అశేష విశేష సశేష వేషము

“అందరి నీళ్ళతోని నింపుకొని వొంపుకోవడం అనేది యూనిటీకి చిహ్నం”

పిచ్చి ముదిరింది. తలకు రోకలి చుట్టుకున్నాడు. చాలదని మొలకూ కట్టుకున్నాడు. తలకు మించిన తలపాగా వద్దని చెప్పినా చెవికెక్కలేదు. పనిలేని మంత్రి పిల్లీకలు గొరిగాడని సరిపెట్టుకున్నాం. మేం సిగ్గు పడుతున్నాం. వాడేమో గర్వపడుతున్నాడు.

రత్నం. జాతిరత్నం. మా పుత్ర రత్నం. తల్లీదండ్రి మాట వాడికి లెక్క లేదు. వాడి పిచ్చే వాడికి ఆనందం. వాడికి వంత చేరిన వాళ్ళూ వున్నారు. వాడికి వోటేసే యింతదాక తెచ్చారు.

ఏమైనా అంటే ‘దేశభక్తి’ అంటాడు.

“ఉచ్చపొయ్యడం దేశభక్తి యేమిట్రా?” అని అప్పటికీ అడిగాం.

“ఉచ్చ అందరూ పోస్తారు. కాని నేను పోసేది పొడవాటి వుచ్చ. అంత పొడవాటి వుచ్చ పోసినవారు యెవరూ యీ ప్రపంచంలోనే లేరు” గర్వంతో మావాడి కళ్ళు చెమర్చాయి. లోకమంతా గుర్తించినా యింట్లో మీరు మాత్రం గుర్తించడం లేదని, తిరిగి విమర్శిస్తున్నారని వాపోయాడు.

మావాడు చదివే స్కూళ్లో టాయిలెట్లు లేవు. టాయిలెట్లు లేవని వుచ్చ వస్తే పోసుకోకుండా వుండరుగా? అలాగే అందర్లాగే వుగ్గబట్టి పోసుకుంటున్నాడని అనుకున్నాం. ఇక్కడ నిలబడి అక్కడిదాక పొడావుగా పొయ్యడం పిల్ల చేష్ట అనుకున్నాం. కాదు, ప్రతిష్ట అన్నాడు. పెట్టని పోటీ పడ్డాడు. ఎవరైనా అరడుగు దూరంలో పోసుకుంటారు. కాదంటే అడుగు దూరంలో పోసుకుంటారు. కాని మా వాడు పోసింది ఐదు-తొమ్మిది-ఏడు అడుగల యెత్తున దూరాన్న పోస్తున్నాడని యెవరికి వారే లెక్కలు చెపుతున్నారు.

“ఇదేం పనిరా?, అయినా అంత వుచ్చ యెలా వస్తుందిరా?” అని అడిగాం.

“నా వొక్కడి వాటర్ కాదు, స్కూళ్లో చాలా మంది స్టూడెంట్స్ నుంచి సేకరించి తెచ్చిన వాటర్ బాటిళ్ళతో” సిగ్గుపడకుండా గొప్పగా అన్నాడు.

“నువ్వు వొకరికి యివ్వాల్సింది పోయి?” అన్నాం.

“అందరి నీళ్ళూ తాగి పోస్తుంటే ఆ విజయం అందరిదీ అవుతుంది” గర్వంగా అన్నాడు.

“ఏం ప్రయోజనం?” అని అడిగాం.

“అందరి నీళ్ళతోని నింపుకొని వొంపుకోవడం అనేది యూనిటీకి చిహ్నం” అన్నాడు.

“నువ్వు చేసినదానివల్ల ఆ స్కూలు పక్కన అంతా ఖాళీ చెయ్యాల్సి వచ్చింది” నొచ్చుకుంటూ అన్నాం.

“లేదు, యీ చేసే పని గిన్నీసుబుక్కు రికార్డు యెక్కుతుంది. ఇది చూడడానికి వొచ్చిన వాళ్ళకు టికెట్ పెడతాం. వచ్చినవాళ్ళ కోసం కేంటిన్లు కడతాం. హోటళ్ళూ పెడతాం. బిజినెస్ బాగా జరుగుతుంది. అలా  వచ్చిన డబ్బుతో టాయిలెట్లు కడతాం. అభివృద్ధి పరుస్తాం. మా స్కూల్ని బాగుచేసుకుంటాం. కొత్త స్కూళ్ళూ కాలేజీలూ కట్టిస్తాం. యూనివర్సిటీలు కూడా పెడతాం” తపించిపోతూ తహతహలాడుతూ చెప్పాడు.

మేం ఫైర్ అవబొయ్యాం. కాని మా వాడు యిన్సుపైర్ అయ్యింది వేరు!

*

 

 

బమ్మిడి జగదీశ్వరరావు

5 comments

Leave a Reply to శ్రీనివాసుడు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బిజినెస్ జరగడాన్ని గురించి, గిన్నీస్ బుక్ రికార్డుల గురించి పొడుగాటి కాలరేఖలో ఎక్కడాన్ని గురించి 80 ఏళ్ల నుండీ లేపనాలు పూసి రెడ్్ స్క్వేర్లో భద్రపరుస్తున్న లెనిన్ శవాన్ని అడిగితే సరిపోతుంది. లెేనిన్ మాసోలియమ్ గురించి చాలా సౌకర్యంగా మరచిపోయి, దేశభక్తి గురించి పొడుగాటి వెర్బల్ డయేరియాని ఓ గొప్ప వచన రచనగా పాఠకుల మీదకి విసరడమే నేటి ద్వంద్వ వికృతం. 53 శాతం మంది రష్యన్లు దాన్ని అక్కడనుండి తొలగించాలని క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరపాలని కోరినా కొన్ని కోట్ల మంది దర్శించారని లెక్కలు చెప్పడం గురించి తెలియకపోవడం మిడిమిడిజ్ఞాన ప్రదర్శన. పిచ్చి ముదిరితే రోకలినే కాదు, కత్తి, కొడవలిని కూడా చుట్టుకోవడం గత ఎనభై ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. చర్రిత మరచిపోయి, నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని దేశభక్తి గురించి మాట్లాడితే ఎలా?

    • ప్రపంచంలో ఒక కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండి ఏదైనా తప్పు నిర్ణయం లేదా పాలనాపరమైన తప్పేదైనా చేస్తే మిగిలిన ప్రపంచం లోని కమ్యూనిస్టు లంతా బాధ్యత వహించాలా సర్.

      అది రష్యన్ల సమస్య. వాళ్ళ దేశ ప్రజలు చూసుకుంటారు. మన దేశంలో సమస్య గురించి మనం మాట్లాడదాం.

      • అలాగే చూసుకుందాం కమ్యూనిస్టులమని మీరు ఒప్పుకున్నారు గనక. పటేల్ విగ్రహం వలన కలిగిన నష్టమేమిటో చెప్పగలరా? (ఆర్థిక మరియు సామాజిక)

  • మామో జెడాంగ్ యొక్క ఉత్త తల భాగాన్నే 300 మిలియన్ డాలర్ల రెడ్ స్టార్ ఓవర్ చైనా ప్రజల సొమ్ముతో 100 అడుగుల ెఎత్తులో గ్రానైట్ తో కట్టారు చైనాలోని ఆరంజ్ ఐల్ చాంగ్ షాలో 2007 లో. సిగ్గుపడడం, గర్వపడడం, పిల్లీకలు గొరగడం వంటివి అప్పుడే మొదలయ్యాయి. సమస్త శరీర వ్యర్థాలను దాచుకోడానికి శరీరం, మెదడు లాంటివి యిచ్చారు. వాటిని కేవల అక్కసు కారణంగా బయటకి తెచ్చి వచనంలో చూపించేవారికి అలా వ్యర్ళాలను దాచుకున్న శరీరాన్ని రష్యాలో 80 ఏళ్ల నుండీ లేపనాలు పూసి కాపాడుతున్నవారు ెఎందుకో పాపం కనబడరు.

  • గ్రామాలు ఖాళీ చేయించి,వందలమంది నిర్వాసితులను చేసి నిర్మించిన వల్లభాయ్ పటేల్ విగ్రహం వెనకాల వేల కోట్ల రూపాయలు మాత్రమే కాదు ఇంతమంది నిర్వాసితుల దుఖం ఉంది.జానెడు భూమి నీ కోల్పోయి దేశభక్తి నిరూ పించుకివాలా ఆ బీద ప్రజలు? పాలక వర్గ అభివృధ్ది పథకాల వెనుక ఉన్న ఓట్ల రాజకీయాలను సెటైరికల్ గా బాగా చెప్పారు bajaraa గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు