడు తన గరుకు చేతుల్లో పొదివిపట్టుకొని, నాలో పచ్చదనం వొంపాలని ఆశపడ్డ నాన్నే నా దేవుడు. అంతకుమించి యింకే దేవుడూ, యే దేవతా, యే విగ్రహమూ, యే గుడీ మసీదూ నాకు తెలీదు. యివాళ్టికి నా యింటిపేరు కూడా నా అమ్మానాన్నల మొదటి పేరే కావాలి.
 
2
 
కన్నపేగుల మీద యెవరి అధికారం యెంతో యింతవరకూ నాకెవ్వరూ చెప్పలేదు.
 
ఆస్పత్రి గోడల మధ్య పెల్లుబికిన నా చివరికేకల మంటల్లో ఆ కన్నపేగుల సమిధలన్నీ కళ్ళారా చూశాను. అమ్మా, నన్ను కన్నందుకు నీ పశ్చాత్తాపాలు విన్నాను. నాన్నా, నువ్వు మోసుకు తిరిగిన శరీరం చావు మూలుగులు నీకే వినపడుతున్నందుకు నీ రహస్యమైన ఏడుపులు చూశాను.
 
నన్ను కడిగేటప్పుడు నా గాయాలు నా నెత్తురూ కనిపించకుండా నా పైన యింకో చర్మం కప్పగలరా?
 
3
 
మొన్నటి నా పేరు కంచికచర్ల కొటేశు.
 
నిన్న అఖ్లాక్.
 
యివాళ
షమ్స్ తబ్రీజ్ అన్సారీ .
 
1947 లో నా పేరు నీకు గుర్తుందా?
 
1992 …2002 …
 
ఆ తరవాత ఆ సంవత్సరాలన్నీ once more లు కొట్టించుకుంటున్న నా కాలంలో
 
అవి సంవత్సరాలో కుప్పకూలుతున్న వేల అన్సారీలో తెలియని ఆకాలంలో
 
కేవలం
సమాధి రాళ్ళ మీద మాత్రమే కనిపించడానికి పుట్టిన
యివాల్టి యీ పేరొక్కటే
 
నేను
నిరాకరిస్తున్నా.
 
యివాళ
 
జైశ్రీరామ్ అనిపించగలరు వేల గొంతులతో.
వొక్క శరీరంలో గుక్కెడు ప్రాణం పోయగలరా,
 
దయచేసి చెప్పండి
అనేక అన్సారీలు నడివీధుల్లో శవాలు కాకముందే!
 
*

అఫ్సర్

15 comments

Leave a Reply to Swapna Peri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మమ్మల్ని, క్షమించు అన్సారీ, వీలుంటే, మా బుద్ధిహీనత ను,శపించు.. నీలాంటి వాడిని, కాపాడుకోవడం,మాకు, శక్తి కి మించినపనీ అవుతున్నది ప్రతీసారి..!😢

  • మమ్మల్నిక్షమించు, అన్సారీ, వీలుంటే, ..మా బుద్ధి హీనతను శపించు. నీలాంటి వాడిని, కాపాడు కోవడం,మాకు శక్తీ కి మించిన పనీ అవుతున్నదీ!ప్రతిసారి..😢

  • మమ్మల్నిక్షమించు, అన్సారీ, వీలుంటే, ..మా బుద్ధి హీనతను శపించు. నీలాంటి వాడిని, కాపాడు కోవడం,మాకు శక్తీ కి మించిన పనీ అవుతున్నదీ!ప్రతిసారి..😢

  • నేను
    నిరాకరిస్తున్నా.
    ఉన్మాదుల దాడుల్లో
    కంచికచర్ల కొటేశులు, అఖ్లాక్ లు
    అన్సారీలు నడివీధుల్లో శవాలు కావటాన్ని.

    రాజ్యాంగము ( Constitution of India ) ద్వారా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర స్వతంత్ర రాజ్యంగా నిర్దేశించుకున్న ( constitutes Indina into a Sovereign, Socialist, Secular , Democratic Republic. It secures justice, liberty, equality to all the citizens of India and promotes fraternity among the people ) …. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని ఆదేశించుకున్న మాతౄభూమి భారతదేశంలో ఇలాంటి ఉన్మాద దాడుల్ని నిరాకరిస్తున్నా.

    Tabrez Ansari (22), was lynched to death by a mob in Saraikela, Jharkhand on the suspicion of theft. He was the 18th victim of mob violence in Jharkhand state in the past three years. These incidents were triggered by a variety of factors ranging from suspicion of cattle slaughter, theft, and child-lifting rumours.

    Tabrez Ansari was assaulted by the villagers for allegedly stealing a bike and forced him to chant ‘Jai Shri Ram’ and ‘Jai Hanuman’ by mercilessly beating him for hours. He died in hospital four days later. The police had said that Ansari was tied to a pole and beaten up with sticks through the night.

    Harpal Singh Thapar chief patron of Mother Teresa Welfare Trust (MTWT) lodged a complaint with the National Human Rights Commission (NHRC) accusing jail authorities, police, jail doctor and doctors at Seraikela Sadar Hospital of gross negligence and dereliction of duty in handling Tabrez Ansari.

    “ This is the pattern with almost all lynchings. First, a Muslim is murdered by cow lovers. Then the most ridiculous excuses begin: a ‘suspicion’ of beef possession, theft, smuggling & love jihad “ ~ Asaduddin Owaisi, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief and Member of Parliament Lok Sabha ( Hyderabad Constituency ).

    The Hon’ble Prime Minister Narendra Modi, in the Lok Sabha on Wednesday, condemned the death of a young man (Tabrez Ansari) at the hands of a mob in Saraikela, Jharkhand, and said he was very sad to hear it.

  • “There is neither Hindu nor Muslim, but only man as the embodiment of the Divine!”

    ~ Ameer Khusro, Sufi poet

  • I happened to read about Faizu and his team’s ban yesterday night. Then I have come to know about Tabrez Ansari. And today by coincidence read the poem.

    Sorry kakunda emi cheppaleni sthithi.

    Very insightful poem andi

  • ‘అవి సంవత్సరాలో కుప్పకూలుతున్న వేల అన్సారీలో తెలియని ఆకాలంలో’

  • జైశ్రీరామ్ అనిపించగలరు వేల గొంతులతో.
    వొక్క శరీరంలో గుక్కెడు ప్రాణం పోయగలరా,

    దయచేసి చెప్పండి
    అనేక అన్సారీలు నడివీధుల్లో శవాలు కాకముందే! పచ్చి నిజం రాశారు అఫ్సర్ గారు . మొన్నటి కంచికర్ల కొటేష్ నుంచి ఇవాల్టి అన్సారీల దాకా ఎంతమంది ఈ దరిద్రమయిన మత – కుల వివక్షణ రాజకీయాల్లో ఎంతమంది బలవ్వాలో ……

  • దయచేసి చెప్పించండి
    అన్సారీలెందరో
    నడివీధుల్లో శవాలు కాకముందే!

  • జైశ్రీరామ్ అనిపించగలరు వేల గొంతులతో.
    వొక్క శరీరంలో గుక్కెడు ప్రాణం పోయగలరా,.. no words sir 👌👌 ఈ ఒక్క లైన్ చాలు

  • Very touching emmotion. You said it rightly all those unfortunate lynched people are either dalits are Muslims

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు