


1.
యింకేదో
నిన్ను
వూరకే
ప్రేమిస్తేనో_
ఆరాధిస్తేనో_
చివరి రోజు వరకూ
పగలూ రాత్రీ
కలిసుంటేనో_
సరిపోదు!
యింకేం చేయొచ్చో మరి!
నేను నువ్వైపోయో_
నువ్వు నేనైపోయో_
మధ్య నలిగే
యీ యిచ్ఛల ఉచ్ఛున
తెంచుకు వచ్చే
ఆ దారెక్కడో?!
2.
నేలతల్లి ప్రేమ
ప్రేమ_
వసంతంలో వచ్చి
శిశిరంలో వెళ్లిపోయింది!
నేలతల్లి హృదయంలోకి
ఆశల వేళ్ళూనుకొని
మనసు మోడింకా బ్రతికే ఉంది!!
3.
ఆఖరి అడుగు
ప్రపంచ ప్రేమలు
పడిపోయాకా
ప్రేమ ప్రపంచమై
నిలిచిపోయా








simple straight superb
Thank you sir🙏😍
చక్కని కవనాలు.👏👏
చాలా ధన్యవాదాలండి 🙏😍☘️