నీలోని ప్రపంచాల జాడ సాహిత్యం: నవీన్

మనిషిని మనిషిగా గుర్తించడానికి తోడ్పడాలి సాహిత్యం.

 పేరు:నవీన్ కుమార్

ఊరు: కదిరి, అనంతపురం జిల్లా.

చదువు:ఎమ్మెస్సి.

ఉద్యోగం: Food Corporation of India  లో టెక్నికల్ అసిస్టెంట్

వ్యాపకాలు:చదవడం , రాయడం, పాటలు వినడం, పాడడం .

*

చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందుబాటులో ఉండటం వల్ల  మీకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిందా?

లేదు.మా స్కూల్లోగాని,ఇంటర్మీడియట్ కాలేజిలోగాని గ్రంధాలయం అందుబాటులో లేదు.సబ్జెక్టు పుస్తకాలు గాకుండా వేరే పుస్తకాలు ఉంటాయనిగాని, వాటిని చదవమనిగాని నాకు ఏ టీచరు చెప్పలేదు.అనంతపురం సెకండ్ హ్యండ్ బుక్ మార్కెట్లో కొని చదివిన మొదటి పుస్తకం “విశ్వంభర”.అది కూడా డిగ్రీ అయినతర్వాత.

 ఎప్పటినుంచి రాస్తున్నారు? రాయటానికి ప్రేరకం ఏమిటి? 

emotion ని దాచుకోలేనితనం దారులు వెతుక్కుంటుంది. నాకు కవిత్వం దొరికింది. మనిషికి తప్ప సృష్టిలో  మరే ఇతర జీవికి లేనిది ఊహాశక్తి. ఇన్నేళ్ళ ప్రస్థానంలో మనిషి నిర్మించుకున్నది కళ. మనిషిని నడిపిస్తున్నది ఎమోషన్. మూడు కలిస్తే కవిత్వం. జీవితం .

 సాహిత్యం ఎలాంటి ప్రశ్నలు రేకిత్తించింది? ఎలాంటి సమాధానాలు ఇచ్చింది?

చాలా ప్రశ్నలు వేస్తొంది సాహిత్యం. “నీలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి?” అని అడుగుతోంది.’ఎంతకాలం ఇక్కదే ఉంటావు?” అని అడుగుతోంది.”నువ్వెట్లా అధికుడవో చెప్పు” అని అడుగుతోంది. “పెదవులకూ, చేతులకూ మధ్య అంత దూరం ఎందుకుంటుంది?” అని అడుగుతోంది.నీలో ప్రశ్నలెందుకు పుట్టవు అని అడుగుతుంది. “ఒక మనిషిని ఎంత లోతుగా చూడగలవు?” అని అడుగుతోంది. చిత్రంగా సమాధానాలు కూడా సాహిత్యమే ఇస్తోంది….. నేను వెతుకుతున్నానంతే.

 తెలుగు సాహిత్యానికి , ప్రపంచ సాహిత్యానికి మధ్య గమనించిన తేడా?     

ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లోంచి ఇంగ్లీషులోకి అనువాదమయిన సాహిత్యమూ చదువుతున్నాను. సమకాలీన తెలుగు సాహిత్యంలో కంటే ప్రపంచ సాహిత్యమూ, ఇతర భారతీయ భాషా సాహిత్యము కొంచెం నాణ్యముగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సాహిత్యం అంటే నా దృష్టిలో ఒరిజినాలిటి. సాహిత్యం తప్ప మరే విషయాలు కనిపించకపోవడం .

 మానవ జీవన గమనానికి సాహిత్యం ఎలాంటి ఇంధనం ఇచ్చిందనుకుంటున్నారు?

ఇంతపెద్ద వాఖ్యానం చెయ్యలేనుగానీ, నా గమనానికి సరైన ఇంధనాన్ని ఇచ్చింది మాత్రం సాహిత్యం.దిశని మార్చగల ఇంధనం. గమ్యాన్ని మార్చగల ఇంధనం

 మీ దృష్టిలో   ఏది అత్యుత్తమ సాహిత్యం?

Parameters  పెట్టుకొని చదవడం ఇష్టం ఉండదు.నాలో నాకు తెలీని విషయాన్నీ గుర్తు చేసే సాహిత్యం నాకు అత్యుత్తమమైంది.నాకో కొత్త కోణాన్ని పరిచయం చేస్తే, నా prejudices ని బహిర్గతం చేస్తే, నాతో కలిసి కొంత దూరమయినా ప్రయాణించగలిగితే అది నాకు అతుత్తమమైనది. అయితే, రాసేటప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన పని లేదనుకుంటాను.ఆ పరీక్ష నిర్వహించేది కాలం.

సాహిత్యం అంతిమలక్ష్యం ఏమిటి? 

ఫలానా అని చెప్పలేము.సాహిత్యం వల్ల ఏ రకమైన ప్రయోజనం నెరవేరినా స్వాగతించాల్సిందే.కాకపొతే, తిరోగమనానికి దారి తీయకుండా ఉంటే చాలు.మనిషిని మనిషిగా గుర్తించడానికి తోడ్పడాలి సాహిత్యం.

*

 

 

సత్యోదయ్

24 comments

Leave a Reply to బాలసుధాకర్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీ అభిప్రాయాలు బాగున్నాయి నవీన్… నీ పాటలాగా~ 🙂

    • నాకు ఇవ్వాళనే తెల్సింది నవీన్ పాట గురించి

  • ఇన్నేళ్ళ ప్రస్థానంలో మనిషి నిర్మించుకున్నది కళ. మనిషిని నడిపిస్తున్నది ఎమోషన్. మూడు కలిస్తే కవిత్వం. జీవితం

    సాహిత్యం తప్ప మరే విషయాలు కనిపించకపోవడం

    మనిషిని మనిషిగా గుర్తించడానికి తోడ్పడాలి సాహిత్యం.

    పై వాక్యాలు వెంటాడుతున్నాయి. మంచి సంభాషణ. తాంక్యూ… నవీన్…. సత్యోదయ్..అభినందనలు

    బోల్లోజు బాబా

  • నవీను…! “సాహిత్యమూ, ఇతర భారతీయ భాషా సాహిత్యము కొంచెం నాణ్యముగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు” ఇంత సూటిగా నిర్మొహమాటంగా చెప్పటం సూపర్ 😉

    • అవును సూఫీ, వదిలించుకోవాల్సిన మొహమాటాలు ఇంకా చాలా ఉన్నాయి.. I’m on my way..

  • మీ అభిప్రాయాలు బావున్నాయి…సర్…శుభాకాంక్షలు

  • తిరోగమనానికి దారితియ్యకుండా.. మనిషిని మనిషిగా గుర్తించేందుకు తోడ్పడాలి సాహిత్యం….
    ఆభినందనలు…ఇరువురికీ👌👌👌💐💐💐💐💐💐💐💐

  • సత్యోదయ నవీన్ మీ సమాధానాలు చూస్తే మీకు జీవితమూ సాహిత్యమూ వేరు వేరు కాదని అర్ధమైంది అలాగే సాగిపోండి. ముందు సాహిత్యం మన్ని ఉన్నతం గా చెయ్యాలి. తర్వాతే లోకోద్ధరణ

    • అవును మేడమ్.. మొదటి గోల్ అదే. మీ మాటలు స్ఫూర్తినిస్తున్నాయి. థాంక్యూ 😊

  • Nice bhai

    మనిషిని మనిషి గుర్తించగలిగేది, తిరోగమనానికి దారితీయనిది సాహిత్యమంటి సూటిగా నిర్వచించారు సాహిత్యం పట్ల మీ దృక్పథాన్ని
    బావుంది ..👌👍

  • ఎంతో విలువైన ప్రశ్నలు,సమాధానాలు అన్న.నిజమే అన్న..మనిషిని మనిషిగా గుర్తించేలాగ సాహిత్యం చేస్తుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు