ఉన్న‌ట్టుండి..

“ఓ క‌థ చెబుతానాన్న‌.. ” అంటుంది.
త‌న చిన్న జంగిల్‌బుక్ ప్ర‌పంచంలో..
ఎన్నో జంతువుల జీవితాల్ని..
ట్విస్టుల‌తో చెబుతాది!

రౌడీబేబీ.. అని పాడుతావ‌చ్చి..
నా ముక్కు ప‌ట్టుకుని..
చెవులు మెలితిప్పుతాది!

నానీ నానీ..
బాబూ బాబూ..
*నీ విష‌య‌మ్స్ చెబుతా..
నువ్వు పిల్ల‌ప్పుడు..
పిట్టిగాడిగా ఇంత ఉన్న‌ప్పుడు..
జేజి *రెండు పిల‌క‌లు క‌ట్టి..
బ‌డికి పంపిస్తాది క‌దా..
నువ్వు ఎన్ములు ద‌గ్గ‌ర..
బ‌స్సాట ఆడుకుంటూంటే..
పిల్లోల్లు వ‌చ్చి బ‌డికి ఎత్త‌క‌పోయినారు క‌దా!*
అంటూ కృతి న‌గుతాది.

ఆ న‌గులోంచి ఇర‌వై ఏదేళ్లు ఎన‌క్కి..
దొర్లిన దొర్లు దొర్ల‌కుండా దొళ్లి..
మాయ‌మ్మ ఊరిమిండి నూరుకునేప్పుడు..
రోటికాడ‌పోయి ప‌డ‌తా.
చాట‌లోని చ‌న‌క్కాయ‌ల్ని తింటా.
ఎదురుగా సూచ్చే..
గాటిపాట‌న ఎనుములు..
నిమ్మ‌ళంగా మేచ్చాంటాయి.

కొట్రీ ఇంట్లో మ‌జ్జిగ చిలికిన వాస‌న‌..
ప‌క్క‌కు సూచ్చే..
గూగూడు కుళ్లాయ‌సోమి ప‌టం..
దండెంక‌ట్టెమీద ఉండే పాత‌బ‌ట్ట‌లు..
దంతెల‌కు దిగేసిన ఉట్టి..
ఆ దంతెల్లో త‌డికెల్లో ఎల‌క‌లు తిరుగ‌తా..
కిస‌కిస‌మంటా అరుచ్చాంటే..
మ‌ట్టి నా మింద ప‌డ‌తాది!

వ‌సారాల్లోకి వ‌చ్చానే..
అరుగుమీద ఉండే బారాక‌ట్టు..
గ‌డ్డి మోపులూ..
గూట్లో గుడ్డుపెట్టే ఎర్ర‌కోడిపెట్ట‌..
డ‌జ‌న్ పిల్ల‌ల‌తో ఆనందంగా న‌డిచే..
పిల్ల‌ల‌కోడికి ఉండే కొస్సి ముక్కు..
కాశీపుల్ల‌ల కొట్టం..
పంత‌లు, కాగులు, అల్లాబండ‌,..
అన్నీ అట్ల క‌న‌ప‌చ్చాయి.

ఒక్క న‌గుతో..
అమ్మా, నాన్న, చెల్లెలు..
నా ఫ్రెండ్సు, మా ఊరు క‌న‌ప‌డే..
ఆ జాబిలి న‌గు..
ఇట్లుంటాది.

*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

4 comments

Leave a Reply to Mamatha Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Kruthi ki nee child hood days baaga chebuthuntavemo kada. Iddari madya friendly atmosphere good. Prathi chinna vishayam pillalatho share chesukovadam Gud Raj. Mana childhood days very precious. Ippati pillalaku vaatini cheppadam thappa anubhuthini ivvalemu. Kaalam Entha change nu thechindo kada kadu kadu maname change avuthunnam chala chala. Monna Nuvvu Lord ganesh ku raasinatlu time back ku velthe baaguntundi kada….

    • Patha rojulu super. avva, tatha, jeji, abba cheppe kathalu & nirnayalu manataram baraka parimitam ayayi, present generation antha 24 hrs study& technology uchulopadi pothundu. Balyam antha palletullu periginavarike telusu. Pattanam vallaku teliyalante school selavullo vaste koddo goppo telustay.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు