లోయలో నేను…
తోసేశారా…! పడ్డానా…!
చిన్ని చిన్ని గడ్డి పరకలు
వీపు కాపాడుతూ
నా కళ్ళు, వెన్ను తడిదనం
నా బరువుకు అవి విడిచిన
కన్నీటి చెమ్మ.
పక్కకు ఒత్తిగిల్లిన మేను
బాధ తగ్గిన లేత చివుళ్ళు
సన్నని తల ఎత్తి చిరునవ్వి
“ఎలా ఉన్నావని?” అడిగాయి
ఇంతలో
నోటి ముందుకు చేరిన పండ్లకొమ్మలు
తిను అంటూ అమ్మలా లాలిస్తూ
పూల పరిమళాలు చెరోవైపు
నేల రాలిన ఆకుల గలగల సవ్వడుల
చిర సంగీతం
స్వార్థం తెలియని
మరో ప్రపంచపు ఘన స్వాగతం
చుట్టూ చూశాను
కుంచెతో గీసిన
ఆకాశాన్ని తాకే
హద్దుల్లేని మైదానం
అడ్డంకులు లేని కనుచూపు
అక్కడంతా మిణుగురుల తోట
అహం రెక్కలు వాటి వేడికి కరిగిపోతూ
కొత్త రూపంలో నేను
మరో లోయగా
నిస్వార్థ జీవులకు స్వాగతం పలుకుతూ…
*
చిత్రం: సత్యా బిరుదురాజు








“బాధ తగ్గిన లేత చివుళ్ళు
సన్నని తల ఎత్తి చిరునవ్వి”
ఆర్ద్రత నిండిన మీ భావుకతకు Take a bow.
మనిషి తనలోంచి ప్రపంచాన్ని చూడడం నేటి అనుభవం ఐతే దాన్ని ఆర్ద్రంగా అక్షరాలలోకి వొంపడం నేటి కవులు చేస్తున్నారు.
అభినందనలు.
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సర్.🙏🏼
బావుంది
మీ ఆత్మీయ, నిరంతర ప్రోత్సాహానికి ధన్యవాదాలు సర్.🙏🏼