ఒక నల్ల పియానో బయోపిక్!

జాషువా, డోనాల్డ్ వాల్ బ్రిడ్జి శిర్లె పాతికేళ్ళు అటూ ఇటుగా పుట్టారు. ఒకరు అమెరికాలో మరొకరు తెలుగు నాట ఒకే వివక్షను అనుభవించారు.

డిచిన కాలాన ఒక జాతి మీద మరొక జాతి, ఒక వ్యవస్థ మీద మరొక వ్యవస్థ తమ ఆదిపత్యం కోసమో,తమ జాతి ఉత్కృష్టతను కాపాడు కోవడానికో జరిపిన అమానవీయమైన మారణహోమాలకు ఏదో ఒక దశలో తల నేలకు వంచి క్షమాపణ చెప్పాయి. తమ పాపాలను క్షమించమని వినమ్రంగా ప్రాధేయ పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మారణ హోమాలకు కారణం అయిన సమాజాలు తమ నిష్కృతి ని వెలిబుచ్చాయి. కానీ ఏకలవ్యుడు,శంభూకుని మొదలు కంచక చర్ల కోటేశు, మంథని మధుకర్ దాకా నడిచి వచ్చిన నెత్తుటి గాయాలకు క్షమాపణ ఇంకా బాకీ నే ఉంది.  తీర్చాల్సింది బాకీలు వడ్డీలు కాదు. అన్నీ అందులోనే ఉన్నాయి. కులం వలసవాద నిర్మాణం ఈ దేశం లోకి వలసవాదం వచ్చాకే కుల తీవ్రత బయట ప్రపంచానికి తెలిసింది అనే గిరీశాలూ మన చుట్టూ ఉన్నారు.

మూతికి ముంత ముడ్డికి తాటాకు కట్టిన గణచరిత్ర అమానుష మూలాలు ఆర్య జాతిలో ఉన్నాయి. అడుగు అడుగు కూ ఆ తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ ఇటీవల విడుదల అయిన గ్రీన్ బుక్ అనే సినిమా చూసాకా వివక్ష    ఎక్కడయినా ఒకటే అని అర్ధం అయ్యింది.

అరవై డెబ్బై ఏళ్ల కింద “డోనాల్డ్ వాల్ బ్రిడ్జి శిర్లె” అనే నల్ల జాతి సంగీత కారుని బ్రతుకు చిత్రం ఇది . ఒక నాటి  ప్రపంచ ప్రసిద్ద జాజ్ పియానిస్ట్ పట్ల నాటి అమెరికా తెల్లజాతి సమాజం అడుగడుగునా చేసిన అవమాన గాయాలలోతు కొలవడానికి మనిషి కనిపెట్టిన భాష సరిపోదు. ఇదేప్పుడో వెయ్యేళ్ళ కింద గడిచిన చరిత్ర కాదు కేవలం వందేళ్ళ కింద సమీప గతం. ఒక బీద కుటుంబం లో పురుడు పోసుకున్న ఆ సంగీత కెరటం వెనక దాగిన సునామీలు కొద్దిగా మాత్రం తెర మీద చూడగలం.  డోనాల్డ్ నాడు అమెరికా అంతా తన ప్రదర్శన ఇస్తూ తన్నులు,గుద్దులు,ఆకలి,అవమానాలు పంటి బిగువున భరిస్తూ కేవలం కళను మాత్రమె నమ్ముకొని ప్రపంచ వ్యాప్తంగా  తన సంగీత ఘరానాను నిలుపుకున్నాడు. తాను ప్రదర్శన ఇస్తున్న హోటల్ లో తినడానికి, కనీసం టాయిలెట్ కూడా వాడడానికి నిరాకరించ బడ్డ ఒక మట్టిమనిషి కన్నీటి ప్రయాణాన్ని నిలువెత్తు తెరమీద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది..

గ్రీన్ బుక్ అంటే వందేళ్ళ కింద అమెరికా సమాజం పందొమ్మిది వందల ముప్పై, అరవై ల మధ్య లో నల్లజాతి సమాజానికి విధించిన నియమ నిబంధన తో కూడిన రూల్ బుక్ లాంటిది. ఒక రకంగా మన మనుస్మృతి లాంటిది. నువ్వు ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి ఏ మార్గం లో ప్రయాణం చేయాలి ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదో వివరించే ఒక నియంత్రిత కళ్ళెం లాంటిది. పుట్టు మచ్చలు ఎక్కడయినా ఉంటాయి. అవి శరీరం మీద ఉంటె ఆ మచ్చుకు ఒక గుర్తింపు కానీ కొన్ని మచ్చలు కొందరి నుదిటి మీద బలవంతంగా పొడవబడతాయి అవి కులం రూపం లో మతం రూపంలో మన నుదిటి మీద బలవంతంగా గీయబడతాయి అలా  నల్లజాతి సమాజం మీద గీసిన పుట్టు మచ్చ గ్రీన్ బుక్. అది నల్ల  జాతి వారి నుదిటిన గీయబడిన ఒక నియంత్రిత రేఖ. నీ పుట్టుక ఉనికి అస్తిత్వం ఆ పుస్తకం లో గీసిన గీతలకు అనుగుణంగా ఉండాలి అది ధిక్కరిస్తే నీకక్కడ చోటు లేదు.

అమెరికన్ సమాజం లో పియానో లేదా ఎటువంటి సంగీత కార్యక్రమాల లో నల్లవారికి ప్రవేశం లేదు ఒకరిద్దరు వచ్చినా వారి బ్రతుకుని పణంగా పెట్టి ఆ సాహస వంతమైన పని చేయాలి. కొన్ని పరిమితులకు లోబడి నువ్వు ఆడాలి పాడాలి. అత్యంత ప్రజాస్వామిక మైన దేశంగా పేరు మోస్తున్న అమెరికా ప్రజాస్వామిక నెత్తుటి చారిక ఈ సినిమా నేపధ్యం. అటు వంటి దేశం లో ఒక గాయకులు  కళాకారులు   భౌతిక దాడులకు సిద్దపడి మాత్రమే నువ్వు పాడాలి ఆడాలి.  అటువంటి సంక్షుభిత కాలం లో డోనాల్డ్ శిర్లె  అత్యంత వివక్ష ఉన్న అమెరికా దక్షిణాది సాహస యాత్రకు బయలుదేరాడు.

డోనాల్డ్ వాల్ బ్రిడ్జి శిర్లె పందొమ్మిది వందల ఇరవై ఏడున ఒక మత ప్రచారకుడి కొడుకు, తల్లి స్టెల్లా టీచర్. డోనాల్డ్ కు తొమ్మిది ఏళ్ళు ఉండగానే ఆమె దూరం అయ్యింది. పుట్టుకతోనే అంటే చర్చి లో మూడో ఏట నే  మౌత్ ఆర్గాన్, ఒక రకంగా ఆయన బాల్యం పియానో మెట్ల మీద నడిచింది. తల్లి లేని శిర్లె ను పాట అనునయించింది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం లో సంగీతం చదువు కున్న అతను జాజ్ పియానో మీద వలసవాద వివక్షను జయించాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. నిజాయితీ గా చెప్పాలి అంటే ఈ సినిమా చూసాక నే డోనాల్డ్ కన్నీటి కథ తెలిసింది.

డోనాల్డ్ శిర్లె ప్రదర్శనలు ఇచ్చే  నాటికి నల్ల జాతి వాళ్ళకు సమానమైన హక్కులు లేవు . బహిరంగ ప్రదేశాల లో ప్రవేశం లేదు. టోనీ అనే ఒక ఇటాలియన్ అమెరికన్ డ్రైవర్ సహాయం తన సహాయకుడిగా పెట్టుకొని. ‘గ్రీన్ బుక్’ నిర్దేశిత ప్రాంతాల ద్వారా తన ప్రయానాన్ని కొనసాగించాడు. తాను నడయాడిన ప్రతి చోటా వేలాది మందిని తన పియానో మాధుర్యం లో అమెరికా దక్షిణ భాగం లో అన్ని రాష్ట్రాలూ తిరిగాడు. హోటల్ లో సర్వర్ల మొదలు ఈవెంట్ మేనేజర్ల దాకా నిలువెత్తు అహంకారపు వివక్షల మధ్య అవమానాలను ను మూటేసుకొని తిరిగాడు ఎన్నో సార్లు భౌతిక దాడులు అరెస్ట్ లు పోలీసుల వేధింపుల మధ్య నడిచిన వివక్షల పాట అది.

ఈ సినిమాలో డోనాల్డ్ కి సహాయకుడు డ్రైవర్ టోనీ  (ఇతని కొడుకు సినిమా కథ సహా రచయిత) టోనీ  ఆవేశం, విచిత్ర అలవాట్ల షెర్లీ మెతకతనం రెండూ భిన్నంగా ఉంటాయి ఎన్ని వైరుధ్యాలు ఉన్నా డోనాల్డ్, టోనీ చేసిన సాహస యాత్ర గ్రీన్ బుక్ నేపధ్యం.

ఈ సినిమా డోనాల్డ్ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తీసారు అని ఒక విమర్శ కూడా ఉంది.కొందరు డోనాల్డ్, టోనీ స్నేహం గురించి సినిమా వక్రీకరించారని అన్నారు. అంతే కాకుండా డోనాల్డ్ సెక్సువాలిటి (ఒక సన్నివేశం లో అతను ఇంకొక తెల్ల వ్యక్తితో అభ్యంతర కరంగా పట్టుబడ్డారు అని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి లాకప్ లో వేస్తారు.

ఈ సినిమా లో డోనాల్డ్ పాత్రలో మహర్షల్ అలీ నటన అద్భుతం. నిన్న ఆస్కార్ ఉత్తమ సహాయ నటుడు గా కూడా గెలిచాడు.  ఆ అవార్డ్ డోనాల్డ్ అనుభవించిన వివక్ష ముందు గడ్డి పోచ కన్నా తక్కువే.కానీ ఒక జీవిత చరిత్ర  అనుసరణ సినిమా గా తీసే క్రమం లో అక్కడి సమాజం అనుసరణ పరిశోధన లో మనవాళ్ళు లేశ్యం అంత కూడా ఎందుకు చూపరు అని నా బాధ?

చరిత్రలో తమ ప్రభావాన్ని ఉనికినీ కోల్పోయినప్పుడు రాజకీయ లక్ష్యాల కోసం సినిమాలు తీస్తే ‘మహా నాయకుడు’ ‘కథానాయకుడు’ లాంటి డబ్బా సినిమాలు వస్తాయి. ఒక కల్లోల కాలం లో ఒక జాతి అనుభవించిన క్షోభను తెర మీద అక్షరీకరిస్తే గ్రీన్ బుక్, అంబేద్కర్ లాంటి సినిమాలు వస్తాయి.అది అర్ధం చేసుకునే ఔదార్యం మన తెలుగు సమాజానికి ఇంకో వందేళ్ళకు కూడా అబ్బదు అని చెప్పగలను.

ఇప్పుడు ప్రపంచం బయోపిక్ ల చుట్టూ పరిభ్రమిస్తోంది. అయిన వారి బ్రతుకులు ‘మహానటి’ గా, కాని వారి బ్రతుకులు ‘డర్టీ పిక్చర్లు’ గా సిగ్గులేకుండా వెండి తెరమీద బరితెగించి ఆడుతున్నాయి. పిట్ట గూడు లాంటి విగ్గు పెట్టి, దొడ్డికాళ్లు దూడ పెదవులు లోటాలో కంకర రాళ్ళు మోగిస్తే వచ్చే శబ్దం లా వాచకం ఉన్న వాడు  ఊపు కుంటూ ఇంత పొట్ట ముందుకేసి మనవరాలి వయసున్న పద్దెనిమిది ఏళ్ళ పడుచు పిల్ల బుగ్గల మీద చిటికెన వేలుతో కామపు చెమటను చిలకరిస్తూ  చిలక కొట్టుడు కొట్టిన జుగుప్స తెరమీద చూపిస్తూ ఆ పసి మనసుల మీద మరో అత్యాచారం చేస్తూ కాసుల వ్యాపారం చేస్తున్నారు.

పందొమ్మిది వందల నలభై యాభై లలో తాత  గుఱ్ఱం  జాషువాని కవితా పఠనానికి పిలిచి సంపన్న కవులంతా ఇంట్లో తింటూ, ఇంటి బయట విస్తరి వేసి అన్నం పెడ్డను విసిరేసిన కవుల భజన వర్తమాన ఆధునిక, విప్లవ సంఘాలూ చేస్తుంటే భాద కలగదా ? ఆనాడు ఇంట్లో తిన్న కవుల మనవలు, మనవరాళ్ళు వాళ్ళ దాయాదులు మా తాత సమాధి మీద తల పెట్టి క్షమాపణ అడగడం నేరం మాత్రం కాదు.  జాషువా, డోనాల్డ్ వాల్ బ్రిడ్జి శిర్లె పాతికేళ్ళు అటూ ఇటుగా పుట్టారు. ఒకరు అమెరికాలో మరొకరు తెలుగు నాట ఒకే వివక్షను అనుభవించారు. హాలీవుడ్ డోనాల్డ్ కు చేసిన అవమానానికి సాగిల పడి లెంపలు వేసుకుంది. ఇక్కడ ఇంకా పిచ్చుక గూడు విగ్గు వికట్ట హాసం చేస్తోంది.

వీలుంటే  “గ్రీన్ బుక్” సినిమా చూడండి. ఒక బయోపిక్ ఎలా తీయాలో మన బాలరాజులకు చెప్పండి.

*

photo credit: Universal

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

37 comments

Leave a Reply to Anjaneya Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Hit us like a tsunami
    Hatsoff to you for being straight and bold…
    And of course mincing no words…

    • థాంక్స్ రాంబాబు గారు.
      వివక్ష మితిమీరితే ప్రతిఘటన విస్పోటనం తీవ్రత అంచనా వేయలేము.
      ఆ తీవ్రత ల నుండి ఉభికి వచ్చిన దుఃఖమే గ్రీన్ బుక్ సినిమా

  • మనకు ఈ కులవ్యవస్థని మనువు సృష్టిస్తే వచ్చింది . మరి అక్కడెవడు సృష్టించాడో ఈ వైట్స్; బ్లాక్స్ అనేది?

      • గ్రీన్ బుక్ అంటే ఏమిటో మీకు ఎవరు చెప్పారో గానీ పూర్తిగా తప్పు సమాచారమిచ్చారు.

      • అవును రాఘవేంద్రగారూ, African-American travelers faced hardships such as white-owned businesses refusing to serve them or repair their vehicles, being refused accommodation or food by white-owned hotels, and threats of physical violence and forcible expulsion from whites-only “sundown towns”. Green founded and published the Green Book to avoid such problems, compiling resources “to give the Negro traveler information that will keep him from running into difficulties, embarrassments and to make his trip more enjoyable.”[2] The maker of a 2019 documentary film about the book offered this summary: “Everyone I was interviewing talked about the community that the Green Book created: a kind of parallel universe that was created by the book and this kind of secret road map that the Green Book outlined”.[3]

        From a New York-focused first edition published in 1936, Green expanded the work to cover much of North America, including most of the United States and parts of Canada, Mexico, the Caribbean, and Bermuda. The Green Book became “the bible of black travel during Jim Crow”,[4] enabling black travelers to find lodgings, businesses, and gas stations that would serve them along the road. It was little known outside the African-American community. Shortly after passage of the Civil Rights Act of 1964, which outlawed the types of racial discrimination that had made the Green Book necessary, publication ceased and it fell into obscurity. There has been a revived interest in it in the early 21st century in connection with studies of black travel during the Jim Crow era.

    • ఎవరు చెప్పారు కులవ్యవస్థని మనువు సృష్టించాడని? అంబేడ్కరే చెప్పలేదే కులవ్యవస్థకి మూలం మనువు అని. **కులవ్యవస్థకి మూలం మనువు కాదు, బ్రాహ్మణులు కాదు, ఏ స్మృతీ కాదు, శాస్త్రమూ కాదు, రాజు కాదు, పురోహితుడూ కాదు, పాలకుడూ కాదు**, అని అంబేడ్కరే నొక్కి వక్కాణించాడు కదా. మరి, అంబేడ్కర్ తప్పు చెప్పారా?

      ఈ పుస్తకాలు చదివితే రొడ్డకొట్టుడు ఆర్య ద్రావిడ విభజన బూటకపు సిద్ధాంతాలు చెప్పే తప్పుడు చరిత్రనుండి బయటపడవచ్చు. (ఆర్యులు ఎక్కడినుండో వచ్చిన విదేశీయులని ఆర్య, ద్రావిడ విభజనని అంబేడ్కరే ఒప్పుకోలేదు)

      Western Foundations of the Caste System … by Martin Fárek, Dunkin Jalki, Sufiya Pathan, and Prakash Shah

      • ఆర్యులు విదేశీయులని ఈ దేశం మీద దాడి చేశారు అని అంబేద్కర్ మొదలు (రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్) డి.డి కోశంబి (ఇండియన్ హిస్టరీ) బ్రజ్ రంజన్ మని(మడి విప్పిన చరిత్ర) ,ఆలోషియస్, థామస్ టోర్ట్ మాన్ (ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ది ఆర్యన్ డిబేట్, ) డిబేట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ కాక కోశంబి, ఐరిష్ ఇర్సుల శర్మ అనేకులు కులం మీద రాసిన ఇంకో పది పుస్తకాలు పేజీ నెంబర్ల తో సహా ఇవ్వగలను.పైన చెప్పినవి పైన చెప్పినవి కనీసం ఒక పుస్తకం చదివినా ఈ కామెంట్ రాసే శ్రమ నాకు తప్పేది.
        బృహద్దదున్ని హత్య చేయించిన పుష్య మిత్ర శుంగ వర్ణ వ్యవస్థ స్థాపన, కుల వ్యవస్థ స్థిరీకరణ, మొదలు మను స్మృతి ఇత్యాది ఎన్నో రచనలు బయటకు రావటం .
        మను చరిత్ర అంతకు ముందే రాయబడినప్పటికీ కుల వ్యవస్థ వాటి మధ్య ఉన్న సంబంధాలను నియంత్రించే శాసనం మను స్మృతి అని నాకు తెలుసు రెండు మూడు సార్లు చదివాను ఆ పుస్తకాన్ని పదేళ్లుగా హైదరాబాద్ ట్యాంక్ బాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఏటా తగలబెడుతున్న వాడిగా చదివిన వాడిగా సాధికారత తో చెబుతున్నా..
        ఇక నీ కామెంట్ లొనే కులం గురించి ఏ ఒక్క ప్రామాణిక గ్రంధం చదవలేదు అని అర్ధం అవుతోంది. ముఖ్యంగా పెరియార్,అయోతి దాస,ఇంకా పదుల సంఖ్యలో ఆర్యన్ ద్రావిడ వైదానికం మీద స్పష్టంగా రాసారు. నువ్విచ్చిన వెస్టర్న్ ఫౌండేషన్ నేను చదవలేదు. కానీ వెబర్,లూయిస్ డ్యూమంట్, నికోలస్ డ్రక్స్, అనుపమ రావు,బాగానే చదివాను చర్చ చేసే తప్పుడు దాబాయింపులు చేయొద్దు.ఎదుటి వాళ్లకు ఏమీ రాదు అనుకోవద్దు.

      • ఆర్యులు విదేశీయులని అంబేడ్కర్ చెప్పాడనగానే నీది తప్పుడు దబాయింపని అర్థమవుతూనేవుంది. ఇది చదువుకుని ముందుగా అది సరిచేసుకో. చర్చ చేయాలంటే ఉత్తి రెటోరిక్ సరిపోదు.

        https://www.opindia.com/2018/04/dr-ambedkar-rejected-aryan-invasion-theory-with-facts-and-logic/

    • మన దేశం లో కూడా మనువు ఒకడు కాదు గదా ? పలువురు ఆదేశించిన కట్టుబాట్లు. మను వ్యక్తి అయినా అది స్వభావం అడుగు అడుగునా రక రకాల పేరుతో పిలవబడుతూ ఉంటారు. ఒకడు వేదం చదవాలి మరొకడు పెంట ఎత్తాలి అనేదే మనువాదం. దాన్ని దిక్కరించారు కాబట్టే నాలుకలు కోసారు సీసాలు పోశారు.ఇపుడు ఆపని చేయలేరు కాబట్టి మందని మధుకర్ అంగాన్ని చిద్రం చేసారు.ఎందుకంటె దాని నుండి వాళ్ళకు ముప్పు ఉంది కనుక. అది మిర్యాలగూడ ప్రణయ్ దాకా నడిచింది. దీని వెనక కులం ఉందా ? డబ్బు ఉందా ? అంగ బలం ఉందా ? అనేది చర్చ. వేయి ఎల్లకింద ఎవడో చేసిన దానికి ఇప్పుడు ఎవరిని అనాలి అనేవాళ్ళకు ఇప్పుడు జరుగుతున్న వర్తమాన విషాదాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలి. ఒక నాడు జరిగిన వాటిని రాసుకోలేదు ఇప్పుడు రాయగలిగిన వాళ్ళం రాస్తున్నాం. రాసే క్రమం లో తప్పులు దొర్లోచ్చు దాన్ని పట్టుకుని చిన్నప్పటి ఉగ్గుపాలు వెతకడమే మనువాదం ఈ కింద కొన్ని కామెంట్ల లో మనువాదం చూడొచ్చు. మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే ఒక అభిప్రాయాన్ని చెప్పే హక్కుని కూడా నిరాకరించడమే మనువాదం.అది ఇప్పుడు గుడిల్ బడిలో స్మశానం లో సామాజిక మాధ్యమాల లో పెచ్చురీలి పోతుంది

  • మీకు, అభినందనలు.. Sir. వాస్తవం ని, చక్కగా, చూపినందుకు.. Greenbook,చూస్తాం !

  • తవ్వాల్సింది పూడ్చాలసింది ఇంకా ఉంది అన్నా.ముందు రాత నేర్చుకున్నవాడు రాసిన రాతలు నేడు తిరగరాయాలి.

  • Sitaramulu garu
    Please give me your address.
    I want to send you a new edition of Joshua’s autobiography which we have recently published.
    -anjaneya reddy +91 98667 06767

  • మూడేళ్ల క్రితమే విహంగ పత్రికలోని ఈ వ్యాసంపై జరిగిన చర్చలో అంబేడ్కర్ ఏమి చెప్పారు అనేది వివరంగా పేజీ సంఖ్యలతో సహా యిచ్చాను. చదువుకోవచ్చు.
    http://vihanga.com/?p=18956

    • కౌంటర్ రివల్యూషన్ లో బృహద్దదుని చర్చ ఉంది.ఆర్య ద్రావిడ చర్చ లేదు.(పొరబాటు పడ్డాను.) అయినా ఆర్య ద్రావిడ చర్చ అంబేద్కర్ కు మాత్రమె ఎందుకు పరిమితం కావాలి ? నేను పైన పేర్కొన్న రచనల్లో ఆ చర్చ సమగ్రంగా ఉంది. ఆలోషియస్, థామస్ టోర్ట్ మాన్ ఆర్యులు ఎక్కడి విదేశీయులు అని కొందరు ఇక్కడి వారే అని మరి కొందరు అన్నారు. ప్రపంచం లో అమానవీయమైన మానవ హననాలకు పాల్పడ్డ జాతి అది .వాడు ఎక్కడ పుట్టిన ఎక్కడ చచ్చినా ఆ కొనసాగింపే ఇక్కడ సాగింది.నా సినిమా సమీక్ష లో కుల వర్ణ వివక్ష రూపాలు ఎక్కడున్నా వాటి తీవ్రత అమానవీయం అన్నాను.వివక్ష ఉందా లేదా అనేది చర్చ. దానికి పరిమితం అయితే మంచిది. ఎక్కడో మూడేళ్ళ కింద విహంగ చర్చ నాకనవసరం . దయచేసి ఎదుటి వాళ్ళు ఏమీ చదవలేదు వాళ్ళకు లింక్ లు ఇచ్చి జ్ఞానబోధ చేసే వ్యాపకం మంచిదే అది నాకు అవసరం లేదు అందునా నీ లాంటి మేధావి అవసరం అంతకన్నా లేదు. అవసరం అయితే చదువు కుంటా చర్చ గ్రీన్ బుక్ కి పరిమితం అయితే బాగేమో. నేనొక అభిప్రాయం రాసా దానికి “రొడ్డకొట్టుడు ఆర్య ద్రావిడ విభజన బూటకపు సిద్ధాంతాలు చెప్పే తప్పుడు చరిత్రనుండి బయటపడవచ్చు.” లాంటి దబాయింపులు మొదలు పెడితిరి నా వ్యాసం లో ద్రావిడ పదమే రాలేదు.ఇప్పుడు పేజీల ఉటంకింపుల ద్వారా పాముకునేది ఏమీ రాదు. నీకు ప్రజాస్వామిక కంగా చర్చ చేయడం రాదు. నీ అంత పండితుణ్ణి కాదు.అనవసరపు చెత్త లోకి నన్ను లాగబాకు ఇక ఉంటా

      • నువ్వు ఎంత గొప్పగా చదివావో అంబేడ్కర్ ఆర్యులు విదేశీయులన్నాడనగానే అర్థమయింది. అనవసరపు చెత్త మొదలుపెట్టింది నువ్వు. ఆర్యద్రావిడ సిద్ధాంతం కాలం చెల్లిందని ప్రవంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు వెల్లడిస్తూవేంటే ఇంకా బృహధ్రదుడు, కోశాంబి దగ్గరే ఆగిపోతివి. అనవసరంగా ప్రజాస్వామ్యం మాట ఎత్తకు. నీ దగ్గర సరుకు, విషయం వుంటే నువ్వు మొదట చెప్పిన అంబేడ్కర్ ఆర్యులు విదేశీయులు అన్నారని దానిని నిరూపించు. నేనేదో పాముకోడానికి కాదు చెప్పేది. ఆర్యులే కులవ్యవస్థకి మూలం అనడంలోనే ఆర్యులు వేరు, భారతీయులు వేరే అనే తప్పుడు సూత్రీకరణ వుంది. విషయం లేకపోతే వ్యక్తిగత ఆరోపణలు వస్తాయి. విషయం వుంటే విషయంగానే ఎదుర్కోవాలి. నిజానికి కుల వివక్ష కూడా బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద కల్పనే. నేను సమాచారం యిచ్చేది నీ ఒక్కడికీ కాదు, నన్ను శాసించడానికి. ఇది పబ్లిక్ చర్చ. నీకు యిష్టం వుంటే పాల్గొను. లేకపోతే ఆపేయ్. నువ్వు చెప్పే తప్పుడు విషయాలన్నీ ఖండించకుండా వుండటానికి ఇది ప్రజాస్వామ్యమేగాని ప్రాపంగాండా వ్యాసాలు కాదు. వివిక్ష మూలాలని పరిశోధించకుండా ఎలా అర్థమవుతుంది? ఆ మూలలకి కారణం ఆర్యులే అని సూత్రీకరించావు గనక అది తప్పు అని అంబేడ్కరే చెప్పాడని చెప్పాను. ఎప్పుడో మూడేళ్ల క్రితం చర్చ నీకవసరంలేకపోతే ఎప్పుడో మూడు నాలుగు వేల ఏళ్లనాటి బృహద్రదుని చర్చ, మనువు గురించిన చర్చ ఎవడికి అవసరమవుతుంది?

    • కుల వ్యవస్థ దేశి నిర్మానమా లేదా వలసవాద నిర్మాణ మా అనే చర్చ కన్నా అది అమానవీయం అనే విచక్షణ ఉంటె చాలు.అది మనిషిని మనిషిగా గౌరవించని ఒక ఆటవిక పని అని ఎరక ఉంటె చాలు.ఇది అర్ధం చేసుకోడానికి మేధావుల ఉటంకింపులు అవసరం లేదు.వివక్ష అనుభవించిన వాడు అరువేస్తే రాసిందే సిద్ధాంతం లేదా గ్రంధం. వివక్ష అనుభవించిన వాడు కుల చర్చలో లేడు వాణ్ణి భాగం కానివ్వ లేదు.అదే విషాదం.

    • అది అమానవీయమైనది అన్న విచక్షణ మనకే వుందనుకుంటే సరిపోదు. దాని మూలాలలోకి వెళితే అదెక్కడ తప్పుదారి పట్టిందో అర్థమవుతుంది. కులాలు నిజం, కుల వివక్ష నిజం. ఐతే, ఆయా కులాల వారందరూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ప్రతి ఒక్కరూ మిగతా కులాలపై వివక్ష చూపించారనడం అశాస్త్రీయం, రాగద్వేష జనితం. గతంలో జరిగినదానికి ఇప్పటి ఆయా కులాలవారు ఎలా బాధ్యులవుతారు? కుల వివక్ష ఒక్కటే కాదు నేటి భారత మానవ దౌర్భాగ్యానికి కారణం. అదొక్కదాన్నే ఎత్తి చూపి, ఇప్పటి ఆయా కులాలవారందరే వివక్షకు కారణం అనడమే పెద్ద విషాదం. వివక్ష ఎవరి వల్ల అనుభవించామో ఆయా వ్యక్తుల అమానుషత్వాన్ని కులం మొత్తానికీ అంటగట్టడమే మన లోతులేని అవగాహనని, రాగద్వేషాలని చూపిస్తోంది. ముందు ఆయా కులాలని అందరూ కూడా మనుష్యులేనని భావిస్తే సాధారణీకరణ జరగదు.

      • ఈ పుస్తకాలు చదివితే రొడ్డకొట్టుడు ఆర్య ద్రావిడ విభజన బూటకపు సిద్ధాంతాలు చెప్పే తప్పుడు చరిత్రనుండి బయటపడవచ్చు. “బృహధ్రదుడు, కోశాంబి దగ్గరే ఆగిపోతివి” “నువ్వు చెప్పే తప్పుడు విషయాలన్నీ ” నువ్వు ఎంత గొప్పగా చదివావో”నేను చెప్పానా నీకు బాగా చదివాను అని ? “ప్రాపంగాండా వ్యాసాలు కాదు” ఎవరిదీ ప్రాపగండ ? ఏది తప్పుడు విషయం ఇది వ్యక్తిగత దాడి కాదా
        ఈ రోజుకి మీరిచ్చిన జ్ఞానం చాలు ఇక నా వ్యాసం మీద చర్చ ఆపితే మంచిది

      • గతంలో జరిగినదానికి ఇప్పటి ఆయా కులాలవారు ఎలా బాధ్యులవుతారు? “కులం మొత్తానికీ అంటగట్టడమే ” ఎవరు ఎవరిని అంటగట్టారు ఎవరిని అడుగుతున్నారు ? ఎవరన్నారు బాధ్యులు అని జరిగిన హననాలకు ఎవరు బాధ్యులు ? మూడు రోజులా మూడు వేలా కాదు గాయం ఇంకా పచ్చిగానే ఉంది ఆ పాపం ఒక్క రోజుతో పోయేది కాదు.

      • నీ మొదటి కామెంట్లోనే వ్యక్తిగత దాడి మొదలు పెట్టింది నువ్వు…

        ‘‘ఇక నీ కామెంట్ లొనే కులం గురించి ఏ ఒక్క ప్రామాణిక గ్రంధం చదవలేదు అని అర్ధం అవుతోంది.’

        ‘‘చర్చ చేసే తప్పుడు దాబాయింపులు చేయొద్దు.ఎదుటి వాళ్లకు ఏమీ రాదు అనుకోవద్దు.’

        ’’దయచేసి ఎదుటి వాళ్ళు ఏమీ చదవలేదు వాళ్ళకు లింక్ లు ఇచ్చి జ్ఞానబోధ చేసే వ్యాపకం మంచిదే అది నాకు అవసరం లేదు అందునా నీ లాంటి మేధావి అవసరం అంతకన్నా లేదు‘‘

        ‘‘దానికి “రొడ్డకొట్టుడు ఆర్య ద్రావిడ విభజన బూటకపు సిద్ధాంతాలు చెప్పే తప్పుడు చరిత్రనుండి బయటపడవచ్చు.” లాంటి దబాయింపులు మొదలు పెడితిరి నా వ్యాసం లో ద్రావిడ పదమే రాలేదు.ఇప్పుడు పేజీల ఉటంకింపుల ద్వారా పాముకునేది ఏమీ రాదు. నీకు ప్రజాస్వామిక కంగా చర్చ చేయడం రాదు. నీ అంత పండితుణ్ణి కాదు.అనవసరపు చెత్త లోకి నన్ను లాగబాకు ఇక ఉంటా‘‘

        ‘‘.ఇది అర్ధం చేసుకోడానికి మేధావుల ఉటంకింపులు అవసరం లేదు‘‘

        ఆర్యద్రావిడ విభజన బూటకం, ఆర్యులు విదేశీయులు అని నేను చెప్పింది తప్పుడు దబాయింపే అయితే కాదని నువ్వు ఆధారాలు చూపించు,. జన్యు, పురావస్తు, భాషాశాస్త్ర ఈ మూడింటిలో ఏది ఎన్నుుకున్నా సరే, మూడింటిలోనూ నేను ఆధారాలు యివ్వగలను.

        ఇక వ్యక్తిగత దూషణలు నువ్వు మొదలుపెడితేనే నేను కొనసాగించింది. ఆర్య ద్రావిడ సిద్ధాంతం బూటకం అని నేను చెప్పడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. దానిని వ్యక్తిగత దూషణగా చూపించడమే కుట్ర అంటే.

      • కులాలమీద వున్న ద్వేషం ఆ కులం అమ్మయిని పెల్లి చేసుకొవడనికి అడ్డం రాదా ,

        నిజం చెప్పాలంటే వీల్లకు ఆ కు
        లాలని చూస్తే కుల్లు , అసూయ , ద్వేషం ,

        ఎప్పుడో ఎక్కడో కుల వివక్ష వుంటే దాన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని బ్రతకాలనే దిగజారుడు తనం

        ప్రతి మాటకూ అదో ఆయుధం గా వాడుకునే బ్రతనేర్చిన తెలివిడి

        , సొంత మనుషులమీద ఎటువంటి దయ కరున వుండదు వీల్లకు.

    • సరిగ్గా చెప్పారు శ్రీనివాసుడు గారూ ,

      ఈ దలిత రచయితలతో వచ్చిన తంటానే ఇది ,

      వీరు చెప్పింది కాదన్నమంటే ఇక తిట్ల దండకం మొదలు ,

      పైగా ఒక పెత్తందారీ వైఖరితో ,

      రచనల్లో కూడా రిజుర్వేషన్ లు వున్నాయనుకుంటారో ఏమొ

      • ఇదేం ఆహాకారం .కుల కావరం అంటే ఎవడు ఇక్కడ దళిత రచయిత. శతాబ్దాలుగా బుర్రలో అశుద్ధం నింపుకొని నొటికీ ముడ్డికీ తేడా తెలియకుండా చేసుకునే వాంతి చేయడం ఆపితే మంచిది. ఎవడికి కావాలి రిజర్వేషన్ ఇప్పుడు పది శాతం కూడా కొట్టేశారు కదా ఆ అశుద్ధం మాకూ కావాలి అన్నారుగా సో పది శాతం లో ప్రాతినిధ్యం ఏ ప్రాతిపదిక న మరి ?

  • రాఘవేంద్ర గారూ “గ్రీన్ బుక్ అంటే వందేళ్ళ కింద అమెరికా సమాజం పందొమ్మిది వందల ముప్పై, అరవై ల మధ్య లో నల్లజాతి సమాజానికి విధించిన నియమ నిబంధన తో కూడిన రూల్ బుక్ లాంటిది. ఒక రకంగా మన మనుస్మృతి లాంటిది. నువ్వు ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి ఏ మార్గం లో ప్రయాణం చేయాలి ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదో వివరించే ఒక నియంత్రిత కళ్ళెం లాంటిది.ఎక్కడ గాస్ నింపుకోవాలి లాంటిది కూడా.
    ఒక దశలో నిర్దేశిత మార్గం తప్పితే పోలీసులు దాడి చేసిన ఉదంతాలు కూడా సినిమాలో చూపారు.
    ప్రపంచం లో రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ దానిమీద తెల్లవాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి. మాత్ర శాల ఎక్కడయినా ఒకటే తెల్ల వాడికి అయినా నల్లవాడికి అయినా మూత్రం ఒకే రంగులో వస్తాది. హోటల్ లో ఎవరికయినా ప్రవేశం ఉండాలి జంధ్యం ఉన్నవాడే తినాలి అనడమే మనువాదం. నేనేదో పెద్ద పరిశోధనా వ్యాసం రాయలేదు.ఒక సినిమా చూసి నేను చేసిన కామెంట్. మంచా చెడా చర్చా చేయొచ్చు. నువ్వు ఇది చదివావా అది చదివావా అని దాడి చేసేలా మాట్లాడడం ఆధునిక మనువాదం. దానికి ఎర్రగడ్డ మాత్రమే శరణ్యం.

    • ఒక సినిమాని గురించి రాసినప్పుడు దానికి మాత్రమే పరిమితం అవుతానని అంటున్నావ్

      మరి కథా నాయకుడు , మహానాయకుడు మీద ద్వేషం వెల్లగక్కడం ఎందుకు ,

      నీ వ్యాక్యలు నీవే ఖండించుకుంటావ్ ,

      మల్లీ సమర్థించుకుంటావ్

      నీకు చదువరుల వివేచన మీద బాగా చులకన వున్నట్టుంది ,

      కొంచం వైఖరి మార్చుకో

      • జరుగుతున్న చర్చ సినిమా, వర్ణ వివక్ష పేజీలు రెఫరెన్సు లు ఉటంకింపులు కాదు గదా. గ్రీన్ బుక్ వెనక ఒక ఆవేదన ఉంది. కథానాయకుని వెనక ఒక వక్రీకరణ ఉంది. దాని చరిత వందేళ్ల కింద జరగలేదు. వై స్రాయి హోటల్ లో చెప్పులేసిన వాడు. లోక రక్షకుడు అని చూపడం మీద నాకు ఆక్షేపణ ఉంది.మహా నాయకుడు కథానాయకుడి మీద నాది దేశమా భినాభి ప్రాయమా చర్చ చేయవచ్చు.వ్యాసం రాయడం వెనక ఒక గాయకుడి వివక్షల గాయాలు తడుము కోవడం.అది అమనవీయం అనుకోవడం. మరి కొన్ని జీవితాలు , కథానాయకుడు మరికొన్ని జీవితాలు డర్టీ పిక్చర్ అవడం మీద ద్వేషం కాదు అవి కుల రొచ్చులో కూరక పోయిన దాస్టీకం మీద ఆక్రోశం చదువరుల వివేచన మీద గౌరవం ఉంది. వక్రీకరించే మనువాడుల మీద ద్వేషం ఉంది.
        ఇప్పటికీ చెబుతున్నా డర్టీ పిక్చర్ కుల అహంకారం తో.పెట్టిన పేరు.గ్రీన్ బుక్ అమనవీయంగా ఉన్న ఒక సమాజ నిష్కృతి, కథానాయకుడు, మహానాయకుడు కుల రాజకీయ ప్రాపగాండా

    • డాక్టర్ సీతారాములుగారూ, మంచి సినిమాను పరిచయం చేశారు. సినిమాచూసిన వారికి గ్రీన్ బుక్ పై మీకుకలిగిన అవగాహన వస్తే అది దర్శకుడి లోపమే. మీ సమీక్ష చదివాక నాకూ చూడాలని కౌతుకం కలిగింది. జాతి వివక్ష తీవ్రంగా ఉన్న రోజుల్లో, న్యూయార్క్ లోని విక్టర్ హ్యూగో గ్రీన్ అనే పోస్ట్ మేన్ ” ద నీగ్రో మోటరిస్ట్ గ్రీన్ బుక్ ” అనే ఈ ట్రావెల్ గైడ్ ప్రచురించేవాడు. ఈయనదీ మన శ్రీకృష్ణుడి రంగే. కారులో ప్రయాణం చేసే నల్లజాతి వారికి నిరపాయకరమైన దార్లూ, బస, తిండీ, పెట్రోలు బంకులూ, క్షవరం కొట్లూ వంటి వివరాలుండేవి. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ( ఎస్సో ) వారి బాంకుల్లోనూ, ఇతర చోట్లా పదిహేను వేల ప్రతులు అమ్ముడు పోయేవి. 1964 లో పౌరహక్కుల చట్టం అమలుకు వచ్చాక దీని అవసరం లేకపోయింది. అంతేకానీ, మను స్మృతీ కాదూ, పాడూ కాదు. నియమ నిబంధనలు అసలేకాదు.

      • నా రాత అర్ధం కాలేదు అంటే మీ అవగాహన లోపమే అని నేను అనను ఎందుకంటె నేను విన్న చదివినది “Although pervasive racial discrimination and poverty limited black car ownership, the emerging African-American middle class bought automobiles as soon as they could, but faced a variety of dangers and inconveniences along the road, from refusal of food and lodging to arbitrary arrest” ఒక దేశం లో హోటల్ లలో పెట్రోల్, బంకుల్లో, బహిరంగ ప్రదేశాల లో ఒక రంగు ఉన్న వాళ్లకు ప్రవేశం లేదు కాబాట్టి వాళ్ళ క్షేమం కోసం సౌకర్యం కోసం రాయబడిన నిబంధనావలి అని మీరు అంటే కూడా మీ అవగాహన లోపం అనను. మనిషిని మనిషిగా చూడని అనాగరిక ఆటవిక సమాజం అని నేను అనగలను.అను పరోక్షంగా మను స్మృతి ఏ లక్ష్యం కోసం “The metrical text is in Sanskrit, is variously dated to be from the 2nd century BCE to 3rd century CE, and it presents itself as a discourse given by Manu (Svayambhuva) and Bhrigu on dharma topics such as duties, rights, laws, conduct, virtues and others.” రెండున్న వేల ఎల్లకింద నే గ్రీన్ బుక్ ఇక్కడ మరో రూపం లో ఉంది అని నా అవగాన.(అన్నీ మన వేదాల లో ఉన్నాయష”) పాపం మధ్యలో ఆ దర్శకుణ్ణి ఎందుకు ఆడిపోసుకోవాలి.ఇప్పటికీ కుటుంబ సభ్యుల నుండి విమర్శకుల నుండి తిట్లు తింటున్నాడు.

  • మేం చెప్పినదేదీ ఖండిచకూడదు, మేం చెప్పేవన్నీ సత్యాలే అనేవారి తప్పుడు, బూటకపు వ్యాఖ్యానాలని ఖండించినప్పుడు అభిప్రాయాన్ని చెప్పే హక్కుని నిరాకరించడం అనే విక్టిమ్ హుడ్ వాదన పైకి తీసుకువస్తారు. అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దానిని ఖండించే హక్కు, ఆధారాలు అడిగే హక్కుని నిరాకరించడానికి విక్టిమ్ హుడ్ కార్డ్ వేస్తుంటారు. ఆ వాదన ఎలా వుంటుందో పైన వున్న వ్యాఖ్యలలో మనం చూడవచ్చు. మనువు చాలా చెప్పాడు. మనుస్మృతులలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి. తీసుకున్నా అది సమాజ ప్రవర్తనా తీరుని సంపూర్ణంగా నిర్దేశించిందా అంటే కాదని ఏమాత్రం చదివినా తెలుస్తుంది. ప్రశ్నించేవారిని మనువాదులు అని పేరుపెట్టడం అనేది తప్పుడు ఎత్తుగడ. దీని లక్ష్యం చదువరులలో వివేచనాశక్తిని చంపడమే. మనుస్మృతిలో ఏముందో, ప్రచారంలో వున్న తప్పుడు వ్యాఖ్యానాలు, అసంపూర్ణ వ్యాఖ్యానాలు ఎలా బూటకమో వివరంగా యిక్కడ చదువుకోవచ్చు.

    http://www.mediafire.com/file/cwnhi8m4kv8aq98/%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2581%25E0%25B0%25A7%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AE%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%2582.pdf/file

  • రాఘవేంద్ర గారూ, మీరు చాలా మర్యాదగానే గ్రీన్ బుక్ గురించి చెప్పింది తప్పు అని చెప్పినా దాన్ని మనువాదానికి ముడిపెట్టడమే ఎఱ్ఱగడ్డ లక్షణం. నువ్వు చెప్పింది తప్పు అని ప్రమాణాలతో సహా యిచ్చినా దానిని దాడిచేయడంగా వక్రీకరించడమే ఎఱ్ఱగడ్డ లక్షణం.

  • చక్కని విశ్లేషణ సీతా.
    ఒక్క విషయం. సారం గ వీధులలో పెద్ద వృషణాల ఆంబోతు లు విచ్చల విడిగా తిరుగుతూ, మదాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. సమాధానం సాధారణ భాషలో చెప్పవద్దు. వాటికి కులం అనే సబ్జెక్ట్ మాట్లాడితే ఎర్ర గుడ్డను చూసిన వెర్రి.
    సారంగా యాజమాన్యం ఇలాంటి పశువుల్ని ఎలా ఉపెక్షిస్తుందో అర్థం కావటం లేదు. ఇదేమైనా ఫేస్ బుక్ ఆ? ఎవడు పడితే వాడు , ఏది పడితే అది వాగడానికి? పైగా ఇదే మంద కులాన్ని వ్యతిరేకించి రాసిన ప్రతి రాత దగ్గరా పిచ్చి కుక్కలై ఎగబడుతున్నారు. వీళ్ళను నియంత్రించాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు