చీకటి కాశ్మీరం

చాపచుట్టుకున్నట్టు ఙ్ఞాపకాలు పెనవేసుకున్నాక
నిద్రదేంటి పాపం?
అలల్ని చీల్చి వెళ్లిన పడవలా
కనుపాపల్ని స్వప్నాలు
ముక్కలు చేస్తుంటే

గదిగోడలు
కళ్లు మూసుకొని నిద్రనటిస్తాయి
చేతుల్ని పెనవేసుకుని హత్తుకున్న తలుపులు
నిద్రను ఆహ్వానిస్తాయి

అద్దం చీకటిని ఎలా ప్రతిబింబిస్తుందో కానీ నిదురకళ్లు
కిటికీ ఊచలకు క్లిప్పులతో బిగించబడి
కన్నీటిని రక్తంగా కార్చుతుంటాయి

గాలిరెక్కలు యే మృత్యుగీతాన్ని పాడతాయో
యుద్ధదేహం ఎవరి యెదపై ముద్దిడుతుందో గాని
నిద్ర ఓ శాశ్వత పథకమై
తనని తాను ఉచితంగా అప్పగించుకునేందుకు
కోట్లరూపాయల ఖరీదును లెక్కచేయనంటుంది

ఇప్పుడిక
ఎవరికెవరం స్నేహితులం
ఎవరెవరికి పరాయిలం?

మనల్ని మనం తలా ఓ గదిని చేసుకున్నాక
రోజుల్ని రెండు రొట్టెలు
నాలుగు మజ్జిగ చుక్కలతో లెక్కించుకున్నాక
దేహాన్ని ఇంకో దేహం పలకరించక వెలివేశాక
నిద్ర కాశ్మీరీ శాలువలా
కలలు మోసుకొస్తుంది

నిద్రకూ స్వేచ్ఛుంటుంది
నిద్రను ఆహ్వానించనివాడు
మరో ఉదయం చూళ్లేడు
యుద్ధాన్ని చూడనివాడు
శాంతిని మొలకెత్తటం చూల్లేడు

ఇప్పుడు ఆ కాశ్మీరీ శాలువానే అడగాలి
ఎన్ని ఇండ్లు నిద్రలేని కళ్లతో ఉన్నాయో
ఎన్ని కళ్లు కాశ్మీరు చుట్టూ
నిద్రాహననం చేస్తూ సూఫీగీతాలు పాడుతున్నాయో

కాశ్మీరీ మంచు శాలువా ఇప్పుడు
రక్తపు కలలు కనని నిద్రను కోరుకోవాలి

గడియారపు ముళ్లును తనచేతులతో తిప్పి
తానే అలారాన్ని ఆపేంత నిద్రను కోరుకోవాలి
రాతిరి నిదుర ముఖాన్ని ముద్దాడుతూ
కాశ్మీర్ గాయాలకు ఉపశమనం కలగాలని కోరుకోవాలి

 

*

మెర్సీ మార్గరెట్

మెర్సీ మార్గరెట్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మెర్సీ చీకటి కాశ్మీరం ను అద్భుతంగా సృజించావు…చాలా బాగుంది కవిత

  • కాశ్మీర్ గాయాలకు ఉపశమనం కలగాలని కోరుకుంటున్న అభ్యుదవాద కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారికి నెనర్లు.

    కులం, మతం, జాతి, ప్రాంతీయ కుహనా భేదభావాలకు అతీతంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ ప్రజలందరూ కోరుకునేది ఒకటే . . . . శాంతియుతంగా జీవితం గడపటం. గర్భశోకం ఏ తల్లినైనా ఒకేలా వేదనాభరితంం చేస్తుంది.

  • బాగుందిరా మెర్సీ! ”Do you remember kunan Poshpora?” చదువుతున్నా. అందుకని ఇంకా చాలా బాగుంది.

  • On February 23, 1991, Kunan and Poshpora, the twin villages in Kashmir became the site of mass rape of women and sexual torture of men by the Indian Armed Forces when unit(s) of the Indian army launched a search and interrogation operation. Though the criminals have escaped justice and Indian governments have refused to even acknowledge the horror, 24 years later five women who grew up in the aftermath of that violence combine records, testimonies, fact and fiction to bring us a history that traverses time as does violence. Zubaan Books published ” Do You Remember Kunan Poshpora?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు