బతుకును ‘పరిపూర్ణం’ చేసుకున్న మనిషి

చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తి డిప్రెషన్ లోనికి వెళ్ళేవాళ్ళకీ, ఆమె జీవిత కథ “వెలుగు దారులలో ….” ఓ చక్కటి మందు.

వీడియో ఇంటర్వ్యూ – 1

ఎనభై ఆరేళ్లు నిండాయి.  జ్ఞాపకాలు జారిపోలేదు.  గొంతు జీర పోలేదు.  జీవితం మీద ఫిర్యాదులు లేవు.  ఏ  కమ్యూనిష్ట్ సిద్ధాంతాలనైతే ఆవిడ నమ్ముకున్నారో అవి ఎన్ని కష్టాలొచ్చినా వంగిపోకుండా నిలబెట్టాయి.  అందుకే ఈ వయసులో కూడా ఆవిడ నిటారుగానే ఉన్నారు.  ఆవిడే నంబూరి పరిపూర్ణ.

మాలదాస కుటుంబంలో పుట్టి, నాటక సంగీత జ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అన్న గారి కమ్యూనిష్ట్ భావాలతో ప్రభావితమయ్యారు.  ఆ రోజుల్లో హీరో లాంటి ఒక కమ్యూనిష్ట్ నాయకుడు ఇష్టపడ్డానంటే నిజమని నమ్మి కాపురం చేశారు.  సమాజోధ్ధారణ ముందు సంసార బాధ్యతలు తుచ్ఛమైనవని ఆ మహానాయకుడు తెంచుకు వెళ్లిపోతే చాలీ చాలని జీతంతో  ఏం కష్టాలు పడ్డారో యేమో సమాజానికి తెలియనివ్వలేదు.  పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దడమే కాకుండా, వృత్తిరీత్యా  తాను కలుసుకున్న ఎంతో మంది ఆడవాళ్ళు  తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఆలంబనగా నిల్చి, సంసారాన్నైనా, సమాజాన్నైనా నిల్పడానికి నిబద్ధత ముఖ్యమని నిరూపించారు.

చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తి డిప్రెషన్ లోనికి వెళ్ళే వాళ్ళకీ, ఆత్మ హత్యా ఆలోచన్లు చేసుకొనే వాళ్ళకీ ఈవిడ జీవిత కథ “వెలుగు దారులలో ….” ఓ చక్కటి మందు. పరిపూర్ణ గారి జీవితం గురించిన మరిన్ని ముచ్చట్లు ఆవిడ మాటల్లోనే విందాం :

( మరో రెండు భాగాల వీడియోలు వచ్చే సంచికల్లో …)

'ఛాయ' మోహన్ బాబు

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఈ చారిత్రిక వివరాలు ఉన్న ఇంటర్వ్యూ… గొప్ప విలువైనది…ప్రపంచయుద్ధం, దర్శి చెంచయ్య , జాషువా, ౧౯౩౮- ౪౬ నాటి విషయాలను ఇంట వివరంగా చెప్పే మనిషి …సారంగకు, ఛాయా మోహన్ గారికి అభినందనలు

 • తన మాటతో పాటతో స్పష్టమైన ఉచ్చారణతో మంచి వ్యక్తీకరణతో గొప్ప భాషాపాటవంతో చెదరని ఉత్సాహంతో చెరగని చిరునవ్వుతో భేషజం లేని హుందాతనంతో పరిపూర్ణమైన జీవితానుభవంతో కట్టిపడేసిన అమ్మకు అభివాదాలు. అపురూపమైన సంభాషణకు తెర తీసిన ఛాయ కృష్ణ మోహన్ బాబుకు అభినందనలు.

 • దరిశి చెంచయ్య (‘నేనూ-నాదేశం’), రజనీకాంతరావు, సి. పుల్లయ్య….మహామహులు, మహానుభావులు. స్వాతంత్ర్యోద్యమ కాలపు ఆదర్శవాదం, రెండో ప్రపంచ యుద్ధం, రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఉద్యమ తొలిదినాలు, ఆనాడు స్కూళ్లల్లో ఉండిన నిబద్ధత…. …తెలుగు సినిమా పరిశ్రమ….

  పరిపూర్ణ గారితో ఇంటర్వ్యూ జరిపి ఆ రోజుల్ని, సందర్భాల్ని నమోదుచేసి నేటితరానికి అందజేసిన ‘ఛాయ’ మోహన్ బాబుగారికి అభినందనలు, ధన్యవాదాలు. ఆమె నిరాడంబరత్వం, పదసంపద, ఉచ్ఛారణ, వాక్సుద్ధి ఇవన్నీ కూడా ఇప్పటి తరాలకు ఆదర్శప్రాయమే.

 • ” సమాజోధ్ధారణ ముందు సంసార బాధ్యతలు తుచ్ఛమైనవని ఆ మహానాయకుడు ( కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు ) తెంచుకు వెళ్లిపోతే చాలీ చాలని జీతంతో ఏం కష్టాలు పడ్డారో యేమో సమాజానికి తెలియనివ్వలేదు ” పరిపూర్ణ అమ్మకు కన్నీళ్లతో క్షమార్పణలు చెప్పాలనిపిస్తుంది నాకెందుకో.

  ” నిర్జన వారధి ” ద్వారా తన జీవిత కష్టాలను చెప్పిన కొండపల్లి కోటేశ్వరమ్మ ( కొండపల్లి సీతారామయ్య గారి ) గారిని తలచుకున్నా ఉద్వేగభరితమవుతాము. కామ్రేడ్ కె.ఎస్. గురించి ఆయమ్మ ఏం చెప్పారో అని ఉత్సుకతో పుస్తకం తెప్పించుకుని చదివారు రెడ్ బిక్కూ త్రిపుర గారు.

  ఉద్యమంతో మమేకం అయిన గద్దరన్న గారి శ్రీమతి, విమలక్క తన రెక్కల కష్టంతో పిల్లల్ని సంసారాన్ని ఎక్క దీసుకొచ్చిన వివరాలు తలచుకున్నా నేరభావంతో కూడిన అదే భావోద్వేగం.

  ఉద్యమాల నేపథ్యంలో అమ్మతల్లులు అనుభవించిన వేదన, ఆత్మస్థైర్యం తో లక్ష్యాన్ని చేరేవరకు అలుపెరగకుండా శ్రమించిన తత్వం గురించి ప్రస్తావించరా త్రిపుర గారి ఉణుదుర్తి సుధాకర్ గారూ.

 • చక్కటి పరిచయం. అదృష్టం కొద్దీ వినగలము ఇటువంటి మాటలు.

 • మాలదాస కాదు మాలదాసరి..సార్

  మంచి ఇంటర్వ్యూ…

  సమాచారం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు