1
ఒకానొక మనిషి గుడి బయటి నుంచే దేవుడికి దణ్ణం పెట్టుకొని హడావిడిగా వెళ్ళిపోతున్నాడు
గుడి లోంచీ దేవుడు:
అంత తొందరేం భక్తా
వొక్క క్షణం ప్రశాంతంగా లోపలికొచ్చి పో
గుడి బయటి నుంచే మనిషి:
నీతో ముచ్చట్లు పెట్టుకునేంత టైం లేదు స్వామీ
అవతల అర్జెంట్ పనుంది
దేవుడు:
అంత ముఖ్యమైన పనేంటి నాయనా
మనిషి:
వేరే మతంవాడినొకడిని వేసేయాల
మన మతాన్ని నిలబెట్టాల
2
జ్ఞానం గొప్ప ఆయుధం అన్నాడు గంభీరంగా వేదిక మీద వున్నతాసనంపై ఆసీనుడైన ప్రవచనకారుడు
దాన్ని దేనికి వుపయోగిస్తారు.. అంటే దాని ప్రయోగ వుపసంహరణల గురించి సెలవియ్యండి గురువు గారూ
అని వినమ్రంగా ప్రశ్నించాడు శిష్యోత్తముడు
జ్ఞానానికి ప్రయోగమే గానీ వుపసంహరణ వుండదు నాయనా
పోనీ యీ ఆయుధం దేనికి వుపయోగించాలో సెలవియ్యండి ఆచార్యా
అజ్ఞానుల కుత్తుకలు కత్తిరించడానికి
పట్టు వుత్తరీయాలు ముంజేతి కంకణం సర్దుకుంటూ స్థిరమైన గొంతుతో చెప్పారు విశిష్టగురు
అజ్ఞాని కూడా మనిషే కదా
చేతులు జోడించి కొంచెం సిగ్గుపడుతూ సంశయంగా అడిగింది వొక భక్తురాలు
ఉపాయం లేని వాణ్ణి వూరి నుంచి తరిమేయాలన్న ఆర్యోక్తి వినలేదా
ఆయన గొంతులో ధ్వనించిన అసహనానికి ఆమె భయపడింది
జ్ఞానానికి రుజువు యేంటి స్వామీ అడిగాడు మరో భక్తుడు
మా మాటను విశ్వసించి ఆచరించడమే
ప్రవచనం విని పరవశించిన భక్తులు స్వామికార్యం నెరవేర్చడానికి శరవేగంగా కదిలారు
(అల్పికలు బుల్పికలు అల్లిన బజరాకు కృతజ్ఞతలతో..)
*
చిత్రం: సృజన్ రాజ్








బలే ఉన్నాయ్
భలే AKశారు