

నీ గల్లపెట్టెక్కడో
అప్పగించుకోడానికి
నేనెప్పుడూ వెనకాడలేదు_
నీ గల్లపెట్టెక్కడో
యింకా కనిపించలేదు!
2
నువ్వు నవ్వితే
నువ్వు నవ్వితే_
హరివిల్లు
విరబూస్తుంది
మేఘమాల
అల్లరివాన
కురిపిస్తుంది
పంచభూతాలు
బృందగానం
అందుకుంటాయి
పంచప్రాణాలు
పండగల్లో
మునిగితేలతాయి
*








చిన్న పదాలతో మంచి భావాలను పలికిస్తున్నారు