సత్యం శంకరమంచి “భోజన చక్రవర్తి” ఆడియో-1

ఎప్పుడో మనమెక్కడో చూసి మరిచిపోయిన అపరిచితల్లాంటి కథలు. ఇక్కడే మన పక్కనే నిలబడి మనల్నే గమనిస్తున్న చిరపరిచితుల్లాంటి కథలు.

మరావతి కథ ఒక్కో  కథా ఒక్కో  సజీవ శిల్పం. ఎప్పుడో మనమెక్కడో చూసి మరిచిపోయిన అపరిచితల్లాంటి కథలు. ఇక్కడే మన పక్కనే నిలబడి మనల్నే గమనిస్తున్న చిరపరిచితుల్లాంటి కథలు.

ఏ కథ ఎవరిదైనా, ఏం చెబుతున్నా, ఏదీ శ్రద్ధగా గమనించకుండా చదివేసినా సరే, ఒక్క  అనుభవం మాత్రం ఈ కథలు చదివినవారంతా అనుభవించి తీరాల్సిందే. ప్రతీ కథలోనూ, ఎక్కడో, ఏదో సందర్భంలో, మన కన్ను ఆనందాన్నో, దుఃఖాన్నో చెమర్చి తీరుతుంది. లేదూ, ఏడవటం నాకలవాటు లేదంటే, గుండె బరువైనా ఎక్కిపోతుంది.

అమరావతి కథల గురించి ఎవరెన్నైనా చెప్పనీ, నే చెప్పేది మాత్రం ఒక్కటే. ఈ కథలు చదివితే, అలలు అలలుగా మనసు చెదిరిపోవాల్సిందే. ఎంత బండరాయివంటి హృదయపు స్వంతదారైనా, తానూ మనిషినేనన్న విషయాన్నోసారి గుర్తు చేసుకోవాల్సిందే.

అందుకే శంకరమంచి సత్యం గారు 1975-77ల మధ్య  కాలంలో రాసిన ఈ కథల్ని, ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించినా, శ్యామ్ బెనగల్ వీటిని ధారావాహికగా చిత్రీకరించినా, అవి వరుసగా దూరదర్శన్ లో ప్రసారమైనా (1994-95), రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డును అందించినా (1979) పెద్ద విచిత్రమేమీ కాదు.

 

భవాని ఫణి

10 comments

Leave a Reply to Ram Prasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు