Poems for Programmers – 1

ఏ వరుసా లేకుండా
పిలిచినా పిలవకపోయినా
నిక్కి చూసే జ్ఞాపకాల algorithm లో

విచ్చుకుని

మూడువంకర్లు తిరిగి ముడుచుకుని

పుటుక్కున రాలిపడే పూలలా

ఒకటో రెండో “hey, what’s up?”లు తప్ప

ఉదయానికి సాయంత్రానికి మధ్యన పెద్దగా ఏమీ జరగదు.

ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔటో

లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔటో

బబుల్ సార్టో

Heap సార్టో…

ఏ వరుసా లేకుండా

పిలిచినా పిలవకపోయినా

నిక్కి చూసే జ్ఞాపకాల algorithm లో

variable లా మారిపోయి…

పరిచయమున్న పరిమళాల మధ్య

interface లేని package లా

program కి program కి మధ్య సిగరెట్ లా dispose అవుతూ…

ఎమోషన్ కి ENTER Key కి మధ్య సయోధ్య కుదిర్చి

Mouse ను చేయిజారిపోకుండా పట్టుకుని

void Life(){} ని private గా implement చేసుకోవడం తప్ప…

ఇక్కడ

ఉదయానికి సాయంత్రానికి మధ్యన పెద్దగా ఏమీ జరగదు.

***

 పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

రవి వీరెల్లి

3 comments

Leave a Reply to m s naidu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు